View

పూజా కార్యక్రమాలు జరుపుకున్న "కార్టూన్స్ 90's కిడ్స్ బే ఈడా"

Wednesday,February02nd,2022, 03:47 PM

90's లో పుట్టిన వారి అనుభవాలను తెలుపుతూ చేసిన అడ్వెంచర్స్ చిత్రమే "కార్టూన్స్ 90's కిడ్స్ బే ఈడా" దీపాల ఆర్ట్స్ పతాకంపై త్రిగున్, పాయల్ రాధాకృష్ణ, దీపక్ సరోజ్, హర్ష, నటీనటులుగా సాయి తేజ సప్పన్న దర్శకత్వంలో శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "కార్టూన్స్ 90's కిడ్స్ బే ఈడా". ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి  ప్రముఖ దర్శకుడు ఆర్.జీ.వి, నటులు సిద్దు జొన్నలగడ్డ, ఆకాష్ పూరి, ప్రియదర్శి, ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.


పూజా కార్యక్రమాలు అనంతరం నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నిచ్చారు.నటుడు ఆకాష్ పూరి కెమెరా స్విచ్ ఆన్ చేయ్యగా.. ప్రముఖ దర్శకుడు ఆర్.జీ.వి గారు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...


చిత్ర దర్శకుడు సాయి తేజ సప్పన్న మాట్లాడుతూ.. నేను చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ అభిమానిని. వారి సినిమాలు చూస్తూ పెరిగాను.ఆయన ఇన్స్పిరేషన్ తో డిప్లమో నుంచి డైరెక్టర్ కావాలనే బలమైన కోరిక నాలో కలిగింది. "డీ" ప్రోగ్రాం లో డాన్సర్ గా, కంటెస్టెంట్ గా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశాను.ఆ తరువాత ఒక  మంచి కథ రాసుకొని నిర్మాత శ్రీకాంత్ గారికి చెప్పడం జరిగింది.  ఫ్రెండ్షిప్ జోనర్ లో నేను రాసుకున్న ఈ కథ నిర్మాత శ్రీకాంత్ గారికి నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ను ఇగ్నోర్ చేస్తే మిగిలిన ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు.ఆ తరువాత ఇగ్నోర్ చేసిన ఫ్రెండ్ ఎలా ఉంటున్నాడు అనే దానికపై ఈ స్టోరీ ని రాయడం జరిగింది. ఫుల్ ఔట్ ఔట్ కామెడీ డ్రామా గా తెరకెక్కుతుంది. 90's లో పుట్టిన వారి మెమొరబుల్స్ అన్ని ఈ సినిమాల్లో కనిపిస్తాయి. వారు ఈ సినిమా చూస్తున్నప్పుడు వారు చేసిన పనులను గుర్తుకు తెచ్చుకొని హ్యాపీగా ఫీలవుతారు. ఇందులో హీరోగా త్రిగున్, పాయల్ రాధాకృష్ణ హీరో, హీరోయిన్లు గా నటిస్తున్నారు. వారికి ఈ కథ చెప్పినపుడు చాలా ఎగ్సైట్ అయ్యారు.వీరితోపాటు దీపక్ సరోజ్, హర్ష లతో పాటు నేను కూడా ఇందులో పప్పు అనే మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. మేం చేస్తున్న ఈ చిత్రాన్ని మీ రందరూ బ్లెస్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.


నిర్మాత  శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ. మా సినిమా పూజా కార్యక్రమానికి వచ్చిన ఆర్.జీ.వి గారికి, సిద్దు జొన్నలగడ్డ, ఆకాష్ పూరి, ప్రియదర్శి, లకు ధన్యవాదాలు. దీపాల ఆర్ట్స్ ప్రొడక్షన్ లో నేను నిర్మిస్తున్న నాలుగవ చిత్రమిది.ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కథ. తమ్ముడు సాయి తేజ సప్పన్న మంచి కథ రాసుకొన్నాడు.ఈ కథ నాకే కాకుండా అందరికీ నచ్చింది మంచి టీం తో ఫుల్ ఔట్ ఔట్ కామెడీ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.


చిత్ర హీరో త్రిగున్ మాట్లాడుతూ..కొండా బయోపిక్ లో చేస్తున్న నేను ఆర్.జి.వి గారు మంచి కథలను సెలెక్ట్ చేసుకొని చెయ్యమని సూచనలు ఇచ్చారు.ఈ సినిమా గురించి తనతో చెప్పడంతో "కార్టూన్" అనే సినిమా ప్రతి ఒక్కరికీ రీచ్ అవుతుందని అప్రసియేట్ చెయ్యడం జరిగింది. శ్రీకాంత్ గారు నేను ఇంతకుముందు సినిమా చేద్దాం అనుకున్నాము. కానీ కుదరలేదు. ఇప్పుడు మంచి స్క్రిప్ట్ కుదిరింది. యాక్షన్ సినిమా చేద్దాం అనుకున్న టైం లో దర్శకుడు నాకీ కథ చెప్పాడు.ఈ కథ వినగానే నాకు నా కాలేజ్ డేస్ గుర్తుకు వచ్చాయి.ఈ కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. పాయల్ రాధాకృష్ణ చేసిన తరగతి గది వెబ్ సిరీస్ తో తనకు మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఇలా మంచి ఆర్టిస్టులతో కలసి చేస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అయ్యేలా ప్రేక్షకులు ఆదరించాలి. ఈ సంవత్సరం మా అందరికీ ఈ చిత్రం తో మంచి పేరు రావాలని మా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. 


హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. దర్శకుడు నాకీ కథను చెప్పినపుడు చాలా ఎగ్సైట్ అయ్యాను. ఇలాంటి మంచి ప్రాజెక్ట్ లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.


నటుడు వైవా హర్ష మాట్లాడుతూ..ఇది ఫుల్ ఔట్ ఔట్ కామెడీ స్క్రిప్ట్ సినిమా చూసిన వారంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతారనే నమ్మకం ఉందని అన్నారు.


దీపక్ సరోజ్ మాట్లాడుతూ.. చైల్డ్ ఆర్టిస్టుగా 45 సినిమాలు చేశాను.ఈ సినిమాలో మంచి రోల్ చేస్తున్నాను.దీపాల ఆర్ట్స్ లో నాకీ అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు 


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు. 


నటీనటులు
త్రిగున్, పాయల్ రాధాకృష్ణ, దీపక్ సరోజ్, వైవా హర్ష, సాయి తేజ సంపన్న తదితరులు 


సాంకేతిక నిపుణులు
ప్రొడ్యూసర్ : శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ, డైరెక్టర్ : సాయి తేజ సప్పన్నడి. ఓ పి : చరణ్ మాధవనేని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గుంపిన కళ్యాణ్ చక్రవర్తి కో రైటర్ అండ్ ఏడి : నరేంద్ర తేజ.ఆర్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ : శివ భారత్ వల్లంశెట్టి అసోసియేట్ డైరెక్టర్ : లక్ష్మీనారాయణ కూనం శెట్టి కో-డైరెక్టర్ : వి పురుషోత్తం రెడ్డి ఫస్ట్ ఏ డి : గౌతంకుమార్ ఎన్ అసిస్టెంట్ డైరెక్టర్ :అరవింద్ సాహుల్.వైకో డైలాగ్ : విశ్వనాథ్ కందుకూరి కాస్ట్యూమ్స్ డిజైనర్ అండ్ స్టైలిష్ట్ : అనన్య మిట్టల్ఎడిటర్ :: కె.బాలకృష్ణారెడ్డి (బాలు) ఆర్ట్ డైరెక్టర్ : పిఎస్ వర్మ ప్రొడక్షన్ మేనేజర్ : రమేష్ మిర్తి పాటి పి ఆర్ వో : శ్రీపాల్ చోల్లేటి పబ్లిసిటీ డిజైనర్ :సోమేశ్ రెడ్డి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !