View

మార్చి 4న 'టెన్త్ క్లాస్ డైరీస్' రిలీజ్ - అవికా గోర్ పరిచయ గీతం విడుదల

Saturday,February05th,2022, 01:05 PM

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు.  'రోజ్ విల్లా', 'ముగ్గురు మొనగాళ్లు' చిత్రాలను అచ్యుత రామారావు నిర్మించారు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'గరుడవేగ' అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాసరెడ్డి, 'వెన్నెల' రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, 'సత్యం' రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.


మార్చి 4న సినిమా విడుదల కానుంది. ఈ రోజు కథానాయిక అవికా గోర్ పరిచయ గీతం 'ఎగిరే... ఎగిరే...'ను విడుద‌ల చేశారు. మ్యాచో స్టార్ రానా, కథానాయిక శ్రియ, సినిమాటోగ్రాఫర్ మది... ముగ్గురు ప్రముఖులు ఆన్‌లైన్‌లో పాటను విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి సంగీతంలో సురేష్ గంగుల రాసిన ఈ పాటను ప్రముఖ గాయని చిన్మయి పాడారు. విజయ్ బిన్నీ నృత్యరీతులు సమకూర్చారు.  


నిర్మాతల్లో ఒకరైన అచ్యుత రామారావు మాట్లాడుతూ "సినిమాలో అవికా గోర్ పరిచయ గీతం 'ఎగిరే... ఎగిరే...'ను ఈ రోజు విడుదల చేశాం. అమ్మాయి కలలు, కోరికలు, ఆశలు, ఆశయాలు... అన్నీ కలగలిపిన పాట ఇది. ఆన్‌లైన్‌లో సాంగ్ విడుదల చేసిన రానా, శ్రియ, మది గారికి థాంక్స్. కమర్షియల్ హంగులతో 'టెన్త్ క్లాస్ డైరీస్' తీర్చిదిద్దాం. సరికొత్త కాన్సెప్ట్ ఇది. టెన్త్ క్లాస్ నేపథ్యంలో సన్నివేశాలు  ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. మనం డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసినా... టెన్త్ క్లాస్ అనేది మెమరీ మైల్ స్టోన్ లాంటిది. ఆ మెమ‌రీస్ మిగ‌తా జీవితం మీద డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా ప్ర‌భావం చూపిస్తాయి. ఒక రకంగా లైఫ్ పార్ట్‌న‌ర్ లాంటిది. ఆ నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా, లైవ్లీగా సినిమాలో సన్నివేశాలు ఉంటాయి. ఇదొక మంచి కామెడీ ఎంటర్టైనర్. 'రోజ్ విల్లా', 'ముగ్గురు మొనగాళ్లు' తర్వాత ఈ సినిమాతో నిర్మాతగా మరో హిట్ అందుకుంటాననే నమ్మకం ఉంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజ‌ర్‌ను 15 లక్షల మంది చూశారు. మార్చి 4న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అని అన్నారు.


'గరుడవేగ' అంజి మాట్లాడుతూ "ప్రతి అమ్మాయి తనను తాను చూసుకునేలా ఈ పాట ఉంటుంది. జీవితంలో ఎన్నో ఆశలు, ఆశయాలతో ఉండే అమ్మాయిల మనోభావాలకు ప్రతిరూపం ఈ పాట. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. టీజ‌ర్‌కు 15 లక్షల వ్యూస్ రావడం సంతోషంగా ఉంది. సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. మార్చి 4న సినిమాను విడుదల చేస్తాం. ఛాయాగ్రాహకుడిగా నా 50వ చిత్రమిది" అన్నారు.


'టెన్త్ క్లాస్ డైరీస్'


తారాగణం:
శ్రీరామ్, అవికా గోర్, శ్రీనివాసరెడ్డి, 'వెన్నెల' రామారావు, అర్చన (వేద), హిమజ, శివ బాలాజీ, మధుమిత, 'సత్యం' రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయి రామ్, రాజశ్రీ నాయర్ , సత్యకృష్ణ, రూపలక్ష్మి, 'తాగుబోతు' రమేష్, 'చిత్రం' శ్రీను, గీతా సింగ్, రోహిణి (జబర్దస్త్), 'జెమినీ' సురేష్, 'ఓ మై గాడ్' నిత్య, రాహుల్, 'కంచెరపాలెం' కేశవ, ప్రేమ్, భవ్య, కావేరి , అంబటి శ్రీను, జీవన్ (జబర్దస్త్), భాష, కేఏ పాల్ రాము, గణపతి (జబర్దస్త్), రాకేష్ (జబర్దస్త్), కమల్, మహేష్ మచిడి


సాంకేతిక నిపుణుల వివరాలు:
కథ : రామారావు, స్క్రీన్ ప్లే - డైలాగ్స్: శ్రుతిక్, లిరిక్స్: చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, కొరియోగ్రఫీ: శేఖర్ వీజే, విజయ్ బిన్నీ, సన్నీ, ఫైట్స్: స్టంట్స్ జాషువా, పబ్లిసిటీ డిజైనర్: అనంత్, ప్రొడక్షన్ కంట్రోలర్: నరేన్ జి సూర్య, మేకప్: నారాయణ, కాస్ట్యూమ్స్: శ్రీదేవి కొల్లి, కో-డైరెక్టర్: విజయ్ కామిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎస్. చిన్నా, మ్యూజిక్: సురేష్ బొబ్బిలి, కో-ప్రొడ్యూసర్: రవి కొల్లిపర, సమర్పణ: అజయ్ మైసూర్, నిర్మాతలు: అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం, సినిమాటోగ్రఫీ & దర్శకత్వం : 'గరుడవేగ' అంజి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !