View

గ్రాండ్ గా 'సెహరి' ఫ్రీ రిలీజ్ ఈవెంట్

Tuesday,February08th,2022, 02:04 PM

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’. వర్గో పిక్చర్స్ ప‌తాకంపై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన‌ ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ప్రీరిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్‌లో సోమ‌వారం రాత్రి ఘ‌నంగా జ‌రిగింది.


ఈ సంద‌ర‌్భంగా హీరో హ‌ర్ష్ కనుమిల్లి మాట్లాడుతూ, మా సినిమాకు అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. సోష‌ల్ మీడియాలో మీమ్స్‌ ద్వారా మంచి మైలేజ్ వ‌చ్చింది. ఈరోజు హీరో విశాల్ గారు రావాల్సి వుంది. కొన్ని కార‌ణాల‌వ్ల‌ల రాలేక‌పోయారు. నేను స్కూల్ డేస్‌లో వ‌ర‌స్ట్ స్టూండెట్‌ను. చాలా సార్లు ఫెయిల్ అయ్యాను. నేను కొన్ని షాట్ ఫిలింస్ చేశాను. కొన్ని సినిమాల‌కు ఆడిష‌న్ వెళ్ళాను. కానీ ఎక్క‌డా సెల‌క్ట్ కాలేదు. అప్పుడు నా స్నేహితులు నీకు నువ్వే ప్రూవ్ చేసుకోవాల‌న్నారు. దాంతో క‌సి పెరిగింది. అలా హీరోగా సెహ‌రి చేశాను. మా సినిమా లాక్‌డౌన్ టైంలో బాల‌య్య‌బాబుగారి పోస్ట‌ర్ లాంచ్ చేశారు. దాంతో సెహ‌రి స్థాయి పెరిగింది. మ‌రోసారి ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాట‌లు విడుద‌లై మంచి ఆద‌ర‌ణ పొందాయి. య‌శ్ మాస్ట‌ర్ బాగా కంపోజ్ చేశారు. కెమెరామెన్ భ‌విష్య‌త్‌లో మంచి స్థాయికి ఎదుగుతాడు. మంచి క‌ల‌ర్స్ ఇందులోవాడాడు. అనీషా పెట్ ల‌వ‌ర్‌గా న‌టించింది. చాలామందికి క‌నెక్ట్ అవుతుంది. అక్షిత పాత్ర స‌స్పెన్స్‌తో వుంటూ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. సంగీత ద‌ర్శ‌కుడు కోటిగారు మా చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. అంద‌రూ ఇందులో బాగా న‌టించారు. ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా. మ‌ళ్లీ మ‌ళ్ళీ చూసేట్లుగా సెహ‌రి వుంటుంద‌ని గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌ను అని తెలిపారు.


సంగీత ద‌ర్శ‌కుడు కోటిగారు మాట్లాడుతూ, ఇందులో న‌న్ను న‌టుడిగా చూపించారు. కొత్త త‌ర‌హాలో క‌నిపిస్తాను. ప్ర‌శాంత్ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. నేను సంగీతం చేసే తొలి రోజుల్లో అన్ని పాట‌లు హిట్ అవ్వాల‌నే క‌సితో చేసేవాడిని. అది ప్ర‌శాంత్‌లో చూశాను. ఇందులో 9పాట‌లున్నాయి. అన్నీ కేచీగా వున్నాయి. ఆయ‌నకు స‌రిప‌డా టీమ్‌కూడా దొరికింది. ఓసారి చిరంజీవిగారు నాతో ఇలా అన్నారు. ఇన్నాళ్ళు సంగీతం చేశావ్‌. ఎంతో ఎంజాయ్ చేశావ్‌. న‌టుడిగా చేస్తే బాగా ఎంజాయ్ చేస్తావ్ అని అన్నారు. అలాగే ఈ సినిమాలో న‌టించాను. ముందు ముందు మంచి పాత్ర‌లు వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తాన‌ని అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు  జ్ఞానసాగర్‌ ద్వారక మాట్లాడుతూ, నా లైఫ్‌లో సెహ‌రి మ‌ర్చిపోలేనిది. ఈ సినిమా చేయ‌డానికి బ్ర‌ద‌ర్ అనిల్ కార‌ణం. ఆయ‌న వ‌ల్లే ఈ సినిమా చేయ‌గ‌లిగాను. హ‌ర్ష్ చెప్పిన క‌థ విన‌గానే వెంట‌నే చేస్తాన‌న్నా. అప్ప‌డే హిట్ అవుతుంద‌ని చెప్పాను. మా ఇద్ద‌రి జ‌ర్నీ సూప‌ర్‌గా వుంది. సినిమాకు ఆరు పాట‌లు ఇవ్వ‌డ‌మే గ్రేట్ అనుకునే టైంలో 9 పాట‌లు ఇవ్వ‌డం మామూలు విష‌యం కాదు. అన్నీ అద్భుతంగా వ‌చ్చాయి. ఇందులో అంద‌రూ బాగా న‌టించార‌ని తెలిపారు.


నిర్మాత అద్వయ జిష్ణు రెడ్డి మాట్లాడుతూ, రెండు లాక్‌డౌన్‌లు త‌ట్టుకుని ఈస్థాయికి వ‌చ్చాం. ఓటీటీలో మంచి ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ థియేట‌ర్‌లోనే ఈ సినిమా చూస్తే సెల‌బ్రేష‌న్ చేసిన‌ట్లుంటుంది. అందుకే అంద‌రూ థియేట‌ర్‌లోనే ఈనెల 11న చూడండి అంటూ తెలిపారు.


సంగీత ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ విహారి మాట్లాడుతూ, సెల‌బ్రేష‌న్ మొద‌ల‌య్యాయి. కోటిగారి సంగీతానికి నేను అభిమానిని. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు బాగా ట్యూన్ ఇస్తారు. ఈ ఫిలింలో ఆయ‌న‌తో షేర్ చేసుకునే భాగ్యం క‌లిగింది. ఇందులో 9 పాట‌లున్నాయి. ర‌చ‌యిత‌ల‌కు, గాయ‌కుల‌కు పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు.


క‌థానాయిక సిమ్ర‌న్ మాట్లాడుతూ, చాలా ఫ‌న్ మూవీ. నాతో చాలా ఓపిగ్గా న‌ట‌న రాబ‌ట్టుకున్నారు.  ఈ సినిమాను థియేట‌ర్‌లోనే చూడాలని ద‌ర్శ‌క నిర్మాత‌లు విడుద‌ల చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 11న చూసి ఎంజాయ్ చేయండి అని తెలిపారు.


కేరెక్ట‌ర్ న‌టుడు బాల‌కృష్ణ మాట్లాడుతూ, ఇందులో అమ్మాయిల ఫాద‌ర్‌గా న‌టించాను. హర్ష్ పెద్ద స్టార్‌గా ఎదుగుతాడు. ఇందులోని పాట‌లు చాలా కేచీగా వున్నాయి. సినిమా స‌క్సెస్ కావ‌డానికి అన్ని అంశాలు ఈ సినిమాలో వున్నాయి అని తెలిపారు.


ఇంకా కెమెరామెన్ అర‌వింద్ విశ్వ‌నాథ్‌, ఎడిట‌ర్ ర‌వితేజ గిరిజాల, అక్షిత, అనీషా త‌దిత‌రులు మాట్లాడుతూ, చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !