View

విశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదలైన 'ముఖచిత్రం' టీజర్

Thursday,February10th,2022, 02:09 PM

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ముఖచిత్రం. కలర్ ఫొటో మూవీ తో హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. కాల భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల ముఖచిత్రం సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ అనే కొత్త దర్శకుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఫన్ అండ్ ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ను గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు.


అనంతరం విశ్వక్ సేన్ మాట్లాడుతూ...నాకు ఈ నగరానికి ఏమైంది చిత్రంలా సినిమా బండి తర్వాత వికాస్ వశిష్టకు ముఖచిత్రం డిఫరెంట్ సినిమా అవుతుంది. ప్రియ వడ్లమానికి ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. తను ఎప్పటి నుంచో ఓ మంచి సినిమా కోసం వేచి చూస్తోంది. టీజర్ చాలా బాగుంది. టెక్నికల్ గా ఆకట్టుకునేలా ఉంది. సినిమా చూపిస్తా అన్నారు. సినిమా చూసేందుకు నేను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. మొత్తం టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.


ప్రియ వడ్లమాని మాట్లాడుతూ..ముఖచిత్రం లాంటి గొప్ప సినిమా నాకు ఇచ్చినందుకు సందీప్ రాజ్ కు థాంక్స్. ఇలాంటి సినిమా కోసం నేను చాలా కాలంగా వేచి చూస్తున్నాను. ఇప్పుడు ఏమీ మాట్లాడలేకపోతున్నా. ప్రీ రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతా. అన్నారు.


నిర్మాత ప్రదీప్ మాట్లాడుతూ...ప్రొడక్షన్ లో మాకు అనుభవం లేదు. దాంతో టీమ్ ను కొంత ఇబ్బంది పెట్టాము. కానీ అందరూ అర్థం చేసుకుని సినిమా కంప్లీట్ చేశారు. మా యూనిట్ అందరికీ థాంక్స్. అన్నారు.


దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ...ముఖచిత్రం కు మొదట హీరోను వెతకడమే టాస్క్ అయ్యింది. సినిమా బండి చూశాక వికాస్ పర్పెక్ట్ అనుకున్నాము. 30 వెడ్స్ 21 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చైతన్య కు లీడ్ క్యారెక్టర్చె ప్పగానే చేస్తానన్నారు. ప్రియవడ్లమాని లేకుంటే ఈ సినిమా లేదు. తను ఎంత కీలకమో, ఎంత బాగా నటించిందో సినిమా చూస్తే తెలుస్తుంది. ఎస్ కే ఎన్ నిర్మాతగా నా దర్శకత్వంలో ఓ పెద్ద సినిమా చూడాలని కోరుకుంటున్నా అన్నారు.


హీరో వికాస్ వశిష్ట మాట్లాడుతూ..సినిమా బండి విడుదలయ్యాక ముఖ చిత్రం ఆఫర్ నా దగ్గరకు వచ్చింది. సందీప్ కథ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా ఉందనిపించింది. సినిమా అంతకంటే బాగా రూపొందించారు. ఎస్ కేఎన్ కు సినిమా మీద ధ్యాస. ఎప్పుడూ ముఖచిత్రం గురించే చర్చించేవారు. ప్రియ, చైతన్య నాకు మంచి మిత్రులు అయ్యారు. టెక్నికల్ గా సినిమా సూపర్బ్ గా ఉంటుంది అన్నారు.


చైతన్య రావ్ మాట్లాడుతూ..ముఖచిత్రం బ్యూటిఫుల్ ఫిల్మ్. సందీప్ ఏమనుకుని ఈ కథ రాశాడో గానీ సినిమా చూస్తే మీకు ఎంత అందంగా సినిమా ఉంటుంది అనేది తెలుస్తుంది. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. అన్నారు.


ఆయేషా ఖాన్ మాట్లాడుతూ...తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం అవుతున్నాను. ముఖచిత్రంలో మాయ అనే క్యారెక్టర్ లో నటించాను. ముఖ చిత్రం నాకు మంచి కెరీర్ ఇస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.


ముఖచిత్రం దర్శకుడు గంగాధర్ మాట్లాడుతూ...టీజర్ లో మీరు చూసింది కొంతే. ఇంతకు వంద రెట్లు సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను ఈ స్టేజీ మీద ఉండేందుకు కారణమైన సందీప్ అన్నకు థాంక్స్. అన్నారు.


ప్రెజెంటర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ...ఇవాళ చిరంజీవి గారు ఇతర ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగన్ గారితో కలిసి టాలీవుడ్ సమస్యలకు పరిష్కారానికి ముందుకొచ్చారు. ఇలాంటి మంచి రోజున మా ముఖ చిత్రం సినిమా టీజర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఇవాళ్టి సమాజంలోని ఓ బలమైన అంశాన్ని ఎంచుకుని సందీప్ రాజ్ కథ రాశాడు. రెండు షేడ్స్ లో ప్రియ వడ్లమాని అద్భుతంగా నటించింది. ఇవాళ పాన్ ఇండియా లెవెల్లో డిజిటల్ వ్యూస్ లో పుష్ప, కలర్ ఫొటో సినిమాలు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. అది మన టాలీవుడ్ కు గర్వకారణం. ముఖచిత్రం డిఫరెంట్ మూవీ అవుతుంది. అన్నారు.


నటీనటులు - వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్


సాంకేతిక నిపుణులు - సంగీతం - కాల భైరవ, ఎడిటింగ్ - పవన్ కళ్యాణ్, సమర్పణ - ఎస్ కేఎన్, నిర్మాతలు - ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల, కథ స్క్రీన్ ప్లే, మాటలు - సందీప్ రాజ్, దర్శకత్వం - గంగాధర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !