View

'విశ్వ‌క్' ట్రైలర్ ఆవిష్కరణ - ఈ నెల 18న విడుద‌ల‌

Saturday,February12th,2022, 04:21 PM

అజయ్ కతుర్వార్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న  చిత్రం `విశ్వ‌క్`. గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ బేన‌ర్‌పై  తాటికొండ ఆనందం బాల కృష్ణ నిర్మిస్తున్నారు. వేణు ముల్కాకా ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. కాగా, ఈ సినిమా పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ముగించుకుని సెన్సార్ పూర్తిచేసుకుంది. ఫిబ్ర‌వ‌రి 18న ఈ సినిమా విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్ థియేట‌ర్‌లో విశ్వ‌క్ చిత్రం ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది.


చిత్ర నిర్మాత తాటికొండ ఆనందం బాల కృష్ణ మాట్లాడుతూ, బిందాస్‌గా లైఫ్ గ‌డిచిపోతున్న నాకు ఏదో ప్ర‌త్యేక చూపించాల‌ని సినిమాలోకి ప్ర‌వేశించాను. ద‌ర్శ‌కుడు వేణు క‌థ చెప్పిన‌ప్పుడు నాకు పాఠాలు బోధించిన గురువు గుర్తుకు వ‌చ్చారు. మ‌న భార‌త‌దేశంలో యూత్ యు.ఎస్‌.కు వెళ్లిపోతున్నారు. మిమ్మ‌ల్ని కాదురా వెళ్ళ‌మంది. బ్రిటీష్‌వారిని వెళ్ళ‌మంది.. అనే పాయింట్  న‌న్ను బాగా క‌నెక్ట్‌ చేసింది. నేను అర్జున్ రెడ్డి చూశాక ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డిపై గౌర‌వం పెరిగింది.  కంటెంట్ వుంటే భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌నే స్పూర్తి ఆయ‌నే క‌ల‌గ‌జేశాడు. విశ్వ‌క్ ఇందులోని పాత్ర‌లో ఒదిగిపోయాడు. రేపు 18న మీరు థియేట‌ర్‌లో చూసి ఆనందిస్తార‌ని తెలిపారు.


చిత్ర ద‌ర్శ‌కుడు వేణు ముల్కాకా మాట్లాడుతూ, సినిమా పూర్త‌య్యాక రెండు టీజ‌ర్‌లు విడుద‌ల చేశాం. విడుద‌ల‌కు స‌హ‌క‌రిస్తార‌ని పంపిణీదారుల‌కు, ప్ర‌ముఖుల‌కు చూపించాం. కానీ ఎవ‌రూ ముందుకు రాలేదు. క‌థ ఎన్‌.ఐ.ఆర్‌.ల‌ను టార్గెట్ చేసింద‌ని వారు భావించి వుండ‌వ‌చ్చు. ర‌చ‌యిత ద‌ర్శ‌కుడు అనేవాడు వున్న విష‌యాన్ని స్ప‌ష్టంగా చెబుతాడు. ఈ సినిమాకు మూడేళ్ళ‌పాటు క‌ష్ట‌ప‌డ్డాం. ఇలాంటి క‌థ‌ను అంగీక‌రించిన నిర్మాత‌కు గ‌ట్స్ వుండాలి. నేను మీడియా ద్వారా తెలియ‌జేసేది ఏమంటే, మ‌న ఇండియాలోని మేథావులు వ‌ల‌స‌లు వెళుతుంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? స‌త్య నాగెళ్ళ‌, సుంద‌ర్ పిచాయ్ వంటి వారు ఇండియా వ‌స్తే ఎంతో అభివృద్ధి చెండుతుంది. ఒక ఆఫీసులో ఉద్యోగం కోసం త‌గిన‌వారిని ఎంపిక చేస్తామే, అలాంటి దేశం అభివృద్ధి చెందాలంటే మేథావులంతా ఇక్క‌డే వుంటే ఎంతో అభివృద్ధి చెందదా! అన్న కోణంలోనే ఈ సినిమా వుంటుంది. అందుకోస‌మే ఈ విశ్వ‌క్ ప్ర‌పంచ‌మంతా వ్యాపింప‌జేస్తాడ‌నే కాప్ష‌న్‌కూడా పెట్టామ‌ని తెలిపారు.
చిత్ర క‌థానాయ‌కుడు అజయ్ కతుర్వార్ మాట్లాడుతూ, ఈ సినిమా యూత్‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది. ఇలాంటి కంటెంట్ నా ద్వారా హార్డ్‌గా చెబితే వింటారా! అనే అనుమానం మొద‌ట్లో వుండేది.  కానీ మంచి సినిమా తీయాల‌నే క‌సితో నిర్మాత సినిమా తీశారు. అంతే క‌సితో మేం న‌టించాం. మంచి ప‌దిమందికి చేరాల‌నే నిర్మాత అనేవారు. ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలుస్తుంది. కానీ ఈ సినిమా ఎవ‌రినీ వేలెత్తి చూపేదిగా వుండ‌దు. ఎందుకంటే సెన్సార్ వారుకూడా చూసి ఎంతో అభినందించారు. మా పిల్ల‌ల‌కు మేం ఇటువంటి సినిమా చూపిస్తామ‌ని మాతో అన‌డంతో మాకు మ‌రింత బూస్ట్ ఇచ్చిన‌ట్ల‌యింది అని తెలిపారు.


సంగీత ద‌ర్శ‌కుడు సత్య సాగర్ పొలం మాట్లాడుతూ, క‌థ‌కు స‌రిప‌డ్డ బాణీలు కుదిరాయి. గీత‌ర‌చ‌యిత‌లు బాగా రాశారు. ఈ సినిమా చూసిన‌వారంతా ఇండియ‌న్ గా గ‌ర్వ‌ప‌డ‌తార‌ని చెప్ప‌గ‌ల‌న‌ని తెలిపారు.


ఇంకా కెమెరామెన్‌, ప్ర‌దీస్‌, ఎడిట‌ర్ విశ్వ‌నాథ్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికాంత్ త‌దిత‌రులు మాట్లాడుతూ ఈనెల 18న మంచి సినిమా విశ్వ‌క్ చూసి ఆశీర్వ‌దించండి అని కోరారు.


సాంకేతిక సిబ్బంది-  DOP: ప్రదీప్ దేవ్
దర్శకుడు: వేణు ముల్కాకా
సంగీతం: సత్య సాగర్ పొలం
ఎడిటర్: కె విశ్వనాథ్
పి.ఆర్‌.ఓ. -  తేజస్వి సజ్జా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికాంత్ జలగం
 లైన్ ప్రొడ్యూసర్: ఎం ఉదయ్ భాస్కర్
 ప్రొడక్షన్ మేనేజర్: అల్లూరి చంద్రశేఖర్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !