View

ఫుల్ జోష్ లో 'డిజె టిల్లు' టీమ్ 

Monday,February14th,2022, 02:56 PM

అప్పటి వరకు సినిమా చూస్తూ తెరమీద నాయకా నాయికలు ను, వారి నటనను చూస్తు, నవ్వులతో మునిగి పోయిన వారికి అంతలోనే చిత్ర నాయక, నాయికలు ఎదురయ్యే సరికి వారి ఆనందం తో ధియేటర్ మారుమ్రోగింది. ఈ సంఘటన విజ‌య‌వాడ కాపిట‌ల్ మాల్ లో జరిగింది. 'డిజె టిల్లు'టీం ధియేటర్లో ఈరోజు సందండి చేసింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ఈ డిజె టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ శుక్రవారం విడ‌ద‌ల‌యిన ‘డిజె టిల్లు’ విడుదల అయిన అన్ని కేంద్రాలలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తమ డిజె టిల్లు టీం విజ‌య‌యాత్ర లో భాగంగా విజ‌య‌వాడ కాపిట‌ల్ మాల్ ని సంద‌ర్శించారు. ఆడియ‌న్స్ తో క‌ల‌సి సినిమా చూసిన టీం త‌మ ఆనందాన్ని ప్రేక్ష‌కుల‌తోనూ మీడియాతో నూ పంచుకున్నారు. 'డిజె టిల్లు' అంటూ ప్రేక్ష‌కుల అరుపుల‌తో ధియేటర్ మరింత  జోష్ ని నింపుకుంది..


ఈసంద‌ర్భంగా హీరో సిద్దు జోన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ... 'తెలంగాణా యాస తో వ‌స్తున్నాం ఎలా ఉంటుంది ఈ సినిమా నైజాం వ‌ర‌కూ మాకు ఎలాంటి సందేహాలు లేవు..కానీ ఆంధ్ర‌లో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే డౌట్ ఉండేది. కానీ ఈరోజు విజ‌యవాడ‌లో ఆడియ‌న్స్ తో క‌ల‌సి చూసాక మంచి సినిమా ఎక్క‌డైనా మంచి సినిమానే అని ప్రేక్ష‌కులు రుజువు చేసారు. చాలా ఆనందంగా ఉంది. డిజె టిల్లు అనే క్యారెక్ట‌ర్ రాయ‌డం,చేయ‌డం ఒక క‌త్తిమీద సాము లాంటిది. కానీ ప్రేక్ష‌కులు మాకు మేం ఊహించిన దానికంటే పెద్ద విజ‌యం అందించారు. ఈ సినిమా స‌క్సెస్ ఇచ్చిన కిక్ ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను. మిమ్మ‌ల్ని ఏడిపించేంత న‌వ్విస్తాడు టిల్లు దానికి నాది గ్యారెంటీ అన్నారు.


ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ మాట్లాడుతూ... 'ఈ విజ‌యం తో ఏం మాట్లాడాలో అర్దం కావ‌డం లేదు. ప్రేక్ష‌కుల‌కు చాలా థ్యాంక్స్. మా న‌మ్మ‌కాన్ని ప‌దింత‌లు చేసి ప్రేక్ష‌కులు మాకు విజ‌యం అందించారు. ఈ క్యారెక్ట‌ర్ ని డిజైన్ చేయ‌డంలోనూ సిద్దూ పాత్ర చాలా ఉంది. విజ‌య‌వాడ  లో ప్రేక్షకుల రెస్పాన్స్ మా ఆనందాన్ని ప‌దింత‌లు చేసింది అన్నారు.


హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ... 'నా మొద‌టి థియేట‌ర్ విజిట్ ఇది. నా సినిమా ఆడియ‌న్స్ తో చూడ‌టం ఎప్ప‌టికీ గుర్తుండి పోతుంది. థియేట‌ర్ లో రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.  డిజె టిల్లు ఒక సూప‌ర్ ఫ‌న్ రైడ్ .. ప్రేక్ష‌కులు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది అన్నారు. ప్రేక్షకాభిమానుల ఆనందాన్ని తమ గుండెల్లో నింపుకొని మరిన్ని ధియేటర్ ల వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించింది చిత్ర యూనిట్. Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !