View

నిర్మాతల కోసం రంగంలోకి దిగిన Oracle Movies

Tuesday,February15th,2022, 05:45 AM

భారతదేశంలోనే మొట్టమొదటి NFT మూవీ మార్కెట్‌ ప్లేస్‌గా Oracle Movies చరిత్రకెక్కనుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ నిర్మాతలు మరింతగా ఆదాయాన్ని ఆర్జించడంలో సహాయం చేయడమే దీని లక్ష్యం. దీంతో భారతదేశంలో మూవీ బిజినెస్ రూపురేఖలే గణనీయంగా మారిపోతాయని అంచనా. ఈ క్రమంలో భాగంగానే టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్ సెంథిల్ నాయగమ్, చిత్ర నిర్మాత మరియు మూవీ బిజినెస్ కన్సల్టెంట్ జి.కె. తిరునావుక్కరసు కలిసి Oracle Moviesని స్థాపించడానికి చేతులు కలిపారు. ఇది భారతీయ ప్రప్రథమ NFT మూవీ మార్కెట్ ప్లేస్ కానుంది.


నాన్-ఫంగిబుల్ టోకెన్‌.. సంక్షిప్తంగా NFT. అధునాతనమైన, సురక్షితమైన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా మూవీ రైట్స్ కొనడానికి, అమ్మడానికి ఇది చిత్రనిర్మాతలకు, కంపెనీలకు తోడ్పడుతుంది. NFT ఎంత విశిష్టమైనదంటే, మరేదీ దీన్ని భర్తీ చేయలేదు. కాబట్టి ఇది మాల్ ప్రాక్టీస్‌లను నిరోధించడమే కాకుండా, స్టాక్‌హోల్డర్లకు సురక్షితమైన, భద్రతతో కూడిన వాతావరణాన్ని కూడా అందిస్తుంది. ప్రారంభంలో Oracle Movies సంస్థ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల నిర్మాతలకు, IP రైట్స్ ఉన్నవారికి తన సేవలను అందించనుంది. అతి త్వరలోనే ఈ సేవలు దేశంలోని ఇతర భాషల చిత్రాలకు కూడా విస్తరించనున్నాయి.


ఈ సందర్భంగా Oracle Movies COO విజయ్ డింగరి మాట్లాడుతూ.. ‘‘ ప్రస్తుతం కంటెంట్ అనేది కింగ్.. ఓటీటీలు సరైన కంటెంట్ కోసం వెతుకుతున్నాయి. అలాగే నిర్మాతలు కంటెంట్ కోసం, అలాగే వారి దగ్గర ఉన్న కంటెంట్‌ను అమ్మేందుకు సరైన వేదిక కోసం చూస్తున్నారు. ఓటీటీలకు, నిర్మాతలకు మధ్య ఉన్న అంతరాన్ని NFT తీర్చుతుంది. ఒక్కోసారి తమ దగ్గర ఉన్న కంటెంట్ ఏదో విధంగా అమ్ముడైతే చాలు అన్నట్లుగా తెలియక వ్యవహరిస్తుంటారు. అలాంటి వారికి అవగాహన పెంచేలా, ధరతో పాటు ఏ ప్లాట్‌ఫామ్ కరక్టో కూడా సూచించడంలో NFT సహాయం చేస్తుంది. ప్రస్తుత చిత్ర వాణిజ్యం కాగితపు ఒప్పందాలపైనే ఆధారపడి ఉన్నందున, ఇది ఆధునిక సినిమాకు ఏమంత మంచిది కాదు. అలాగే మూవీ రైట్స్‌ను అమ్మిన ట్రాక్‌ను కనిపెట్టడానికి ఒక సెంట్రల్ ఏజెన్సీ కూడా ఈ వ్యవస్థలో అందుబాటులో లేదు. ఈ భారీ అంతరాన్ని పరిష్కరించడానికే NFT సులభమైన రీతిలో అడుగుపెడుతోంది. Oracle Movies కూడా అలాంటి వన్ స్టెప్ సర్వీస్ ప్రొవైడర్‌ పాత్రను పోషించనుంది. ఇంకా ఇతర వివరాల కోసం vijay@oraclemovies.com లేదా 9000088877 నెంబర్‌కు సంప్రదించవచ్చు..’’ అని తెలిపారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !