View

పబ్లిక్ విన్నర్ 'ఎఫ్ఐఆర్' - విష్ణు విశాల్

Tuesday,February15th,2022, 02:33 PM

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా న‌టించిన డార్క్ యాక్షన్ థ్రిల్లర్ 'ఎఫ్ఐఆర్'. ఈ చిత్రానికి మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదలయింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌గ‌ర్వ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా తెలుగులో రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 11న విడుదలై ఆద‌ర‌ణ‌పొంది ప‌బ్లిక్ విన్న‌ర్‌గా నిలిచింది. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని చిత్ర‌యూనిట్ మంగ‌ళ‌వారంనాడు హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది. ముందుగా స‌క్సెస్ కేక్‌ను క‌ట్‌ చేసి త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.


విష్ణు విశాల్ మాట్లాడుతూ, ఎఫ్‌.ఐ.ఆర్‌. విడుద‌ల చాలా హ్యాపీగా వుంది. త‌మిళంలో మంచి ఓపెనింగ్స్ వ‌చ్చి విజ‌య‌వంతంగా న‌డుస్తోంది. తెలుగులోకూడా ఆద‌ర‌ణ పొందుతోంది. విడుద‌ల‌కు స‌హ‌క‌రించిన ర‌వితేజ‌, వాసుగారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాం. క‌రోనా మూడో వేవ్ త‌ర్వాత థియేట‌ర్ ఓన‌ర్లు, పంపిణీదారులు మా సినిమా ప‌ట్ల ఆనందంగా వున్నార‌ని చెప్ప‌డం మా రెండున్న‌ర ఏళ్ళ కృషి ఫ‌లించింద‌నిపించింది. అదేవిధంగా ఈ సినిమా పోస్ట‌ర్ ను బ‌ట్టి కొంత‌మంది ముస్లిం సోద‌రులు కాంట్ర‌వ‌ర్సీ గా భావించారు. వారికి క్ష‌మాప‌ణ చెబుతున్నాం. సినిమాను చూస్తే మీకే అర్త‌మ‌వుతుంది. ముస్లిం సోద‌రులు అర్థం చేసుకోగ‌ల‌ని భావిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్ర‌త్యేకంగా ఓ విష‌యం ప్ర‌క‌టిస్తున్నాం. ర‌వితేజ బేన‌ర్ ఆర్‌టి.టీమ్ వ‌ర్క్స్‌తో విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెలుగు, త‌మిళ సినిమాను నిర్మించ‌బోతోంది. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాం. ఈ సినిమాలో ఎక్కువ‌మంది తెలుగు నటీన‌టులే వుంటార‌ని తెలిపారు.


ద‌ర్శ‌కుడు మ‌ను ఆనంద్ తెలుపుతూ, నా తొలి సినిమా తెలుగులోనూ విడుద‌ల‌కావ‌డం ఆనందంగా వుంది. ఇటీవ‌లే మా పోస్ట‌ర్ గురించి వివాదాస్ప‌దం అయింది. అది ఏ ఒక్క‌రినీ ఉద్దేశించి పెట్టిందికాదు. అందుకు మ‌రోసారి క్ష‌మాప‌ణ తెలియ‌జేస్తున్నాను. ఈ సినిమా చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది అన్నారు.


అభిషేక్ పిక్చ‌ర్స్ సిఇ.ఓ. వాసు మాట్లాడుతూ, తెలుగులో 262 థియేట‌ర్ల‌లో మా బేన‌ర్ ద్వారా విడుద‌ల చేశాం. ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు ధ‌న్యవాదాలు తెలియ‌జేస్తున్నాం. మంచి సినిమా ఏ భాష నుంచి వ‌చ్చినా తెలుగువారు ఆద‌రించ‌డానికి ముందుంటారు. రివ్యూలు కూడా బాగా స‌పోర్ట్‌గా వ‌చ్చాయి. పోటీ సినిమాలు వున్నా మా ఎఫ్‌.ఐ.ఆర్‌. ప‌బ్లిక్ విన్న‌ర్ గా నిలిపిన ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాం. విష్ణువిశాల్ అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. గౌత‌మ్‌మీన‌న్ త‌న డైలాగ్ డెలివ‌రీలో ప్ర‌త్యేక‌త‌ను చూపించారు. తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆనంద్ బాగా డీల్ చేశాడు. త‌మిళ‌నాడులో మంచి క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది` అని తెలిపారు.


న‌టి రెబ్బా మోనిక మాట్లాడుతూ, ఈ సినిమాకు మంచి పేరు వ‌చ్చింది. అందుకే ప‌బ్లిక్ విన్న‌ర్ గా నిలిచింది. ఈ సినిమాలో చ‌క్క‌టి మెసేజ్ కూడా వుంది అని తెలిపారు.


ఎగ్జిక్యూటివ్ నిర్మాత స్ర‌వంతి మాట్లాడుతూ, రిలీజ్‌కు స‌హ‌క‌రించిన ర‌వితేజ‌గారికి, వాసుగారికి మ‌రోసారి ధ‌న్య‌వాదాలు. టీమ్ ఎఫెర్ట్‌తో మంచి విజ‌యం సాధించామ‌ని తెలిపారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !