View

కశ్మీర్ ఫైల్స్ లో ఆ విషయాన్ని నిక్కచ్చిగా చెప్పాం - దర్శక, నిర్మాతలు 

Wednesday,March09th,2022, 02:50 PM

దేశానికి త‌ల‌మానికం అయిన క‌శ్మీర్‌లో హిందూ పండితులపై టెర్ర‌రిస్టుల దాడి ఎందుకు జ‌రిగింది? వారిని ఊచ‌కోత ఎందుకు కోశారు? ఆ త‌ర్వాత వారు ఎక్క‌డికు వెళ్ళారు? అనంత‌రం  జ‌రిగిన ప‌రిణామాలు ఏమిటి? అనే విష‌యాల‌ను నిక్క‌చ్చిగా త‌మ క‌శ్మీర్ ఫైల్స్ చిత్రంలో చెప్పామ‌ని చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాతలు అభిషేక్ అగ‌ర్వాల్‌, పల్లవి జోషి తెలియ‌జేశారు. దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ త‌దిత‌రులు న‌టించిన క‌శ్మీర్ ఫైల్స్ హిందీ  సినిమా మార్చి 11న విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాను అభిషేక్ అగ‌ర్వాల్‌, పల్లవి జోషి నిర్మించారు. బుధ‌వారంనాడు చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా చిత్ర యూనిట్ హైద‌రాబాద్ వ‌చ్చింది. 


ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ, ఈ క‌థ‌ను నేను రాయ‌లేదు. టెర్ర‌రిజం ద్వారానే తెలుసుకుని సినిమా తీశాను.1990 ద‌శ‌కంలో హిందూ పండితుల‌ను టార్గెట్ చేసి కొంత‌మంది టెర్ర‌రిస్టులు ఊచ‌కోత‌కోశారు. వారి పిల్ల‌ల‌ను చంపేశారు. పెద్ద‌ల‌ను పారిపొమ్మ‌ని భ‌య‌పెట్టి, మ‌హిళ‌ల‌ను ఇక్కడే బందీలు పెట్టుకుని న‌ర‌క‌యాత‌న చూపించారు. ఈ విష‌యాలేవీ ప్ర‌పంచానికి తెలీయ‌నీయ‌కుండా కొంద‌రు దాచేశారు. వాటికి వెలికితీయ‌డంలో ప్ర‌భుత్వం, మీడియాకూడా త‌ప్పుదోవ ప‌ట్టించింది. అందుకే బాధ్య‌తాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను. నాలుగేళ్ళ‌పాటు చాలా క‌ష్ట‌న‌ష్టాలు అనుభ‌వించాను. సినిమా చూసి నిజాలు తెలుసుకోండ‌ని అన్నారు. 


అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, క‌శ్మీర్ ఇండియాలో భాగం.30 ఏళ్ళ‌గా ఇలాంటి క‌థ‌ను ఎవ్వ‌రూ తీయ‌లేదు. వాస్తవం ఏమిటి అనేది ఈ సినిమా ద్వారా చూపించామ‌ని. ఇందులో భాగ‌మైనందుకు ఆనందంగా వుంద‌ని తెలిపారు. 


నిర్మాత ప‌ల్ల‌వి జోషి మాట్లాడుతూ, ఈ సినిమా తీయ‌డానికి నాలుగేళ్ళు ప‌ట్టింది. ఓ ఆప‌రేష‌న్ చేసిన‌ట్లుగా వుంది. ఈ చిత్రానికి ప‌నిచేసిన అంద‌రి కృషి ఇందులో వుంది. ఇంత‌మందితో సినిమా తీసినందుకు ల‌క్కీగా ఫీల‌వుతున్నా. మేం సినిమా మొద‌లు పెట్టిన‌ప్పుడు స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నుకోలేదు. క‌శ్మీర్ నుంచి ఢిల్లీవ‌ర‌కు రీసెర్చ్ చేసి తీసిన సినిమా ఇది. ఇదేదో 200 ఏళ్ళ ‌నాటి క‌థ కాదు. ముప్పై ఏళ్ళ భార‌త్ క‌థ‌. క‌శ్మీర్‌లో జ‌రిగిన విష‌యాల‌ను రాజ‌కీయ‌నాయ‌కులు, మీడియా కూడా నిజాన్ని నొక్కేసింది. ఈ సినిమా చేశాక వివేక్ ను ట్విట్ట‌ర్‌ పై ఎటాక్ చేశారు. ఇస్లాం దేశాలు ఈ సినిమాను బేన్ చేశాయి. 


యు.ఎస్‌.ఎ.లోని క‌శ్మీర్ పండితులు ఈ సినిమా గురించి మాట్లాడుతూ, మా  హృద‌యాల్ని ట‌చ్ చేశార‌ని చెప్పారు. తేజ్ నారాయ‌ణ్‌, అభిషేక్ మాపై న‌మ్మ‌కంతో ముందుకు వ‌చ్చి విడుద‌ల‌కు స‌హ‌క‌రిస్తున్నారని తెలిపారు. 


న‌టుడు ద‌ర్శ‌న్ కుమార్ మాట్లాడుతూ, హార్ట్‌ అండ్ సోల్‌గా చేసిన సినిమా ఇది. ఇందులో మేం న‌టించ‌లేదు. జీవించాం. కంటెండ్ ఓరియెంటెడ్ చిత్రాలు ఇష్ట‌ప‌డేవారికి త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. ఇందులో థ్రిల్ల‌ర్ కూడా వుంది. ఇందులో ప్ర‌తీ స‌న్నివేశం ప్రేక్ష‌కులను క‌ట్టిప‌డేస్తుంద‌ని న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌ల‌ను. మార్చి 11న చూసి నిజాన్ని తెలుసుకోండ‌ని అన్నారు. 


బిజెపి నాయ‌కుడు రామ‌చంద్ర‌రావు మాట్లాడుతూ, నేను అభిషేక్ కుటుంబ లాయ‌ర్‌గా వ‌చ్చాను. ఇటువంటి సినిమాను అందించినందుకు వారిని అభినందిస్తున్నా. క‌శ్మీర్‌పై సినిమా తీయ‌డం మామూలు విష‌యం కాదు. ఎన్నో క‌ష్టాలు చిత్ర యూనిట్ అనుభ‌వించింది.1980 నుంచి 1990 వ‌ర‌కు క‌శ్మీర్‌లో జ‌రిగిన మాన‌వ సంహారంహిందువులైన క‌శ్మీర్ పండితుల‌ను ఊచ‌కోత కోసిన విధానం నివ్వెర‌ప‌రుస్తుంది. పిల్ల‌లను చంపి, ఆడ‌వారిని మాత్ర‌మే ఇక్క‌డ వుండ‌మ‌నీ పెద్ద‌వాళ్ళ‌ను గెంటేసిన ప‌రిస్థితులు హృద‌య విదార‌కంగా వుంటాయి. మ‌న దేశంలో ఎంద‌రో శ‌ర‌ణార్దుల గురించి బాధ‌ప‌డుతున్నాం. కానీ క‌శ్మీర్ పండితుల గురించి ఆలోచించేవారే లేరు. క‌శ్మీర్ అనేది భార‌త్‌లో భాగ‌మ‌ని తెలుసుకోవాలని అన్నారు. 


ప‌రిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ, సినిమాల్లో జ్ఞానోదయం క‌ల్గించే చిత్రాలు అరుదుగా వ‌స్తుంటాయి. అందులో అగ్ర‌భాగంలో ఈ సినిమా వుంటుంది. నిజాన్ని నిర్భ‌యంగా చెప్పే సినిమాలు రావాలి. వీటిని అడ్డుకునేవారు, విమ‌ర్శించేవారు భార‌త్‌ను వ‌దిలి పాకిస్తాన్ వెళ్ళిపోండ‌ని ఘాటుగా స్పందించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !