View

'స్టాండప్ రాహుల్' యువతకు స్ఫూర్తినిస్తుంది - శాంటో మోహన్

Tuesday,March15th,2022, 02:24 PM

హీరో రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన సినిమా స్టాండప్ రాహుల్. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల‌పై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకుని ఈనెల 18న విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారంనాడు ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ర్ సెంట‌ర్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో చిత్ర యూనిట్ పాల్గొంది.


ఈ సంద‌ర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ, ఈ క‌థ‌ను ద‌ర్శ‌కుడు శాంటో నాకు నాలుగు గంట‌ల‌పాటు చెప్పాడు. ప్ర‌తిదీ డిటైల్‌గా వివ‌రించాడు. వెంట‌నే మ‌రునిముషంలో చేస్తానని చెప్పాను. కానీ నాపై ఆయ‌న‌కు న‌మ్మ‌కం క‌ల‌గ‌లేదు. నేను చేస్తాన‌న్నానుగ‌దా! అని అంటే, కాదు. ఆడిష‌న్ కావాలి అన్నాడు. అలా ఆడిష‌న్ చేశాక ఆయ‌న‌కు నాపై పూర్తిన‌మ్మ‌కం ఏర్ప‌డింది. ఈ సినిమా మా రెండేళ్ళ జ‌ర్నీ. స్టాండప్ రాహుల్ అంటే అల‌రించే కామెడీతోపాటు ఫ్యామిలీ డ్రామా కూడా వుంది. ఇటువంటి కాన్సెప్ట్‌ను కొద్దిగా ఇటీవ‌లే పూజాహెగ్డే ఓ సినిమాలో చేసింది. అది మా సినిమాకు హెల్ప్ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. దానికి మించి కామెడీతోపాటు మంచి ఎమోష‌న్స్ కూడా మా సినిమాలో వుంటుంది. ఈ సినిమా నా కెరీర్‌కు బాగా ఉపయోగపడుతుంది. వ‌ర్ష పాత్ర చాలా క్యూట్‌ గా వుంటుంది. ఆమెకు కొన్ని అభిప్రాయాలుంటాయి. వాటిని బాలన్స్ చేస్తూ, నా కుటుంబాన్ని కూడా చూసుకుంటూ స్టాండప్ కామెడీ ఎలా చేశాన‌నేది ఇందులో ద‌ర్శ‌కుడు బాగా డీల్ చేశారు. ఇటువంటి సినిమా ఇంత‌కుముందు రాలేదు. చిత్ర నిర్మాత‌లు క‌రోనా వ‌చ్చి మ‌ధ్య‌లో ఆగిపోయినా చాలా న‌మ్మ‌కంతో ఈ సినిమాకు ఎంత‌మేర‌కు కావాలో అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించారు. ద‌ర్శ‌కుడికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంద‌ని న‌మ్మ‌క‌ముంది. థియేట‌ర్లోనే సినిమాను చూడండి. పైర‌సీని ఎంక‌రేజ్ చేయ‌కండ‌ని తెలిపారు.


హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ, ఈ చిత్రం నాకేకాదు అంద‌రికీ మంచి గుర్తింపు తెస్తుంది. క‌రోనా టైంలో అంద‌రూ ఒత్తిడికి గుర‌య్యాం. ఆ టైంలో చ‌క్క‌టి ఎంటర్‌టైన్ మెంట్ కోసం చూశాం. ఇలాంటి సినిమా చూస్తే మ‌న‌కు రిలీప్ వుంటుంది. థియేటర్లో సినిమాను చూసి ప్రేక్షకులు చిరునవ్వుతో బయటకు వస్తార‌నే న‌మ్మ‌కం నాకుంద‌ని అన్నారు.


దర్శకుడు శాంటో మాట్లాడుతూ, ఈ క‌థ రాసుకున్న‌ప్పుడే నా జీవితంలో జ‌రిగిన‌ సంఘ‌ట‌ల‌ను రాసుకున్నాను. నేను ఎక్క‌డా ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేయ‌లేదు. సినిమాలు కూడా పెద్ద‌గా చూడ‌ను. కానీ నా జీవ‌న‌పోరాట‌మే న‌న్ను ద‌ర్శ‌కుడిని చేసింది. సినిమావాళ్ళ‌కు కానీ, బాచిలర్స్ కు కానీ హైద‌రాబాద్‌లో ఇల్లు దొర‌క‌డం క‌ష్టం. ఇవి కూడా హీరో పాత్రలో చెప్పించాను. నేను జీవితంలో నేర్చుకున్న‌ది ఇప్ప‌టి యూత్‌కు స్పూర్తిగా వుండేలా ఈ సినిమా క‌థ‌ను రాసుకున్నాను. మ‌న కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు వుంటాయి. వాటిని స్టాండ‌ప్ కామెడీతో ఎలా వినోదాత్మ‌కంగా చెప్పించ‌వ‌చ్చో ఇందులో చెప్పాను. నేను క‌థ చెప్పిన‌ప్పుడు ప్రతీ విషయంలోనూ డీటెయిల్‌గా వివరాలు నిర్మాతలకు ఇచ్చాను. కాస్ట్యూమ్స్, సంగీతం, కలర్ వంటి అన్ని అంశాలు ఒక స్కెచ్ రూపంలో చూపించాను. అవ‌న్నీ చూశాక‌ నిర్మాతలకు నా పై పూర్తి నమ్మకం కలిగింది. ఈ చిత్రానికి సంగీతం, సాహిత్యం చ‌క్క‌గా కుదిరాయి. నిర్మాత‌లు నేను అనుకున్న‌దానికంటే ఎక్కువ స‌హ‌క‌రించారు. ఈనెల 18న థియేట‌ర్‌లో సినిమా చూసి ఆనందించండి అని తెలిపారు.


నిర్మాత‌ల్లో ఒక‌రైన‌ భరత్ మాగులూరి మాట్లాడుతూ, డిఫ‌రెంట్ మూవీ చేశాం. ద‌ర్శ‌కుడు అనుకున్న‌ది అనుకున్న‌ట్లు తీశారు. 18న అంద‌రూ సినిమా చూసి ఆనందించండి అన్నారు.


మ‌రో నిర్మాత నంద కుమార్ అబ్బినేని తెలుపుతూ, కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్. డిఫ‌రెంట్‌గా రాజ్‌త‌రుణ్ పాత్ర వుంటుంది. వ‌ర్ష చ‌క్క‌గా న‌టించింది. శ్రీ‌క‌ర్ చ‌క్క‌టి బాణీలు ఇచ్చాడ‌ని అన్నారు.


సంగీత ద‌ర్శ‌కుడు శ్రీ‌క‌ర్ అగ‌స్తి మాట్లాడుతూ, ఈ సినిమాకు ప‌నిచేయ‌డం చాలా మంచి అనుభ‌వం. నా సంగీత‌మే మాట్లాడాల‌ని అనుకుంటున్నాను. చాలా ప్రేమ‌తో సినిమా చేశాం. పాట‌లు ఆద‌ర‌ణ పొందాయ‌ని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !