View

ఆ జాబితాలో డైరెక్టర్ కరుణ్ కుమార్!

Tuesday,April05th,2022, 02:44 PM

సినిమా అనే మాట వినోదానికి ప‌ర్యాయ‌ప‌దంగా మారిన రోజుల్లో ఆ వినోదంతో పాటు సామాజిక స్పృహ క‌లిగిన సినిమాల‌ను అందించే ద‌ర్శ‌కులు అరుదుగా ఉంటారు. తెలుగు లో ఆ జాబితాలో ఇప్పుడు ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు క‌రుణ కుమార్. పలాస1978సినిమా విడుద‌ల‌యి మూడేళ్ళు కావొస్తున్నా ఇప్ప‌టికీ ప‌లాస పేరు ఎక్క‌డో ఒక చోట విన‌ప‌డుతూనే ఉంది. మేక‌ర్స్ కి రిఫ‌రెన్స్ సినిమాగా మారింది. భార‌తీయ సినిమా తెర‌మీద సామాజిక బాధ్య‌త గ‌ల సినిమాల‌తో త‌మ‌దైన ముద్ర‌ను వేస్తున్న ద‌ర్శ‌కులు నీర‌జ్ ఘావ‌న్, నాగ‌రాజ్ ముంజ‌లే, వెట్రిమార‌న్, పా రంజిత్ స‌ర‌స‌న తెలుగు నుండి క‌రుణ్ కుమార్ పేరు చేరింది.


ద‌ళిత పాలిటిక్స్ బేస్ చేసుకొని నిర్మించిన సినిమాల‌ను ఎంపిక చేసి వానమ్ ఆర్ట్స్ ఫెస్టివ‌ల్ ని నీల‌మ్ ఆర్ట్స్ క‌ల్చ‌ర‌ల్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్నారు ద‌ర్శ‌కులు పా రంజిత్. సామాజిక స్పృ హతో ద‌ళితుల‌కు రాజ్యాధికారం అనే అంశంను ఇతి వృత్తంగా తీసుకొని సామాజిక చైత‌న్యం క‌లిగించిన సినిమాలు ఏ బాష‌లోనైనా అరుదుగా వ‌స్తాయి. ఒక క‌థా వ‌స్తువును తీసుకునేందుకు దర్శ‌కుడు ప‌డే త‌ప‌న ఖ‌ఛ్చితంగా అత‌ని వ్య‌క్తిత్వం లోంచి వ‌స్తుంది. అందుకే ప‌లాస 1978 రిలీజ్ అయి మూడేళ్లు కావొస్తున్నా ఇప్ప‌టికీ సినిమా ప్ర‌పంచంలో చ‌ర్చా వ‌స్తువుగానే ఉంది. టి.కృష్ణ‌, ఆర్. నారాయ‌ణ మూర్తి వంటి సామాజిక బాధ్య‌త తో సినిమాలు తీసే ద‌ర్శ‌కులు త‌ర్వాత తెలుగులో క‌రుణ కుమార్ పేరు ఆ వ‌ర‌స‌లో ముందుకు వ‌స్తుంది. క‌థా ర‌చ‌యితగా నేష‌న‌ల్ స్థాయి గౌర‌వం ద‌క్కించుకున్న క‌రుణ కుమార్ అదే క‌థా బ‌లంతో సినిమాలు చేస్తున్నారు. చెన్నైలో ఈ నెల 9, 10,11 ల‌లో p.k.rose ఫిల్మ్ ఫెస్టివల్ పేరిట జ‌ర‌గ‌బోయే ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో ప్ర‌ద‌ర్శితం కాబోయే సినిమాల‌లో ప‌లాస 1978 ఎంపిక అయ్యింది.


ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కులు క‌రుణ కుమార్ మాట్లాడుతూః ద‌ళిత జీవ‌నాన్ని, ద‌ళిత జీవిత క‌థా చిత్రాన్ని క‌థా వ‌స్తువులుగా తీసుకునే పా రంజిత్ 2018 లో వాన‌మ్ ఆర్ట్ ఫెస్టివ‌ల్ ని ప్రారంభించారు. క‌రోనా త‌ర్వాత మ‌ళ్ళీ ఈ ఫెస్టివ‌ల్ జ‌ర‌గ‌బోతుంది. ఏప్రిల్ నెల‌ను ద‌ళిత్ మంత్ గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 14న అంబేద్క‌ర్ మ‌హాశ‌యుని పుట్టిన రోజు పుర‌స్క‌రించుకొని చేస్తున్న ఈ ఫెస్టివ‌ల్లో సాహిత్యం, సినిమా రెండు కూడా ప్ర‌ధాన భూమిక‌లు పోషిస్తున్నాయి. ద‌ళిత పాలిటిక్స్ ని ఇతివృత్తంగా చేసుకొని చేసిన సినిమాలు ఈ ఫెస్టివ‌ల్లో ప్ర‌ద‌ర్శిస్తారు. దేశం గర్వించే ద‌ర్శకుల సినిమా ల ప‌క్క‌న ప‌లాస 1978 సినిమా కు చోటు ద‌క్క‌డం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఫెస్టివ‌ల్ లో భాగం అయినందుకు నాకు గ‌ర్వంగా కూడా ఉంది. ఒక మంచి ప్ర‌య‌త్నం చేస్తే దాన్ని భుజాన వేసుకొనే ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఉంటారు అని ప‌లాస‌తో నాకు అనుభవంలోకి వ‌చ్చింది. దానితో పాటు ఇటువంటి వేదిక ల మీద ప‌లాస 1978 సినిమా ప్ర‌ద‌ర్శించ‌డం ద‌ర్శ‌కుడుగా మ‌రిచిపోలేని అనుభ‌వం కాబోతుంది అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !