View

నన్ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు - రాంగోపాల్ వర్మ

Thursday,April07th,2022, 03:05 PM

ఎన్నో కష్టాలు పడి సినిమా పూర్తి చేసి థియేటర్ లో రిలీజ్ టైం వచ్చేటప్పటికి కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ స్క్రీనింగ్ చేయమని చెప్పడం బాదేసింది. అయితే నేను చెప్పేది ఒక్కటే..అర చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. సినిమా తీసే విషయంలోగాని, రిలీజ్ విషయంలో గానీ.. నన్ను అడ్డుకోవడం బ్రహ్మతరం కూడా కాదు ఖబడ్దార్ అన్నారు RGV. దర్శకసంచలనం రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం “మా ఇష్టం”.ఇందులో అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్ట మొదటిసారిగా ఇద్దరమ్మాయిల ప్రేమకథతో వస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.తెలుగు-తమిళ -హిందీ భాషల్లో ఆర్జీవి  రూపొందించిన పాన్ ఇండియన్ మూవీ ఇది. మిగతా భాషల్లో “డేంజరస్ ” పేరుతో విడుదలయ్యే ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి తెలుగులో  “మా ఇష్టం” అని పేరు పెట్టారు. ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా  చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మ తో పాటు అప్సర రాణి, నైనా గంగూలీ, నిర్మాత తుమ్మలపల్లి రామసత్య నారాయణ,లతో పాటు గెస్ట్ గా వచ్చిన హీరో త్రిగున్, హీరో ఆకాష్ పూరి తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గీత రచయిత ప్రవీణ్ గారు RGV పై రాసిన "ఇంటెలిజెంట్ ఇడియట్" బుక్ ను RGV గారు చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ బుక్ లాంచ్ కార్యక్రమంలో ఆకెళ్ల రాఘవేంద్ర , వెంకట్ సిద్దారెడ్డి, విశ్వక్, వైజయంతి, విజయ లక్ష్మీ, బాల్ రెడ్డి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...


దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. ప్రవీణ్ గారు ఈ బుక్ రాసేముందు నన్ను కలిశాడు.తరువాత నేను కొన్ని సజెషన్స్ చేశాను. నేను నాగార్జునతో "శివ" సినిమా తీసిన తర్వాత "ఆఫీసర్" తీశాను. అలాగే అమితాబ్ బచ్చన్ తో "సర్కార్" సినిమా తీసిన తర్వాత తనతోనే "ఆగ్" తీశాను. ఇలా చేస్తున్న నన్ను చూసి చాలామంది ఆశ్చర్యపోతూ ఇంటెలిజెంట్ గా వున్నవాడు ఎందుకు ఇడియట్ గా మారు తున్నాడని అనుకున్నారు.ఈ టైటిల్ అయితే కరెక్ట్ ఉంటుందని నేను ప్రవీణ్ కు ఈ టైటిల్ సూచించడం జరిగింది .ఇక ఈ సినిమా విషయానికి వస్తే..2018 లో సుప్రీంకోర్టు నేచురల్ కి విరుద్ధమై పని చేయరాదని సెక్షన్ 377 ఆర్డర్ ఇచ్చింది.అయితే లెస్బియన్, హోమోసెక్సువల్స్ గురించి  దశాబ్దాలుగా ఈ విషయం గురించి ఒక డిబేట్ జరుగుతుంది. అయితే నాకు వచ్చిన ఒక ఐడియానే ఈ సినిమా. ఉమెన్ , జెంట్  రిలేషన్ షిప్ కు నా న్యాచురల్ గా సొసైటీలో అందరూ యాక్సెప్ట్ చేస్తారు అబ్జెక్షన్ చెయ్యరు.కానీ.. అమ్మాయి అమ్మాయి లవ్ చేసుకుంటే ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు. అందరూ సమానమే కదా అనే ఐడియాతో ఈ సినిమా చేయడం జరిగింది. మొదట ఈ సినిమాలో హీరోయిన్స్ చాలామందిని కలిశాను. చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు..చివరికి నైనా గంగూలీ, అప్సర రాణి నా కాన్సెప్ట్ నచ్చి  సినిమా చేయడానికి ముందుకు వచ్చారు .అప్సరను, నైనాని ఒప్పించడానికి కొంత సమయం పట్టింది.ఇద్దరు కూడా ఆ పేరెంట్స్ తో మాట్లాడి ఈ సినిమా చేశారు. అయితే వీరు చాలా అద్భుతంగా నటించారు ఈ సినిమా పూర్తి అయిన తరువాత థియేటర్ రిలీజ్ టైం వచ్చేటప్పటికి కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ స్క్రీనింగ్ చేయమని చెప్పడం బాదేసింది. అయితే నేను చెప్పేది ఒక్కటే..అర చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. సినిమా తీసే విషయంలోగాని, రిలీజ్ విషయంలో గానీ.. నన్ను అడ్డుకోవడం బ్రహ్మతరం కూడా కాదు ఖబడ్దార్ అన్నారు.


చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ఆర్జివి గారితో స్నేహమంటే ఒక వ్యసనం ఆయనతో స్నేహం చేస్తే ఆయనతోనే ఉండిపోవాలనుకునే వ్యక్తి ఆర్జివి."మా ఇష్టం" సినిమాను కొత్తవాళ్ళు తీస్తే సెక్స్ సినిమా అంటారు. కానీ ఆర్జీవి కాదు తీస్తే కళాత్మకమైన సినిమా తీశాడు అంటారు.ఇలాంటి సినిమాలు తీసే గట్స్ ఒక ఆర్జివి కే సాధ్య మవుతుంది. ఏ జోనర్ అనుకుంటే ఆ జోనర్ సినిమా తీసి హిట్ కొడతాడు. అందుకే అన్ని భాషల్లోనూ సినిమాలు తీసే సత్తా ఒక్క ఆర్జివి కే ఉంది. తనతో నేను నాలుగు సినిమాలు తీసినందుకు అదృష్టంగా భావిస్తున్నాను."మా ఇష్టం" సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 180 థియేటర్లలో విడుదల చేస్తున్నాము. ఇందులో నైనా,అప్సరలు ఇద్దరూ అద్భుతంగా నటించారు. ఈ నెల 8న వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.
అతిథిగా వచ్చిన హీరో త్రిగున్ మాట్లాడుతూ.. కోర్ ఫిలిం మేకింగ్ చేసేవారు తక్కువ మంది ఉన్నారు 35 సంవత్సరాలుగా కొత్త కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ దర్శకుడు గా కొనసాగడం మామూలు విషయం కాదు అది ఒక్క ఆర్జీవి గారికే సాధ్యం అవుతుంది .ఈ నెల 8 న వస్తున్న మా ఇష్టం సినిమాతో వస్తున్న  మా సినిమా "కథ కంచికి మనం ఇంటికి" రెండు కూడా  గొప్ప విజయం సాధించాలని అన్నారు.


అతిథిగా వచ్చిన హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. నేను హీరో కాకముందు నేను ఆర్జివి గారిని కలిశాను. తను నాకు  ఇన్స్పిరేషన్ కలిగించే మాటలు చెప్పాడు. ఇప్పుడు అర్జీవి సర్ తీస్తున్న "మా ఇష్టం" లాంటి సినిమాలు చేయడానికి గట్స్ కావాలి.ఆ గట్స్ ఒక్క RGV సర్ కు మాత్రమే ఉన్నాయి.ఈ నెల 8 న వస్తున్న ఈ గొప్ప విజయం సాదించాలి అన్నారు.


హీరోయిన్ నైనా గంగూలీ మాట్లాడుతూ..అర్జీవి గారు చాలామంది న్యూ టాలెంట్ ను ఇండస్ట్రీకు పరిచయం చేశాడు.అలా నా కెరియర్ కూడా "వంగవీటి" సినిమా తో స్టార్ట్ అయింది. హీరో పక్కన రొమాన్స్ సీన్స్ లలో నటించడం ఈజీ.. కానీ ఒక అమ్మాయితో రొమాన్స్ సీన్స్ లో నటించడం ఎంతో డిఫికల్ట్.కానీ ఈ సినిమాలో నేను చేసిన లెస్బియాన్ రోల్ చేయడానికి మొదట్లో ఇబ్బంది పడ్డాను కానీ తర్వాత అందరి సప్పోర్ట్ తో బాగా చేయగలిగాను. ఒక నటి ఎలాంటి పాత్ర అయినా బాగా చేయాలనీ నమ్ముతాను. అందుకే ఇది పూర్తి చేయగలిగాను. అయితే రిలేషన్ లో ఉన్న ఒక గర్ల్ కు తన బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కు గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పొచ్చు కానీ..ఒక లెస్బియన్స్ రిలేషన్ లో ఉన్నపుడు మాత్రం ఏప్పటికీ బ్రేకప్ చెప్పరు. అప్పటితరం ప్రేక్షకులకు ఈసినిమా నచ్చకపోయినా ఈ తరం ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ నెల 8న వస్తున్న 'మా ఇష్టం' సినిమా మా అందరికీ మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.
హీరోయిన్ అప్సర రాణి మాట్లాడుతూ..తెలుగులో  కొన్ని సినిమాలుచేశాను.మొదట ఈ సినిమా చేయడానికి యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటివరకు ఇలాంటి సినిమా ఎవరూ తీయలేదని అర్జీవి గారు చెప్పడంతో.. వెరైటీ పాత్రలు చేయాలనుకుని ఈ సినిమా చేస్తున్నాను.అర్జీవి గారితో సినిమా చేయడం వలన నాకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.. నైనా తో వర్క్ చేయడంతో నాకు ఈ సినిమా ద్వారా  ఒక మంచి ఫ్రెండ్ లభించింది.ఈ సినిమా మా అందరికీ గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.


గీత రచయిత ప్రవీణ్ మాట్లాడుతూ.. RGV గారంటే నాకు ఎంతో ఇన్స్పిరేషన్.తనపై ఇంటెలిజెంట్ ఇడియట్ అనే బుక్ రాయడం అదృష్టంగా బావిస్తున్నాను.ఈ బుక్ లో ఎంటర్ ద బ్రూస్ లీ మై లైఫ్ అని ఒక ముందు మాట చెప్పాను.  అర్జీ గారు రాముడు కాదు నేను కంచర్ల గోపన్నను కాదు.ఆయనపై నాకు ప్రేమ తప్ప, భక్తి లేదు. భక్తి ఉంటే ఫాలోయింగ్ మాత్రమే ఉంటుంది కానీ ప్రశ్నించే అవకాశం ఉండదు కానీ ప్రేమలో ప్రశ్నించే హక్కు ఉంటుంది. నేను రాసిన ఈ బుక్ లో రాము గారిని చాలా సార్లు ప్రశ్నించాను.ఈ రోజు తన చేతులమీదుగా బుక్ విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !