View

ఫ్యామిలీ ఎమోషన్స్ తో 'లెహరాయి' - మోషన్ పోస్టర్ విడుదల

Thursday,April21st,2022, 01:45 PM

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ పతాకంపై రంజిత్, సౌమ్య మీనన్, గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం "లెహరాయి". ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్దమైన సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో సినీ అతిరదుల సమక్షంలో ఈ చిత్ర మోషన్ పోస్టర్ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు విజయ్ కుమార్ కొండా గారు చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...


ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ..ఈ చిత్ర దర్శకుడు రామకృష్ణ గుండెజారి గల్లంతయ్యిందే.. సినిమా నుంచి నాతో ట్రావెల్ అయ్యాడు. చాలా సినిమాలకు పనిచేశాడు.తను మంచి సెన్సిబుల్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు తను చేస్తున్న ఈ సినిమాకు "లెహరాయి" అని మంచి టైటిల్ పెట్టాడు.జి.కె గారు మంచి మ్యూజిక్ ఇచ్చాడుమంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకుని తీసిన నిర్మాత శ్రీనివాస్ గారిని సపోర్ట్ చేయడానికి బెక్కం వేణుగోపాల్ గారు సపోర్ట్ గా నిలవడం చిత్ర యూనిట్ కు శుభపరిణామం అని అన్నారు.


చిత్ర సమర్పకుడు బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను శ్రీనివాస్, రామకృష్ణలు నాకు చూపించడం జరిగింది.ఈ చిత్రం నాకు బాగా నచ్చడంతో కథకు తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేయించడంతో ఈ రోజు పర్ఫెక్ట్ మూవీని ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నాం. సూపర్ హిట్ అయిన పాటను ఈ సినిమాకు టైటిల్ పెట్టడం జరిగింది.ఈ సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ చాలా కస్టపడ్డారు. మంచి కథతో వస్తున్న దర్శకుడు రామకృష్ణ ఫ్యూచర్ లో పెద్ద దర్శకుడు అవుతాడు అన్నారు.


చిత్ర నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ..బెక్కం వేణుగోపాల్ ఆధ్వర్యంలో నేను "లెహరాయి సినిమాను నిర్మించడం జరిగింది. ఎన్నో చిత్రాలు నిర్మించిన బెక్కం వేణుగోపాల్ గారు మా "లెహరాయి" సినిమాకు సపోర్ట్ గా నిలిచారు.వారికి నా ధన్యవాదాలు. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. "లెహరాయి" అంటే అల అని అర్థం. సముద్రపు అలల్లాగా జీవితంలో ఒడిదుడుకులు కూడా ఉంటాయి. మన మోషన్ పోస్టర్ లో చూశాము. రెండు పక్షులు తమ రెక్కలు ఎగురేసుకుంటూ తమ యొక్క ప్రయాణాన్ని కోనసాగుస్తూ ఉన్నాయి. అదేవిధంగా లెహరాయి సినిమాలో కూడా హీరోయిన్   ప్రేమ 'ఒక వైపు ఉంటే గోల్ మరో వైపు ఈ రెండిటి మధ్యన ఉన్న సంఘర్షణ ను తను ఎలా ఎదుర్కిన్నదనే "లెహరాయి."మంచి కొన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా. అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.


చిత్ర దర్శకుడు రామకృష్ణ పరమహంస మాట్లాడుతూ.. మా టైటిల్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన విజయ్ కుమార్ కొండా గారికి ధన్యవాదాలు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ తో మిలితమైన ఫీల్ గుడ్ లవ్ హేట్స్ లవ్ స్టొరీ అందరికీ నచ్చుతుంది అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ జి.కె మాట్లాడుతూ.. చాలా రోజుల తరువాత మంచి ఫీల్ గుడ్ మూవీ కి మ్యూజిక్ అందించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.


టిప్స్ సుప్రీం రాజు మాట్లాడుతూ.. ఫీల్ గుడ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.


చిత్ర హీరో రంజిత్ మాట్లాడుతూ.. ఇందులో నా క్యారైజేషన్ చాలా టిపికల్ గా ఉంటుంది.నాకిలాంటి మంచి సినిమాలో అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మంచి కాన్సెప్టుతో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.


నటీనటులు
రంజిత్, సౌమ్య మీనన్,గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ,సత్యం రజెష్,జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు


సాంకేతిక నిపుణులు
ప్రజెంట్ : బెక్కం వేణుగోపాల్
బ్యానర్ : ఎస్ ఎల్ ఎస్ మూవీస్
సినిమా : "లెహరాయి" 
నిర్మాత : మద్దిరెడ్డి శ్రీనివాస్
రైటర్, డైరెక్టర్ : రామకృష్ణ పరమహంస
మ్యూజిక్ : జీకే (గంది కృష్ణ)
డి.ఓ.పి :  ఎం ఎన్ బాల్ రెడ్డి
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
లిరిక్ రైటర్స్ :;రామజోగయ్య శాస్త్రి, శ్యామ్ కాసర్ల, శ్రీమణి
ఫైట్ మాస్టర్ :  శంకర్
కొరియోగ్రాఫర్స్ :  అజయ్ సాయి ,వెంకట దీప్
రైటర్ : పరుచూరి నరేష్
పి ఆర్.ఓ : ఏలూరు శీను, మేఘశ్యామ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !