View

ఘనంగా ప్రారంభమైన సొహైల్ "లక్కీ లక్ష్మణ్‌''

Friday,April22nd,2022, 02:09 PM

చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్‌’ వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని, రమ్య ప్రభాకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "లక్కీ లక్ష్మణ్". ఈ చిత్రం ప్రారంభోత్సవ  పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాతలు మిరియాల రవీంద్ర రెడ్డి, బెక్కం వేణుగోపాల్, పుప్పాల రమేష్ మరియు రాజా రవీంద్ర  లు స్క్రిప్ట్ ను అందించగా  దర్శకుడు ప్రవీణ్ సత్తారు హీరో సోహైల్ హీరోయిన్ మోక్ష లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్  గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత అప్పిరెడ్డి "లక్కీ లక్ష్మణ్" మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో...


చిత్ర హీరో సొహైల్ మాట్లాడుతూ.. చాలా మంది సొహైల్ సినిమా మీద సినిమా ఒప్పుకుంటున్నాడు ఏంటి అనుకోవచ్చు.అయితే నాకు కథ నచ్చితేనే సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటాను.మా దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్  చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారు ఈ సినిమాకు టెక్నికల్ పరంగా, ఔట్ ఫుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండాక్ సీనియర్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలాంటి మంచి లేడీ ప్రొడ్యూసర్ లు ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.


చిత్ర నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ..మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సినీ పెద్దలకు ధన్యవాదాలు. కెరీర్ పరంగా ఐటి రంగంతో స్టార్ట్ అయిన నా జర్నీ రియల్ ఎస్టేట్ రంగంలో సెటిల్ అయ్యాను. దర్శకుడు అభి ఎంతో ట్యాలెండెడ్ పర్సన్ తనకు సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఎప్పుడూ సినిమా డైలాగ్స్ చెపుతూ కథలు డిస్కషన్ చేసేవాడు. తను పడే తపన చూసి నా రియల్ ఎస్టేట్ బిజినెస్ లను పక్కనపెట్టి సినిమా ఇండస్ట్రీతో నాకు పెద్దగా పరిచయం లేకపోయినా నీ కోసం నేనే సినిమా చేస్తాను మంచి కథ ఉంటే చెప్పామన్నాను. అభి చెప్పిన కథ ఫ్రెష్ గా అనిపించడంతో సినిమా నిర్మించే నిర్మాతకు ఎలాంటి బాధ్యతలు వుంటాయి.24 క్రాఫ్ట్స్ అంటే ఏంటి ఇలా అన్ని విభాగాలను 6 మంత్స్ ఫుల్ స్టడీ చేసిన తరువాత నేను, నా ఫ్రెండ్ రమ్య ప్రభాకర్ లు ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాము. ఈ సినిమాకు హీరోగా ఎవరిని సెలెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు. ఎంతో కష్టపడే  సోహైల్ అయితే ఈ సినిమాకు కరెక్ట్ అని దర్శకుడు అభి చెప్పడంతో తనను హీరోగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.మేము అడిగిన వెంటనే మా కథ విని డిఓపి అండ్రూ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, ఎడిటర్ ప్రవీణ్ పూడి,పాటల రచయిత భాస్కర పట్ల వంటి సీనియర్ టెక్నిషన్స్ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు అన్నారు.


చిత్ర దర్శకుడు అభి మాట్లాడుతూ...మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. అయితే సొంతంగా ఒక సినిమా తీయాలని ఈ కథ రాసుకుని నిర్మాతలకు చెపుదాం అనుకున్నప్పుడు హరిత గోగినేని నాతో నీ దగ్గర మంచి కథ ఉంటే చెప్పామన్నారు. లక్కీ గా నేను చెప్పిన కథ తనక నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు.అందుకే ఈ సినిమా టైటిల్ కు లక్కీ అని పెట్టాను.ఈ టైటిల్ కూడా కథలోనుండి వచ్చిందే..ఆ తరువాత సోహైల్ కు ఈ కథ చెప్పగానే తను ఫస్ట్ సిట్టింగ్ లోనే చేయడానికి ఒప్పుకున్నాడు. నిర్మాతకు ఇది మొదటి సినిమా అయినా తను డిఓపి అండ్రూ, అనూప్ రూబెన్స్, ప్రవీణ్ పూడి,భాస్కర పట్ల వంటి సీనియర్ టెక్నిషన్స్ ను తీసుకువచ్చారు. మంచి డీఫ్రెంట్ సబ్జెక్టు తో  వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.


నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. "లక్కీ లక్ష్మణ్" టైటిల్ లోనే లక్ ఉన్నట్టు సొహైల్ కు కూడా మంచి లక్ ఉంది. అందుకే ఈమధ్య డీఫ్రెంట్ సబ్జెక్ట్స్ లను సెలెక్ట్  చేసుకుంటూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న సొహైల్  తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆయుస్మాన్ ఖురాన్ లా ఎదగాలని కోరుకుంటున్నాను."లక్కీ లక్ష్మణ్" మోషన్ పోస్టర్ కూడా చాలా క్రియేటివ్ గా ఉంది. మొదటి సారి సినిమా చేస్తున్న దర్శక, నిర్మాతలు ప్రేక్షకులకు ఒక మంచి కాఫీ లాంటి సినిమా ఇస్తారని ఆశిస్తున్నాను అన్నారు. 


డిఓపి అండ్రూ మాట్లాడుతూ.. ఎన్నో లవ్ స్టోరీలు తీసిన నేను చాలా రోజుల తరువాత మంచి లవ్ స్టొరీ ఉన్న సబ్జెక్ట్ తీస్తున్నాము.అభి చెప్పిన కథ చాలా బాగుంది. ప్రేక్షకులకు ఈ సినిమా మంచి విజువల్ ట్రీట్ అవుతుందని అనుకుంటున్నాను అన్నారు.


సురేష్ కొండేటి మాట్లాడుతూ.. బిగ్ బాస్ తరువాత తను సినిమా మీద చేస్తున్నా మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ద్వారా మహిళా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన సొహైల్ కు ఈ సినిమా కూడా మంచి పేరు తీసుకువస్తుందని కోరుతున్నాను. లక్కీ లక్ష్మణ్ సినిమా ద్వారా హరితా గోగినేని నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమవు తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.


హీరోయిన్ మోక్ష మాట్లాడుతూ.. లక్కీ లక్ష్మణ్ వంటి మంచి సినిమాలో సీనియర్స్ తో కలసి వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు లక్కీ గా ఫీల్ అవుతున్నాను. నాకిలాంటి మంచి అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.


నటీనటులు
సోహెల్, మోక్ష, దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ తదితరులు


సాంకేతిక నిపుణులు
బ్యానర్స్ - వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియా, నిర్మాతలు - హరిత గోగినేని, రమ్యా ప్రభాకర్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - ఏఆర్ అభి, సంగీతం - అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్ - ఐ. ఆండ్రూ, ఎడిటర్ - ప్రవీణ్ పూడి, పాటలు - భాస్కరభట్ల, కొరియోగ్రాఫర్ - విశాల్, ఆర్ట్ డైరెక్టర్ - చరణ్, ఫైట్స్ - పృథ్వీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - విజయానంద్. కీత, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ - కృష్ణ కుమార్ అంకం, పీఆర్వో - నాయుడు-ఫణి, మార్కెటింగ్ పార్ట్ నర్ - అఖిలేష్ (టికెట్ ఫ్యాక్టరీ), పబ్లిసిటీ డిజైనర్ - ధని ఏలే, కాస్టింగ్ డైరెక్టర్ - ఓవర్ 7 ప్రొడక్షన్స్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !