View

'డ్యూడ్' ఓటిటి - గ్రాండ్ గా లోగో లాంచ్

Saturday,April23rd,2022, 09:48 AM

COVID-19 మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంత నష్టపోయారో మనందరికీ తెలిసిందే..ఈ క్రమంలోనే డిజిటల్ రంగం ప్రజలకు అత్యంత చేరువ కావడంతో వీక్షకులకు వినోదాన్ని అందించేందుకు అనేక ఓటిటి లు డిజిటల్ రంగంలోకి ప్రవేశించాయి. ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఫ్యామిలీ అంతా కలసి చూసేలా వెలసిన అనేక ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలను అలరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సినీ ప్రేక్షకులు కూడా భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే థియేటర్స్ కు వెళుతుండడంతో చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలకు నోచుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఓటిటి లో విడుదల చేయడానికి ముందుకు రావడంతో ఇటీవల ఓటీటీలకు బాగా డిమాండ్‌ పెరుగుతుంది.ఈ నేపథ్యంలో అటువంటి వారికి చేయూత నిచ్చేందుకు ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్త మవుతుంది"డ్యూడ్"(DUDE) ఓటిటి. మే 1 న సినీ అతిరధుల చేతులమీదుగా గ్రాండ్ గా  "డ్యూడ్"(DUDE) ఓటిటి  యాప్ విడుదలవుతున్న  సందర్భంగా  హైదరాబాద్‌లోని రామా నాయుడు స్టూడియోలో "డ్యూడ్"(DUDE) ఓటిటి లోగోను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన లక్ష్మి (ఈశ్వర్ తల్లి),  హైమా లు  యాప్ స్పాన్సర్ చేయగా ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైన్మెంట్ రాజీవ్, హీరోయిన్స్ డెబోరా డోరిస్ , హరిత, కమెడియన్ క్రేజీ అభి, డ్యూడ్ డైరెక్టన్ టీం చేతులమీదుగా "డ్యూడ్"(DUDE) ఓటిటి లోగోను విడుదల చేశారు.ఈ ఓటిటి లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న  10 మంది కొత్త దర్శకుల సినిమాల ట్రైలర్స్ ను ప్రదర్శించడం జరిగింది.అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...


ఈ సందర్భంగా 24 క్రాఫ్ట్స్ లలో పట్టు సాధించిన దర్శక, నిర్మాత" డ్యూడ్"(DUDE) ఓటిటి వ్యవస్థాపకుడు ఈశ్వర్ మాట్లాడుతూ..ఈ రోజు "డ్యూడ్"(DUDE) ఓటిటి లోగోను తన తల్లి చేతులమీదుగా లాంచ్ చేయడం తమకు ఎంతో గర్వకారణం. ఇప్పటికే మార్కెట్ లో చాలా ఓటిటి లు వచ్చాయి. ఎన్ని ఓటిటిలు వచ్చినా కంటెంట్ ఉన్న ఓటిటి లకు ప్రేక్షకాదరణ లభిస్తుందనే విషయాన్ని ప్రేక్షకులు నిరూపిస్తున్నారు."డ్యూడ్"(DUDE) ఓటిటి కు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మా నాన్న ఉన్నంత వరకు ఎప్పుడూ నవ్వుతూ పదిమందికి ఉపయోగపడే పని మాత్రమే చేయమనేవారు. వారి స్పూర్తితో  ప్రతిభ ఉండి అవకాశాలు రాక, వచ్చినా మోసపోయి ఇంటికి వెళ్లే నటులు, ఇతర రంగాల్లో పనిచేసే సాంకేతిక నిపుణులకి చేయూత అందించినపుడు వారి ముఖంలో వచ్చే చిరునవ్వును మా నాన్న చిరునవ్వుగా భావిస్తూ వారందరికీ సరైన మార్గాన్ని ఏర్పరచాలనే దృఢ నిశ్చయంతో నేను,ధూళిపూడి కలసి ఈ డ్యూడ్ ఓటీటీకి నాంది పలికాము. ఇది ఇతర సాంప్రదాయ ఓటీటీల్లా కొందరి చేతుల్లోనే ఉండదు. ఈ ఓటీటీ ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క నటులది. కేవలం  నటులే కాదు.. సినిమాని ప్రేమించే ప్రతి వ్యక్తి సొంతం. 24క్రాఫ్ట్స్ లో పనిచేసే అందరికి ఇది చక్కటి అవకాశం. నిర్మాతలుగా మారాలనే వారికి, నూతన నటులకి  ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది డ్యూడ్ ఓటీటీ. ప్రారంభం రోజే సినీ పరిశ్రమ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. చాలా మంది ప్రముఖులు, పెట్టుబడిదారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇప్పుడున్న ఓటిటి లకు మేము పోటీ అనుకోకుండా వారి దగ్గరకు చేరుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఈ ఓటిటి లో సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, గేమ్స్, స్పోర్ట్స్,లైవ్ న్యూస్, కిడ్స్ కంటెంట్, ఈవెంట్స్, లైవ్ ఈవెంట్స్ ఇలా అన్ని రకాల కంటెంట్‌తో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తాం. భవిష్యత్‌లో మరిన్ని సేవలు అందించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మంచి కంటెంట్ తో వస్తున్న "డ్యూడ్"(DUDE) ఓటిటి ని మే 1 న విడుదల చేస్తాం.కాబట్టి  ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.


ఈస్ట్ వెస్ట్ రాజీవ్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో సంవత్సరానికి 500 వినిమాలు షూటింగ్ జరుపుకుంటే  అందులో 300 మాత్రమే విడుదలవ్వగా మిగిలిన 200 సినిమాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా కూడా విడుదలకు నోచుకువడం లేదు. అట్టి సినిమా కొరకు ఎంతో మంది ప్రాణం పెట్టి  తమ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలనుకొనే నటీనటులు, టెక్నీషియన్స్ ల  ప్రతిభ  మరుగున పడిపోతుంది. ఇలా ఎంతోమంది యువత పడుతున్న బాధలను చూసి యువతకు మంచి ప్రోత్సాహం ఇస్తే వారి ప్రతిభకు అవకాశం కల్పిస్తే వారంతా సమాజానికి ఉపయోగ పడే ఎన్నో మంచి చిత్రాలు తీసుకువస్తారని భావించిన ఈశ్వర్ బాబు, ధూళిపూడి ముందు చూపుతో సరికొత్తగా "డ్యూడ్" (DUDE) ఓటిటి అనే ఫ్లాట్ ఫామ్ ను తీసుకురావడం హర్శించదగ్గ విషయం.ఇలాంటి చక్కని అవకాశం కల్పిస్తున్న ఈశ్వర్ ప్రోత్సహనికి సినీ పరిశ్రమ నుంచి అభినందనలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీకు వచ్చే వారు ఎవరైనా అవకాశాలు లేవని వెనుతిరిగి పోకుండా "డ్యూడ్"(DUDE) ఓటిటి అండతో వారి ప్రతిభను నిరూపించుకోవాలని సూచిస్తూ నిస్వార్థ సేవతో అందరికీ అవకాశం కల్పించడానికి ముందడుగు వేసిన ఈశ్వర్ కు అల్ ద బెస్ట్ తెలియజేశారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !