View

రెండింత‌లు వినోదాన్నిఅందిస్తాం -  శ్రీ‌విష్ణు

Monday,May02nd,2022, 02:06 PM

శ్రీవిష్ణు, క్యాథ‌రిన్ థ్రెసా హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం భళా తందనాన. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించారు. చైతన్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మే6న  సినిమా విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ విశాఖ‌ప‌ట్నంలో ఆదివారంనాడు ఆహ్లాద‌క‌ర‌వాతావ‌ర‌ణంలో జ‌రిగింది. సిరిపురంలో జ‌రిగిన ఈ వేడుక‌ను వినూత్నంగా ప్రేక్ష‌కులు `ట్రైల‌ర్ రిలీజ్‌` అన‌డంతో ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. 


అనంత‌రం చిత్ర ద‌ర్శ‌కుడు చైతన్య దంతులూరి మాట్లాడుతూ, వైజాగ్ అంటే ఇష్టం. నా మొద‌టి సినిమా బాణంఇక్క‌డే షూటింగ్ చేశాం. నేను ద‌ర్శ‌కుడిని అవ్వ‌క‌ముందు వేస‌వి సెల‌వుల‌కు సినిమాల‌కు వెళ్ళేవాడిని. అలా కొన్ని మైండ్‌ లో వుండిపోయాయి. ఈనెల 6న సినిమా విడుద‌ల‌వుతుంది. అప్ప‌టికి కాలేజీ చ‌దివేవారికి ఎలాగూ చ‌దువుపూర్త‌వుతుంది. సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకోండి. ఈ సినిమా మీకు తీపిగుర్తును ఇస్తుంది. శ్రీ‌విష్ణు బ్యూటిఫుల్ యాక్ట‌ర్‌. స‌ర్‌ప్రైజ్‌కూడా ఇస్తాడు.  సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. శ్రీ‌విష్ణు న‌ట‌న‌, మ‌ణిశ‌ర్మ సంగీతం పోటీప‌డిన‌ట్లుగా వుంటుంది. క్యాథ‌రిన్ ఇంత‌కుముందు చేసిన సినిమాకు భిన్న‌మైన‌ పాత్ర వుంటుంది. నిర్మాత బాగా స‌హ‌క‌రించారు. నిర్మాత సాయిగారు మంచి ఫ్రెండ్ అయ్యారు. ఆయ‌న వ‌ల్లే సినిమా బాగా వ‌చ్చింది అని తెలిపారు. 


హీరో శ్రీ‌విష్ణు మాట్లాడుతూ, ఈ సినిమాకు కార‌ణం సాయి కొర్ర‌పాటిగారే. ఆయ‌న డేరింగ్ నిర్మాత‌. వారాహి సంస్థ‌లో ప‌నిచేయ‌డం సంతోషంగా వుంది. క్వాలిటీప‌రంగా అన్నీ స‌మ‌కూర్చి ప్రోత్స‌హించారు. చైత‌న్య నేను 14 ఏళ్ళుగా స్నేహితులం. మొద‌టి సారి ఆయ‌న సినిమాలో డైలాగ్ చెప్పాను. ఇప్పుడు హీరోగా చేశాను. ఇదే సిరిపురంలో థియేట‌ర్‌లో సినిమాలు చూసేవాడిని. ఇక్క‌డివారు జ‌న్యూన్ రిపోర్ట్ ఇస్తారు. ఈ సినిమాలో క్యాథ‌రిన్ బాగా న‌టించింది. ఆమె కెరీర్‌ లోనే బెస్ట్ సినిమా అవుతుంది. ఇక కెజిఎఫ్‌. గ‌రుడ రామ్‌గారు టాప్ విల‌న్‌గా మారారు. ఆయ‌న బ‌య‌ట చాలా సాఫ్ట్‌గా వుంటారు. కెజిఎఫ్ త‌ర్వాత ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం చాలా బాగుంది. రీరికార్డింగ్ అద్భుతంగా ఇచ్చారు. ఎడిట‌ర్ మార్తాండ్ కె.వెంక‌టేష్‌, కెమెరామెన్ సురేష్ ప‌నిత‌నం క‌నువిందు క‌లిగిస్తుంది. మే6న సినిమాను థియేట‌ర్‌కు వ‌చ్చి చూడండి. మీరు పెట్టే టికెట్‌ కు రెండింత‌లు వినోదాన్ని అందిస్తాం. మీకు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. మే6న వ‌స్తున్నాం. హిట్ కొడుతున్నాం అన్నారు. 


ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత సాయి కొర్ర‌పాటి, న‌టుడు రామ‌చంద్ర‌రాజు (గ‌రుడ‌) పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !