View

విమర్శకుల కితాబులందుకుంటున్న 'జయమ్మ పంచాయితీ'

Saturday,May07th,2022, 02:16 PM

జయమ్మ పంచాయితీ సినిమా విడుద‌ల‌కుముందు ప్రివ్యూనాడే సినీప్రముఖుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఇక  విడుద‌లైన‌రోజే భారీ ఓపెనింగ్‌తో మ‌హిళ‌ల ఆద‌ర‌ణతో పాల‌కొండ‌, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రంపాటు అన్నిచోట్ల హౌస్‌ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో ప్ర‌ద‌ర్శించ‌డం ఆనందంగా వుంద‌ని చిత్ర‌యూనిట్ తెలియ‌జేస్తోంది.


సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ`. వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మించ‌గా విజయ్ కుమార్ కలివరపు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. యువ జంట‌గా దినేష్ కుమార్, షాలినీ న‌టించారు. మే6న  విడుద‌లైన ఈ సినిమా సినీ ప్ర‌ముఖుల‌తోపాటు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతూ, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను సైతం పొందింది. ఈ సంద‌ర్భంగా శ‌నివారంనాడు రామానాయుడు స్టూడియోలో చిత్ర యూనిట్ త‌మ ఆనందాన్ని మీడియా స‌మావేశంలో పంచుకున్నారు.


సుమ మాట్లాడుతూ, ద‌ర్శ‌కుడు చిన్న చిన్న అంశాల‌తోపాటు కులం, మతం, నక్సలిజం వంటి అంశాల‌నూ చాలా చ‌క్క‌గా ట‌చ్ చేశాడు. డైలాగ్  లు సంద‌ర్భానుసారంగా వుంటూ ఆలోచింప‌జేసేలా రాశారు. శ్రీ‌కాకుళం యాస‌ను నేర్చుకుని పాత్ర‌లో ఒదిగిపోయేలా చేసిన ద‌ర్శ‌కుల టీమ్‌ కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. సంగీత ద‌ర్శ‌కులు కీర‌వాణి మాకు స‌పోర్ట్‌ గా నిల‌వ‌డ‌డం కొండంత‌బ‌లాన్నిచ్చాయి. పాట‌లు ఎక్క‌డ వుండాలో అక్క‌డ వుండేలా బాణీలు స‌మ‌కూర్చారు. నిర్మాత‌ బ‌ల‌గ‌ప్ర‌కాష్ వుండ‌ బట్టేవిజ‌య్‌కుమార్ తీయ‌గ‌లిగారు. ఆయ‌న ఇంకా మ‌రిన్ని సినిమాలు తీయాల‌ని కోరుకుంటున్నా. ఇంకా ఈ సినిమాను అంద‌రూ చూసి ఆనందించండి.  మంచి సినిమా చేశామ‌న్న తృప్తినిచ్చింది అన్నారు.


ద‌ర్శ‌కుడు విజయ్ కుమార్ కలివరపు మాట్లాడుతూ, తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ యావ‌త్తూ, మ‌హేష్‌బాబు, కీర‌వాణి, రాజ‌మౌళి ఎంతో మంది మా సినిమాకు ప్ర‌మోష‌న్ చేయ‌డానికి కార‌ణం ఉమెన్ సెంట్రిక్ క‌థ, సుమ‌గారి న‌ట‌న వ‌ల్లే సాధ్య‌మ‌యింది. త్రివేండ్రంలో మిక్సింగ్ జ‌రుగుతుండ‌గా సినిమా చూశాక నా క‌ళ్ళ‌వెంట నీళ్ళు వ‌చ్చేశాయి. జీవితంలో ఈ ఒక్క సినిమా చాలు అనిపించింది. రిలీజ్‌కు ముందు మొన్న ఎ.ఎం.బి.థియేట‌ర్‌లోప్ర‌ముఖుల‌తో ప్రివ్యూ వేశాం. ఆరోజు ద‌ర్శ‌కులు సుకుమార్‌, నందినిరెడ్డి వంటివారెంద‌రో చూసి మెచ్చుకోవ‌డం విశేషం. సుకుమార్‌గార‌యితే ద‌ర్శ‌కుడు ఎక్క‌డా! అంటూ వ‌చ్చి అభినందించారు. నందినిరెడ్డిగారు గౌవ‌రంగా నాకు న‌మ‌స్క‌రించ‌డం మ‌ర్చిపోలేనిది. చూసిన‌వారంతా తెలుగులో బెస్ట్ ఫిలిం అంటూ కితాబిచ్చారు.  సుకుమార్‌ గారు అయితే మీరు ఊ.. అనండి మీతో సినిమా చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ సినిమా చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడికీ హార్ట్ ట‌చ్ చేసే సినిమా అని తెలిపారు.


న‌టుడు దినేష్ కుమార్ మాట్లాడుతూ, బి. టెక్ త‌ర్వాత సినిమాల్లోకి రావాల‌ని 8ఏళ్ళుగా ప్ర‌య‌త్నిస్తున్నా. మా శ్రీ‌కాకుళంలోని అమ్మ‌వారికి మొక్కుకున్నా. ఆ అమ్మదీవెన‌ల‌వ‌ల్లే మా ఊరు పాల‌కొండ‌లో షూట్ జ‌రిగేలా చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. అందులోనూ సుమ‌గారితో న‌టించ‌డం మ‌ర్చిపోలేనిది. రిలీజ్ అయిన రోజే  పాల‌కొండ‌, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రంలో హౌస్‌ఫుల్‌ గా న‌డుస్తోంది. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు విజ‌య్‌కుమార్‌కు నిర్మాత‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు.


హీరోయిన్ షాలిని మాట్లాడుతూ, అచ్చ‌మైన తెలుగుద‌నం వున్న సినిమా. ఇలాంటి సినిమాలో భాగ‌మైనందుకు చాలా ఆనందంగా వుంది. సుమ‌గారితో నా మొద‌టి సినిమా చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.


భువ‌న్ మాట్లాడుతూ, కోపానికి ప్ర‌తీక‌గా నా పాత్ర వుంటుంది. ప్ర‌తి ఒక్క‌రూ సినిమాటోగ్ర‌ఫీ గురించి, ద‌ర్శ‌కుడు గురించే మాట్లాడుతున్నారు. సుమ గారి పాత్ర అల్టిమేట్‌ప్రివ్యూ రోజు సుకుమార్ ఈ చిత్ర ద‌ర్శ‌కుడిని అభినందించ‌డం విశేష‌మ‌ని అన్నారు.


జబర్దస్త్ త్రినాథ్ మాట్లాడుతూ, ఈ సినిమాతో నా పాత్ర పేరు జ‌మ్మ‌డుగా మారిపోయింది. అంద‌రూ అదే పేరుతో పిలుస్తున్నారు. సుమ‌గారి వ‌ల్లే ఈసినిమా బాగా పాపుల‌ర్ అయింది. మిగిలిన ఆర్టిస్టుల‌కూ పేరు రావాల‌ని ఆమె ప‌బ్లిసిటీకి స‌హ‌క‌రించ‌డం విశేష‌మ‌ని అన్నారు.


ఈ సంద‌ర్భంగా జ‌య‌మ్మ పంచాయితీ షూటింగ్ విశేషాల‌ను తెలియ‌జేస్తూ ర‌చ‌యిత రాసిన పుస్త‌కాన్ని సుమ ఆవిష్క‌రించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !