View

హరీష్ శంకర్ చేతుల మీదుగా విడుదలైన కిరాయి ఫస్ట్ లుక్, టైటిల్ 

Wednesday,June08th,2022, 02:59 PM

చీకటి గదిలో చిలక్కొట్టుడు, 24 కిస్సెస్, డియర్ మేఘ, రీసెంట్ గా రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న "కొండ" చిత్రాలలో హీరోగా హీరోగా  నటిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు త్రిగున్.తను తాజాగా నటిస్తున్న చిత్రం "కిరాయి".SAY క్రియేషన్స్, ARK ఆర్ట్స్, సినీ ఫ్యాన్ విజన్, జయ పుత్ర ఫిల్మ్స్ పతాకంపై  త్రిగున్ ప్రధాన హీరోగా V . R. K, దర్శకత్వంలో అమూల్య రెడ్డి యలమూరి, నవీన్ రెడ్డి వుయ్యూరు లు సంయుక్తంగా  నిర్మిస్తున్న  చిత్రం "కిరాయి".గుంటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని  1995 2003, 2020 లలో గుంటూరు, పల్నాడు లలో ఎక్కువగా కిరాయి హత్యలు జరిగేవి. ఈ హత్యల నేపథ్యంలో తెరకేక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ రోజు హీరో త్రిగున్ బర్త్ డే సందర్బంగా స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ "కిరాయి" చిత్రంలోని రస్టిక్, రగ్గడ్ గా ఉండే ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఈ సందర్బంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ..త్రిగున్ నాకు చాలా కాలం నుండి తెలుసు. తను చాలా ఎనర్జీటిక్ హీరో గతంలో లవ్, కామెడీ వంటి మంచి మంచి సినిమాలు చేశాడు.ఈ చిత్ర ఫస్ట్ లుక్ చూశాను చాలా బాగుంది.   తను మొదటి సారిగా డిఫరెంట్ సబ్జెక్టు అట్టెంప్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.


చిత్ర దర్శకుడుV. R. K,(రామకృష్ణ) మాట్లాడుతూ.. గుంటూరు, పల్నాడు లో ఒకప్పుడు ఎక్కువగా  హత్యలు జరిగేవి.దాని ఆధారంగా మేము గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీస్తున్నాము. ఇందులో హీరో  కిరాయి తీసుకోకుండా కిరాయిహత్య చేయవలసి వస్తుంది.అలా ఎందుకు చేయవలసి వచ్చింది. ఇలా వరుస  హత్యలు ఎందుకు చేస్తారు. ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేదే ఈ కథ. ఇందులో హీరోగా నటించిన త్రిగున్ కు మంచి బ్రేక్ వస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా రష్  & ఫస్ట్ లుక్ చూసిన రామ్ గోపాల్ వర్మ గారు చాలా బాగుందని మెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమాకు మంచి టెక్నిసియన్స్ తో పాటు  చక్కని ప్యాడింగ్ మంచి  రోల్స్ లో నటిస్తున్నారు. ఇది యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా ఎదో రెండు ఫైట్స్ పెట్టి చుట్టేసే సినిమా కాదు. ఇందులో యాక్షన్ మాములుగా ఉండదు.  ఒక ట్రాన్స్ఫారం బద్దలయితే ఎలా ఉంటుందో ఆలా హెవీ యాక్షన్ తో ఆడియన్స్ కు థ్రిల్ ఇవ్వ బోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది అన్నారు.


చిత్ర నిర్మాత అమూల్య రెడ్డి యలమూరి మాట్లాడుతూ.. ఈ సినిమా కొరకు గుంటూరు సబ్ జైల్లో, చంచల్ గూడ, చర్లపల్లి జైల్లల్లో కిరాయి హత్యలు చేసే వారి గురించి director రీసెర్చ్ చేసిన తర్వాత వీళ్ళ జీవితాల్లో  కూడా కష్టాలు, నష్టాలు, భాధలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయని తెలుసు కొన్నాము. "కిరాయి" టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టైటిల్, పోస్టర్స్  హరీష్ శంకర్ గారికి వర్మ గారికి బాగా నచ్చాయని చెప్పారు.


మరో నిర్మాత నవీన్ రెడ్డి వుయ్యూరు మాట్లాడుతూ..హై వోల్టేజ్  యాక్షన్ మూవీ లా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది.మా చిత్ర  హీరో త్రిగున్ గారి బర్త్ డే అయినందున ఈరోజు డైరెక్టర్ హరీష్ శంకర్  గారు రస్టిక్, రగ్గడ్ గా ఉండే టైటిల్ ను రిలీజ్ చేశారు. వారికి మా ధన్యవాదాలు అని అన్నారు.


నటీ నటులు హీరో: త్రిగుణ్ (కొండ ఫేమ్)


సాంకేతిక నిపుణులు బ్యానర్స్ : : సే క్రియేషన్స్, ARK ఆర్ట్స్, సినీ ఫ్యాన్ విజన్, జయ పుత్ర ఫిల్మ్స్ టైటిల్ : కిరాయి, నిర్మాతలు : అమూల్య రెడ్డి యలమూరి, నవీన్ రెడ్డి వుయ్యూరు సహ నిర్మాతలు. బి. గురువరావు, పి. సీతారాం, దర్శకుడు: V . R. K,ఎడిటర్: ధర్మేంద్ర కాకరాలడి ఓపి . సుజాత సిద్ధార్థ్,రి రికార్డింగ్. ఓషో వెంకట్,సంగీతం. హరి గౌర,డైలాగ్స్. భరత్ కుమార్ పోగుల,సాహిత్యం. రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్.పి. ఆర్. ఓ : మధు వి. ఆర్Digital : Manoj Tadi



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !