View

ఆయన జయంతి ఎందరికో మార్గదర్శకం కావాలి - తమ్మారెడ్డి   

Tuesday,June14th,2022, 02:20 PM

నటీనటులు చనిపోయిన తరువాత వారి జయంతిని పదిమందికి స్ఫూర్తిగా  నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, నటుడు రాజబాబును  ఇంతగా  ప్రేమించే పిల్లలు ఉండటం అదృష్టమని  నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. క్యారెక్టర్ నటుడు రాజబాబు 65 వ జయంతి వేడుకలు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో సోమవారం జరిగాయి  రాజబాబు కుమారులు రమేష్ చంద్ర, వీరన్న చౌదరి, కుమార్తె శ్రీదేవి, స్నేహితులు కాకాని బ్రహ్మం, నాగేశ్వర రావు, భగీరథ, నర్రా వెంకట్ రావు, సూర్య తేజ, రాజబాబు జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరుగురికి రాజబాబు స్మారక అవార్డులు, తొమ్మిది మంది పేద కళాకారులకు ఆర్థిక సహాయం అతిథుల ద్వారా అందించారు.


ఈ సందర్భంగా భరద్వాజ మాట్లాడుతూ, రాజబాబు చాలా  సౌమ్యుడు, అందరితో స్నేహపాత్రంగా ఉంటాడు, ఆయన మరణించిన తరువాత ఈ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించడం ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందని చెప్పారు.


తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె .ఎల్ .దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, స్వర్గస్తులైన వారిని స్మరిస్తూ కార్యక్రమాలు సంస్థలు ఎందుకు నిర్వహించవని మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు . ఆయా నటీనటుల కుటుంబ సభ్యులు ముందుకు వస్తే తాము చేయూతనిస్తామని, అందుకు రాజబాబు కుటుంబం ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.. సినిమా రంగంలో ఇది చాలా మంచి సంప్రదాయమని, అందరూ  ఆదర్శంగా తీసుకోవాలని సలహా ఇచ్చారు.


తెలుగు చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. గతం లో తామ సంతాప సభలు, జయంతి వేడుకలు నిర్వహించామని, అయితే ఇలాంటి స్పందన మాత్రం తానూ చూడలేదని చెప్పారు. రాజబాబు చనిపోయిన తరువాత ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు నిర్వహించిన ఈ వేడుక మాత్రం చాలా స్ఫూర్తి కలిగిస్తుందని, ఆయన పేరుతో స్మారక అవార్డులు ఇవ్వడంతో పాటు, పేద కళాకారులకు ఆర్ధిక సహాయం చెయ్యడం కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు .


"మా " ఉపాధ్యక్షులు డాక్టర్ మాదాల రవి మాట్లాడుతూ.. రాజబాబు మంచి స్నేహశీలి, ఆయనతో ఒకసారి పరిచయం అయితే ఎవరూ  మర్చిపోలేరు. ఆయన జయంతి వేడుకలను ఇలా స్ఫూర్తిదాయకంగా నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు.


దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు , డాక్టర్ ఎమ్ .వినోద్ బాల, రామ్ జగన్, కృష్ణ భగవాన్, శ్రీమతి శివ పార్వతి, శివన్నారాయణ రాజబాబుతో తమకున్న అనుభవాలను పంచుకున్నారు.


రాజబాబు జయంతి వేడుకల కమిటీ అధ్యక్షుడు కాకాని బ్రహ్మం మాట్లాడుతూ.. తనకు రాజబాబు అత్యంత సున్నిత మిత్రుడని, అలాంటి మిత్రుడు ఇంత త్వరగా దూరమవుతాడని ఎప్పుడు అనుకోలేదని , రాజబాబు జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం వారి కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహిస్తామని చెప్పారు.  
సినిమా రంగంలో కోట్లు సంపాదించి పోయినవారు ఎందరో వున్నారు. అయితే వారి జయంతిని ఒక వేడుకలా జరుపుదామనే భావన చాలా మందిలో లేదు . రాజబాబు లాంటి చిన్న నటుడు ను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని ఇలా ఘనంగా నిర్వహించిన వారి కుటుంబ సభ్యులను మనసారా అభినందిస్తున్నా అని భగీరథ చెప్పారు. ఒక వారం రోజుల క్రితమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నామని, ఇందుకు అందరూ సహకరించారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం శ్రీమతి శివ పార్వతి, శ్రీమతి సుహాసిని, శ్రీమతి  సరోజినీ, రామ్ జగన్,  శివన్నారాయణ, గోపి నాయుడు లకు రాజబాబు స్మారక అవార్డులను భరద్వాజ, దాము, మాదాల రవి, ప్రసన్న కుమార్ ప్రదానం చేశారు.


పేద కళాకారులైన  రమ్య చౌదరి, గోధురం మురళి, గోవా శర్మ,  పొట్టి స్వామి, తెనాలి శకుంతల, తిరుపతి, కృష్ణవేణి, దుర్గ నాగేశ్వర రావు, లక్ష్మి తులసి కి ఒక్కొక్కరికి పదివేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని రాజబాబు కుటుంబ సభ్యులు రమేష్ చంద్ర, వెంకన్న చౌదరి, శ్రీదేవి అందించారు.


జర్నలిస్ట్ రాంబాబు పుట్టినరోజు సందర్భంగా, తమ్మారెడ్డి భరద్వాజ, దాము , ప్రసన్న కుమార్, మాదాల రవి, కాకాని బ్రహ్మం, రాజబాబు కుటుంబ సభ్యులు సత్కరించారు. సభకు ముందు రాజబాబు జీవిత పై ఓ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !