View

తల్లితండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి - డీన్ మధు మహంకాళి  

Friday,June17th,2022, 07:37 AM

"ఎవరైనా పిల్లలు... నేను కలెక్టర్ అవుతాను, డాక్టర్ చదువుతాను" అంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు, గర్వపడతారు. కానీ అదే పిల్లలు... "నేను హీరో అవుతాను, డైరెక్షన్ చేస్తాను, సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకుంటాను" అంటే మాత్రం గాభరాపడతారు. తల్లితండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి" అంటున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు-నిర్మాత, "దాదా సాహెబ్ ఫాల్కే ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" డీన్ మధు మహంకాళి. సివిల్ సర్వెంట్స్ కి, డాక్టర్స్, లాయర్స్ కి తీసిపోని గౌరవమర్యాదలు... సినిమా రంగంలో రాణిస్తున్నవారికి దక్కుతున్నాయనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని ఆయన పిలుపునిస్తున్నారు!!


దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కళాతపస్వి కె.విశ్వనాధ్ చేతుల మీదుగా మొదలై... అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు వంటి చిత్ర ప్రముఖుల ప్రోత్సాహంతో తెలుగు చిత్రసీమకు గత ఐదేళ్లుగా ఎందరో ప్రతిభావంతుల్ని పరిచయం చేస్తున్న "దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" అత్యంత విజయవంతంగా ఐదు వసంతాలు పూర్తి చేసుకుని, ఆరో ఏట అడుగుపెడుతున్న సందర్భంగా మధు మహంకాళి ప్రత్యేకంగా ముచ్చటించారు. తెలుగు రాష్ట్రాల్లో... దిగువ మధ్య తరగతివారికి అందుబాటులో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఏకైక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ తమదేనని మహంకాళి పేర్కొన్నారు!!


"అంతర్జాతీయ ప్రమాణాలు... అందరికీ అందుబాటులో ఫీజులు" అనే సిద్ధాంతంతో ప్రగతిపథంలో దూసుకుపోతున్న "దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్"లో యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ"లకు మాత్రమే పరిమితం కాకుండా... "ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డిజిటల్ మ్యూజిక్ ప్రొడక్షన్" వంటి కోర్సులు సైతం ఉండడం తమ ఫిల్మ్ స్కూల్ ప్రత్యేకత అని మధు వివరించారు.


ఇప్పటివరకు తమ ఫిల్మ్ స్కూల్ లో కోర్సులు చేసినవారంతా... ఇండస్ట్రీలో వివిధ శాఖల్లో విశేషంగా రాణిస్తున్నారని అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ కు డైరెక్టర్ కూడా అయిన మధు ప్రకటించారు. నేషనల్, ఇంటర్నేషనల్, రీజినల్ సినిమాలపై సమగ్ర అవగాహన కలిగేలా తమ ఫిల్మ్ స్కూల్ సిలబస్ డిజైన్ చేశామని. మన దేశంలో ఉన్న బెస్ట్ ఫిల్మ్ స్కూల్స్ అనుసరించే సిలబస్ బాగా స్టడీ చేసి... వాటన్నిటిలో ఉన్న ఉత్తమ అంశాలు మేళవించి... తమ ఫిల్మ్ స్కూల్ బోధనను పొందుపరిచామని మధు తెలిపారు. సినిమా రంగంలో రాణించాలనుకునేవారు... అన్ని శాఖల పట్ల అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా మధు చెప్పారు!! 


అహ్మదాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్.ఐ.డి)లో చదివి, తర్వాత 'పూనా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్' నుంచి సినిమాటోగ్రఫీలో డిప్లొమా చేసిన మధు మహంకాళి... అస్సామీలో అరంగేట్రం చేసి, అక్కడ పలు చిత్రాలకు ఛాయాగ్రహణం అందించి, అనంతరం తెలుగులో అనేక సినిమాలు, సీరియల్స్ కు సినిమాటోగ్రఫీ సమకూర్చారు. హిందీలోనూ పనిచేశారు. అంతేకాదు... స్వీయనిర్మాణంలో నరేష్-ఆమని జంటగా "పరంపర" చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికిగాను నరేష్ కి నంది లభించడం గమనార్హం. యాడ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్... అత్యంత సృజనాత్మకంగా తెరకెక్కించడంలోనూ మధు మహంకాళి సుప్రసిద్ధులు. బుల్లితెర ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన "ఋతురాగాలు, కస్తూరి" వంటి ధారావాహికలతో సుపరిచితురాలైన ప్రఖ్యాత నటి "రూపాదేవి" వీరి ధర్మపత్ని కావడం విశేషం!!


ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, నీలకంఠ.. ప్రముఖ నటులు నాజర్, రేవతి... ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధు అంబట్, ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి వంటి నిష్ణాతులు గెస్ట్ ఫ్యాకల్టీగా కలిగిన *"దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్"* విద్యాధికుడు, విజువల్ ఆర్ట్స్ లో ప్రతిభాశాలి "నందన్ బాబు" ప్రిన్సిపాల్ గా... ప్రఖ్యాత దర్శకులు - "అంకురం" ఫేమ్ సి.ఉమామహేశ్వరరావు చైర్మన్ గా, సీనియర్ సినిమాటోగ్రాఫర్ 'వరప్రసాద్', స్క్రిప్ట్ రైటర్ & డైరెక్టర్ 'రాము'ల నిర్దేశకత్వలో నిర్వహించబడుతోంది!! 


*దాదా సాహెబ్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్* లో చేరి... తమలో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను వెలికి తీసి, ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనే తపన కలిగినవారు *7780196227* నంబర్ లో నేరుగా సంప్రదించవచ్చు. పూర్తి వివరాల కోసం  www.dpsfs.edu.in వెబ్సైట్ సందర్శించవచ్చు!!Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !