కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా పలు సినిమాలకు పని చేసి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు ప్రభుదేవా. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం *మై డియర్ భూతం*. తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు అందుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ పై రమేష్ పి పిళ్ళై ఈ చిత్రాన్నినిర్మించగా తెలుగులో శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏ ఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఫాంటసీ సినిమాగా ప్రేక్షకులకు రాబోతున్న ఈ సినిమా లో ప్రభుదేవా జీనీ గా నటిస్తుండగా జీనీ పాత్రలోకి ప్రభుదేవా పూర్తిగా పరకాయ ప్రవేశం చేశాడు. ఆయన లుక్ ఎంతో పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. ఆయన ఈ మేకోవర్ కోసం ఎంత కష్టపడ్డాడో లుక్ ను బట్టి తెలుస్తుంది. రమ్య నంబీసన్ కీలక పాత్ర లో నటిస్తుండగా బిగ్ బాస్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు డి. ఇమాన్ సంగీతం సమకూరుస్తుండగా యూకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. వీఎఫ్ఎక్స్ ను భారీగా ఉపయోగించబోతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే విడుదల తేదీనీ ప్రకటించనున్నారు.
నటీనటులు :
ప్రభుదేవా, రమ్యా నంబీశన్, అశ్వత్, పరం గుహనేష్, సాత్విక్, శక్తీ, కేశిత, సంయుక్త,ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ తదితరులు.
సాంకేతిక నిపుణులు :
డైరెక్టర్: ఎన్. రాఘవన్ ప్రొడ్యూసర్ : రమేష్ పి పిళ్ళైబ్యానర్: అభిషేక్ ఫిలిమ్స్విడుదల : శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్మ్యూజిక్: డి ఇమ్మాన్సినిమాటోగ్రఫీ: యూకే సెంథిల్ కుమార్పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు