View

'ది వారియర్' సగం సక్సెస్ కొట్టేసింది - బోయపాటి

Saturday,July02nd,2022, 01:42 PM

ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా 'ది వారియర్'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రమిది. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. 


అనంతపురంలో శుక్రవారం భారీ సంఖ్యలో విచ్చేసిన అభిమానులు, ప్రేక్షకుల మధ్య జరిగిన కార్యక్రమంలో 'ది వారియర్' ట్రైలర్‌ను బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 


అనంతరం బ్లాక్‌బ‌స్ట‌ర్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ ''అనంతపురంలో ఫంక్షన్ అనగానే నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. అనంతపురంతో పాటు సీమ అంటే సొంత ఇల్లు అనే ఒక ఫీలింగ్. మీకు, నాకు ఉన్న అనుబంధం అలాంటిది. మీ అభిమానం అలాంటిది. బోయపాటి శ్రీను సినిమా చేశాడంటే... 'మా కుటుంబ సభ్యుడు ఒకరు డైరెక్షన్ చేశాడు' అని సీమ ప్రజలు అనుకుంటారు. మీరు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అందుకే, సీమ ప్రజలు అంటే నాకు అభిమానం. ఆ రోజుల్లో దైవ సమానులైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజుల్లో మన 'సింహ', 'లెజెండ్', 'అఖండ' నందమూరి బాలకృష్ణ గారి వరకూ... మీ దగ్గర ఉండటానికి, మీలో ఉండటానికి ప్రయత్నించారు. అదీ మీ అభిమానం. ఇక్కడ ఫంక్షన్‌తో... 'ది వారియర్' సగం సక్సెస్ కొట్టేసింది. ఇక, మిగిలింది థియేటర్లలో చూడటమే. మంచి షాపింగ్ కాంప్లెక్స్ లేదా ఏదైనా ఓపెనింగ్‌కు మంచి మనసున్న మనిషిని పిలిచి రిబ్బన్ కట్ చేయిస్తాం. ఎందుకు? మంచి జరుగుతుందని! అలాగే, మేమంతా ఇక్కడికి వచ్చి ఫంక్షన్ చేస్తున్నామంటే... మీరంతా అంత మంచి మనసున్న మనుషులు అని అర్థం. మీ ఆశీర్వాదం టీమ్ అందరికి ఉండాలి'' అని అన్నారు. 


ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ ''అనంతపురం... ఇక్కడ ఎక్కువ సినిమా ఫంక్షన్స్ జరగవని, అక్కడ పెడదామని చెప్పారు. 'ఆరు గంటల ప్రయాణం. ఫర్వాలేదా?' అంటే... 'పర్వాలేదు' అని చెప్పాను. ఆరు గంటల సంగతి చెప్పారు కానీ... స్టేడియం స్టార్టింగ్ నుంచి స్టేజి మీదకు రావడానికి గంట పడుతుందని ఎవరూ చెప్పలేదు. 'మీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది' అని అడుగుతుంటారు. 'ఇదిగో, ఇక్కడి నుంచి (అభిమానులను చూపిస్తూ) వస్తుంది. ఇక్కడికి వచ్చిన, మా  ట్రైలర్ విడుదల చేసిన బోయపాటి గారికి థాంక్స్. ఆయన చేతుల మీదుగా జరిగింది కాబట్టి సగం హిట్ అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో చాలా మందిని మీట్ అవుతాం. మంచి మనసున్న మనిషి లింగుస్వామి. సినిమాలో ప్రతి ఎమోషన్ ఆయన జెన్యూన్‌గా ఫీలై చేసింది. తెలుగులో చాలా కమర్షియల్ హిట్స్ అయిన సినిమాల్లో సీన్లు లింగుస్వామి సినిమాల్లో సీన్లు చూసి స్ఫూర్తి పొందినవి. నాకు ఆయా దర్శకులు వచ్చి చెప్పారు. మా సినిమా తమిళ్ ట్రైలర్ విడుదల చేసిన శివ కార్తికేయన్ గారికి థాంక్స్. 'ది వారియర్' జూలై 14న విడుదలవుతోంది. థియేటర్లలో కలుద్దాం'' అని అన్నారు.  


చిత్ర దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ ''ఇక్కడ ప్రేక్షకుల ఎనర్జీ చూసిన తర్వాత ఇక్కడే ఉండిపోవాలని అనిపించింది. రజనీకాంత్ గారి సినిమాను చూడటానికి చిన్నతనంలో థియేటర్లకు వెళ్ళినప్పుడు జనాలను చూశా. మళ్ళీ ఆ స్థాయిలో జనాలు రావడం ఇక్కడ చూశా. సినిమా గురించి చెప్పాలంటే... స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కుదిరింది. మీ అందరిలో ఉన్న టోటల్ ఎనర్జీ ఒక్కరిలో... రామ్ లో ఉంది. ట్రైలర్ లో చూసి ఉంటారు. నేను ఏం అడిగినా ఇచ్చినా శ్రీనివాసా చిట్టూరి గారికి, పవన్ గారికి థాంక్స్. నెక్స్ట్ మూవీ కూడా వాళ్ళకు చేస్తాను. 'వారియర్ 2' కూడా చేస్తాను. దేవి శ్రీ ప్రసాద్, ఆది పినిశెట్టి, కృతి శెట్టి, ఇంకా టెక్నికల్ మెంబర్స్... బెస్ట్ టీమ్ కుదిరింది. మా ట్రైలర్ విడుదల చేసిన బోయపాటి శ్రీను గారికి థాంక్స్. ఆయన మాస్ నాకు ఇన్స్పిరేషన్'' అని అన్నారు.     


ఆది పినిశెట్టి మాట్లాడుతూ ''మా ట్రైలర్ విడుదల చేయడానికి వచ్చిన బోయపాటి శ్రీను గారికి, మా సినిమా టీమ్‌కు గుడ్ ఈవెనింగ్. ఇక్కడి ప్రేక్షకుల ఎనర్జీ అద్భుతం. తట్టుకోలేకపోతున్నాం. మా దర్శకుడు లింగుస్వామి గారు చాలా ఎనర్జిటిక్. సినిమా షూటింగ్‌లో ఎంత టెన్షన్ అయినా కూల్ అండ్ ఎనర్జీతో చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ స్టార్ట్ చేసి పంపించిన బుల్లెట్ ప్రపంచం అంతా తిరుగుతోంది. టీమ్ అందరిలో సేమ్ ఎనర్జీ. కృతి శెట్టి ఎనర్జీ బుల్లెట్ సాంగ్‌లో చూశారు కదా! అయితే, కెమెరా లేనప్పుడు ఆవిడ ఏం తెలియనట్టు నవ్వుతూ ఉంటారు. వీళ్ళందరి ఎనర్జీ ఒక మనిషిలో ఇన్వెస్ట్ చేశారు. రామ్ చాలా చాలా ఎనర్జిటిక్ హీరో. అతనితో పని చేయడం గొప్ప అనుభవం. ఈ సినిమాతో నాకు మంచి ఫ్రెండ్ దొరికాడు. సినిమాలో మాత్రమే విలన్ అండ్ హీరో. బయట మేం మంచి ఫ్రెండ్స్'' అని అన్నారు.   


హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ ''మాపై ఇంత అభిమానం చూపిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. ట్రైలర్ మాసీగా ఉంది కదా! నాకూ అలాగే అనిపించింది. ఒక ట్రైలర్ విడుదల చేయడానికి ఒక మాస్ డైరెక్టర్ వచ్చారు. బోయపాటి శ్రీను గారికి థాంక్స్. ఆయన బ్లెస్సింగ్స్ మాతో ఉండాలని కోరుకుంటున్నాను. ఎనర్జిటిక్ టీమ్ ఈ సినిమాకు పని చేశారు. మా నిర్మాతలు శ్రీనివాసా చిట్టూరి గారికి, పవన్ గారికి పెద్ద సక్సెస్ రావాలి'' అని అన్నారు.


చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, ఇతర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతున్నాయి.  


రామ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళ: డి.వై. సత్యనారాయణ, యాక్షన్: విజయ్ మాస్టర్ & అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా - లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్, స‌మ‌ర్ప‌ణ: ప‌వ‌న్ కుమార్‌, నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శ‌క‌త్వం: ఎన్‌. లింగుస్వామిAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !