View

గ్రాండ్ గా విడుదలైన 'మై డియర్ భూతం' ట్రైలర్ 

Sunday,July10th,2022, 02:26 PM

టాప్ కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రభుదేవా ప్రేక్షకులపై ముద్ర వేశారు. ప్రస్తుతం ప్రభుదేవా మరో ప్రయోగాత్మక చిత్రంలో నటించారు. ' *మై డియర్ భూతం* ' అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు ప్రభుదేవా రెడీ అయ్యారు. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా జూలై 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మిస్తున్నారు.

తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం హైద్రాబాద్‌లో ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.


ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం రైటర్ నందు తుర్లపాటి మాట్లాడుతూ .. ‘రమేష్ అన్న, బాలాజీ అన్న, మా మాస్టార్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒక వేళ మీరు ఈ సినిమాను చూడకపోతే ఓ నోస్టాల్జిక్ మూమెంట్‌ను మిస్ అవుతారు. తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూడండి’ అని అన్నారు.


పాటల రచయిత చల్లా భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ... ‘ఈ సినిమాకు పాటలు రాసే టైంలో నేను యశోద డైలాగ్స్ రాయడంలో బిజీగా ఉన్నాను. ఆ సమయంలో నందు అన్న ఫోన్ చేసి ‘మై డియర్ భూతం’ గురించి చెప్పారు. ఎప్పుడూ ఇలానే అంటావ్.. బ్రేక్ వచ్చేది చెప్పమని అన్నాను. దీంతో బ్రేక్ వస్తుందని ఆయన అన్నారు. ప్రభుదేవా గారికి పాట రాయడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఇమ్మాన్ గారి పాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా మాస్టార్ గారు అద్భుతంగా స్టెప్పులు వేశారు. ఇప్పుడు అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలను కోరుకుంటున్నారు. అందరినీ థియేటర్లోకి ఆహ్వానించే సినిమా అవుతుందని అన్నారు.


ఏఎన్ బాలాజీ మాట్లాడుతూ.. ‘రమేష్ పిళ్లై గారు చేస్తోన్న సినిమాలన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఆయన దాదాపు పది చిత్రాలు చేస్తున్నారు. అవన్నీ కూడా నేనే చేస్తానని అనుకుంటున్నాను. ప్రభుదేవా గారి సినిమాను నేను చేస్తాను అని అనుకోలేదు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా హీరోయిన్ బాగా చేసింది. మా టీం అందరికీ థ్యాంక్స్ అన్నారు.


డైరెక్టర్ ఎన్. రాఘవన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలుగు అంతగా రాదు. తప్పులు మాట్లాడితే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రమేష్ పిళ్లై గారికి థ్యాంక్స్. ఆయనకు వేరే కథ చెప్పడానికి వెళ్లాను. కానీ ఆయన మాత్రం భూతం కథ ఉంది కదా? అది చెప్పమని అడిగారు. నేను ఈ స్క్రిప్ట్‌ను ప్రభుదేవా మాస్టర్‌ని దృష్టిలో పెట్టుకునే రాశాను. కానీ ఈ విషయాన్ని నిర్మాతకు చెప్పలేదు. ఆయనే స్క్రిప్ట్ అంతా చదివి ఈ కథకు ప్రభుదేవా అయితే బాగుంటుందని అన్నారు. నిజంగా ఈ స్క్రిప్ట్‌ని ఆయన్ను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నాను అని చెప్పాను. వెంటనే ప్రభుదేవా గారితో మాట్లాడారు. సినిమా మొదలైంది. ఇప్పుడు మీ ముందుకు వస్తోంది. ఈ సినిమా కోసం ప్రభుదేవా గారు 45 రోజులు కష్టపడ్డారు. ఆ కష్టం మీకు తెరపై కనిపిస్తుంది’ అని అన్నారు.


రమ్యా నంబీశన్ మాట్లాడుతూ.. ‘మా సినిమా మై డియర్ భూతం జూలై 15న రాబోతోంది. మేం ఎంత కష్టపడ్డామో మీకు తెలుస్తుంది. నాకు తెలుగు తెలియదు. నన్ను క్షమించండి. నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు థ్యాంక్స్. నాకు ప్రభుదేవా గారితో ఇది మూడో సినిమా. ఇంత మంచి టీంతో కలిసి పని చేసినందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.


నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘రమేష్ పిళ్లై ఎంతో సక్సెస్‌ఫుల్ నిర్మాత. ఆయన కంపెనీలో చేసిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. తను మా బాలాజీకి ఈ సినిమాను ఇవ్వడం ఆనందంగా ఉంది. నా చెల్లి భాగ్యలక్ష్మీ పాటలు రాసినందుకు సంతోషంగా ఉంది. విక్రమ్, మేజర్ తరువాత ఇండస్ట్రీ స్ట్రగుల్‌లో ఉంది. థియేటర్లకు జనాలు రావడం లేదు. చాలా మంచి సినిమాలు వచ్చినా కూడా జనాలు రావడం లేదు. ఈ ట్రైలర్, సాంగ్స్ చూసిన తరువాత ఒకప్పుడు ప్రేమికుడు అనే సినిమాతో ప్రభుదేవా యూత్‌ని థియేటర్లకు ఎలా లాక్కొచ్చాడో.. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పిస్తాడనే నమ్మకం నాకుంది. రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం టీం అంతా కూడా చాలా కష్టపడింది. ప్రభుదేవాతో రాఘవన్ ఎలాంటి సినిమాలు చేయాలని అనుకున్నాడో.. అలాంటిదే చేశారు. అల్లావుద్దీన్ దీపం సినిమాతో పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో. మళ్లీ ఇప్పుడు అలా ఎంజాయ్ చేస్తారు. సినిమాలను ఓటీటీలో చూడొచ్చని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాను థియేటర్‌లోనే చూడాలని అనుకుంటారు. పైరసీ, ఓటీటీలను ఎంకరేజ్ చేయకండి. జనాల మధ్యలో ఈ సినిమాను చూస్తే ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.


ప్రభుదేవా మాట్లాడుతూ... ‘భాగ్యలక్ష్మీ గారు పాటలు బాగా రాశారు. ఇది నాకు హోం గ్రౌండ్. నన్ను తెలుగు చిత్రపరిశ్రమే పైకి తీసుకొచ్చింది. టీం అంతా చాలా కష్టపడింది. మంచి సినిమా చేశాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మీ అందరికీ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. అనంతరం అభిమానుల కోరిక మేరకు ప్రభుదేవా స్టేజ్ మీదే స్టెప్పులు వేసి అందరినీ అలరించారు.


నటీనటులు : ప్రభుదేవా, రమ్యా నంబీశన్, అశ్వత్, పరం గుహనేష్, సాత్విక్, శక్తీ, కేశిత, సంయుక్త,ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ తదితరులు.


సాంకేతిక నిపుణులు :డైరెక్టర్: ఎన్. రాఘవన్  ప్రొడ్యూసర్ : రమేష్ పి పిళ్ళైబ్యానర్: అభిషేక్ ఫిలిమ్స్విడుదల : శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్మ్యూజిక్: డి ఇమ్మాన్సినిమాటోగ్రఫీ: యూకే సెంథిల్ కుమార్పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు


Prabhudeva, N Ragavan’s My Dear Bootham Theatrical Trailer Unveiled


Hero Prabhudeva’s wholesome family entertainer My Dear Bootham directed by critically acclaimed director N Ragavan is all set for theatrical release in all south Indian languages on July 15th. Meanwhile, as part of promotions, the makers released theatrical trailer of the movie.


The trailer begins with Prabhudeva introduced as the Bootham aka Genie who develops good rapport with the kid played by Aswanth. He actually arrives to help the kid. Both the kid and the Genie have fun time together. The video has some hilarious moments and kids will have fun to see the bond between Genie and Aswanth. It makes good impression and hikes expectations on the movie.


The background score by D Imman elevates the fun quotient. Director N Ragavan wins brownie points for providing enough entertainment. Produced by popular producer Ramesh P Pillai of Abhishek Films, production design looks top-notch.


Earlier, first look and a song featuring Prabhudeava and kids too garnered superb response from all the corners.


My Dear Bootham is an out-and-out kids’ fantasy movie that is high on VFX. Families too will love the movie. Ramya Nambeesan plays the kid’s mother. Param Guhanesh, Saathvik, Sakthi and Kaesitha are the other main child artists in the movie.


Bigg Boss Tamil fame Samyuktha, Imman Annaachi, Aliya, Suresh Menon and Lollu Sabha Swaminathan are the other prominent cast.


The film has cinematography by UK Senthil Kumar. AN Balaji of Sri Lakshmi Jyothi Creations will be releasing the movie in Telugu. Zee network acquired the digital rights of the movie.


Cast: Prabhudeva, Ramya Nambeesan, Aswanth, Aliya, Param Guhanesh, Saathvik, Sakthi, Kaesitha, Suresh Menon, Lollu Sabha Swaminathan and others.


Technical Crew:Director: N RagavanProducer: Ramesh P PillaiBanner: Abhishek FilmsRelease Through: Sri Lakshmi Jyothi Creations (AN Balaji)Music: D ImmanCinematography: UK Senthil KumarPRO: Sai Satish, Parvataneni RambabuAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !