View

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రెస్ నోట్

Thursday,August04th,2022, 01:22 PM

C.కళ్యాణ్ గారు : తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ కళ్యాణ్ గారు పాత్రికేయ మిత్రులకు నమస్కారం చెబుతూ తెలుగు ఫిలిం ఛాంబర్ తరుపున మరియు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరుపున అందరి నిర్మాతల సహకారంతో సినిమా షూటింగులను నిర్విరామంగా జరుపుతూ ముందుకు వెళ్ళుతున్నాము. ఇందులో బంద్ లు, స్ట్రైక్ లు లేవు. మన నిర్మాతలందరికి ఒక విన్నపము. ఇది ఒక మహాయజ్ఞం లాగా ప్రారంభించారు. బయట అందరు ఏమేమో చెబుతుంటారు అవి ఏమి పట్టించుకోవద్దు. అందరము కలిసి కట్టుగా ఉందాము. పాత్రికేయ మిత్రులకు ఓక విన్నపము. మీరు గిల్డ్ అనో, ఇంకొకటి అనో రాయకండి, తెలుగు ఫిలిం ఛాంబర్ అని రాయండి. అది మా పేరెంట్ బాడీ. ఈ పేరెంట్ బాడీలోనే అన్ని జరుగుతున్నాయి, దిల్ రాజు గారు వారి పూర్తి సమయం వెచ్చించి పని చేస్తున్నారు. అయన ఓవర్ లాప్ చేసి చేస్తున్నారని అనుకుంటున్నారు అలాంటిది ఏమి లేదు. ఛాంబర్ జనరల్ సెక్రటరీ, కౌన్సిల్ జనరల్ సెక్రటరీ పనులు డివైడ్ చేసుకొని ముందుకు వెళ్ళుతున్నాము, తెలంగాణ ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి గారు హోమ్ డిపార్టుమెంటు లో మీటింగ్ ఉండడం వల్ల రాలేక పోయారు. పాత్రికేయ మిత్రులకు ప్రతిరోజూ ఫిలిం ఛాంబర్ ద్వారా ఒక నోట్ ను మీకు పంపుతాము దాన్ని మీరు సోషల్ మీడియాలో గాని, ప్రింట్ మీడియాలో గాని వెయ్యండి. మీ మీడియా  సహకారంతో మేము పనులు త్యరగా చేస్తాము అని తెలియజేస్తున్నాము. కాబట్టి మీడియా  పూర్తి సహకారం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కు కావాలని  తెలియజేసారు.


నిర్మాత దిల్ రాజు గారు మాట్లాడుతూ : కళ్యాణ్ గారు చెప్పినట్లు ఆగస్టు 1st నుండి మా షూటింగులు ఆపుకుంటున్నాము, మేము ఒక నాలుగు టీమ్ లుగా చేసుకొని ముందుకెళ్ళుతున్నాము, ఒకటి OTT .. ఇది ఎన్ని వారాల్లో సినిమా ను OTT కు ఇవ్వాలన్న దానిపై కమిటీ వేసుకున్నాము, ఆ కమిటీ OTT కు సంబందించిన విషయంపై పని చేస్తుంది. అలాగే VPF చార్జెస్ చిన్న సినిమాకు, పెద్ద సినిమాకు ఎలా ఉండాలి అనేదానిమీద ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ Exhibitors వారితో మాట్లాడుతుంది.  మూడో పాయింట్ ఫెడీరేషన్ వర్కర్స్ wages పెంపు అనే విషయంపై నేనే ఈ కమిటీకి చైర్మన్ గా ఉంటూ దీనికి సంబందించిన సమస్యలను చర్చించుకుంటున్నాము.. అలాగే నిర్మాతల ఉదయం షూటింగ్ మొదలుకొని రాత్రి వరకు జరుగుతున్న దాంట్లో Wastage ఏమున్నదో తెలుసుకోవడానికి కమిటీ వేశాము. తెలుగు ఫిలిం ఛాంబర్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మరియు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇవన్నీ మెయిన్ బాడీస్. మేము కొంతమంది గిల్డ్ అనే సంస్థను పెట్టుకున్నాము, అందులో నిర్మాతల సమస్యలను మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏది ఏమైన ఫైనల్ గా తెలుగు ఫిలిం ఛాంబర్ కు వచ్చి సమస్యలను పరిష్కరించుకుంటాము. షూటింగులు ఆపితే నిర్మాతలకు నష్టం కాబట్టి సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటున్నాము. చాలా మంది నా పేర్లు వాడుతున్నారు నాకేం ఇబ్బంది లేదు. ఇక్కడ దిల్ రాజు కు పర్సనల్ ఎజెండా లేదు. నేను మన అందరి సినిమాల కోసం మీరందరు ఇచ్చే సపోర్ట్ తో అందరితో డిస్కస్ చేసుకొని పని చేస్తున్నాను. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, సినిమా వ్యవస్థ ముఖ్యం, అంతేగాని ఇవాళ మేము ఇక్కడ ఉంటాము, రేపు వెళ్ళిపోతాము, మేము అందరు సినిమా కోసమే పని చేస్తున్నాము. Result కూడ త్వరలో చెబుతాము అని చెప్పారు. 


తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి శ్రీ K.L.దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ : covid Pandamic తరువాత సినిమా పరిశ్రమ Working Condition లో చాలా మార్పులు వచ్చాయి, దానివల్ల ప్రొడ్యూసర్స్ కు ఎక్కువ నష్టం వచ్చింది. కాబట్టి తెలుగు ఫిలిం ఛాంబర్ తరుపున ప్రొడ్యూసర్స్ కు Full Support చేస్తున్నాము. కానీ మీడియాలో మాత్రం చాలా వేరియేషన్ గా రాస్తున్నారు, కాబట్టి ఛాంబర్ తరుపున ఏదైతే బుల్లెటిన్ ఇస్తామో అదే రాయండి .  


తెలుగు చలన చిత్ర మండలి కార్యదర్శి శ్రీ. టి. ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ :  ఇవాళ ప్రేక్షకుడు థియేటర్ కు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో పరిశ్రమను ఓక్ తాటిపై ఇండస్ట్రీ ను కాపాడవలెను అనే ఉద్దేశ్యం తో OTT కు సినిమా ఎప్పుడు ఇవ్వాలి.. సామాన్యుడు థియేటర్ కు రప్పించడానికి టికెట్ రేట్స్ ను Reasonable తగ్గించలనే విషయాలపై కృషి చేస్తున్నాము. ఆ తరువాత  Workers Wages విషయమై Federation తోను,Cost of Production  విషయమై Directors మీటింగుల్లోనూ, ఆర్టిస్టుల సహకారం కొరకు MAA అసోసియేషన్ తోను, సంప్రదింపులు. గతంలో ఎన్టీరామారావు గారు, అక్కినేని నాగేశ్వర్ రావు గారు లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే రోజుల్లోనే 10 వేల రూపాయలు తీసుకొని తెలుగు చలన చిత్ర పరిశ్రమను కాపాడారు. రెండోది Digital Charges నిర్మాతలకు చాలా భారంగా ఉంది.ఈ సమస్య నుండి బయటపడాలి, Percentage System లో చిన్న సినిమాకు, ఒక Percentage అని, పెద్ద సినిమాకు ఒక Percentage అని Exhibitors అడుగుతున్నారు.   ఈ సమ్యసలన్నీ చర్చించడం కోసం సినిమాల షూటింగ్ లు postpone చేయడం జరిగింది, దీన్ని మీరు స్ట్రైక్ అనొద్దు, బంద్ అనొద్దు, ఇండస్ట్రీ కు పూర్వ వైభోవం తీసుకొని రావడానికి మేము అందరం పని చేస్తున్నాము, దయచేసి మీడియా వారికీ ఒక చిన్న విన్నపం గిల్డ్ మీటింగ్ అని రాయకండి, కేవలం తెలుగు ఫిలిం ఛాంబర్ మాత్రమే పేరెంట్ బాడీ, కాబట్టి మీటింగులు అన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కాబట్టి ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కలిసికట్టుగా పని చేస్తూ.. ఎవ్వరిని ఇబ్బంది పెట్టడము, నష్టపరచడము మా ఉద్దేశ్యము కాదు. కరోనా లాంటి కష్ట కాలంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ని ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి శతధా ధన్యవాదాలు, వాళ్ళు ఆదరన మూలంగా ప్రపంచంలోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గొప్పగా ఉందని చెప్పుకొనుచున్నాము, అలాంటి ప్రేక్షకులకు పాదాభివందనం చేస్తున్నాము. అలాంటి ప్రేక్షకులకు టికెట్ రేట్స్ భారంగా ఉండకూడదని టికెట్ రేట్స్ తగ్గిస్తున్నాము, ఈ సమావేశము తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, MAA అసోసియేషన్, మరియు డైరెక్టర్స్ అసోసియేషన్ మరియు ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్ లతోను సంప్రదింపులు జరుగుతున్నాయని తెలియజేశారు.


తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి శ్రీ. మోహన్ వడ్లపట్ల గారు మాట్లాడుతూ : ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనేది ప్రొడ్యూసర్స్ కు సంబందించిన సంస్థ మేము తెలుగు ఫిలిం ఛాంబర్ తోను, తెలంగాణ ఫిలిం ఛాంబర్ తోను,డైరెక్టర్స్ అసోసియేషన్ తోను మరియు MAA అసోసియేషన్ తోను, Federation తోను, సమన్వయంతో పనిచేస్తాము, దిల్ రాజు గారు అన్నట్లు మేమందరము తెలుగు ఫిలిం ఛాంబర్ తోనే వెళ్ళతామని పత్రిక ముఖంగా, మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు, ఇప్పుడే చెప్పాము. మేము గిల్డ్ లో మాట్లాడుకున్న ఫైనల్ decision కొరకు తెలుగు ఫిలిం ఛాంబర్, మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ద్వారానే వెళ్ళి discuss చేసుకొని decision తీసుకుంటామని దిల్ రాజు గారు చెప్పారు, ఇది చాలా సంతోషించదగ్గ విషయం, దిల్ రాజు గారు చాలా కష్టపడుతున్నారు, work చేస్తున్నారు, అలాగే మా ప్రసన్న గారు, ఎల్లప్పుడూ కష్టపడుతున్నారు, అలాగే కళ్యాణ్ గారు, దాము గారు, అలాగే కొత్తగా ఎన్నికైన ఛాంబర్ ప్రెసిడెంట్ శ్రీ  బసిరెడ్డి గారు Continues గా మీటింగ్ లలో పాల్గొనుచున్నారు. ఇండస్ట్రీలో ఉన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు, అంటే VPF ఛార్జెస్ విషయంలో గానీ, టికెట్ రేట్ విషయంలో గానీ, ఆర్టిస్ట్ ల రెమ్యూనరేషన్ విషయంలో గానీ, Cost of Production విషయంలో గానీ, చర్చించుటకు Sub -Committee వేయడం జరిగింది. ఈ  Sub -Committee లో విషయాలపై కూలంకుశంగా చర్చించి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుంటున్నారు.దిల్ రాజు గారు చెప్పినట్లుగా షూటింగ్ లు బంద్ అనేది లేదు, కానీ మేమందరము చిన్న, పెద్ద అనే నిర్మాతల బేధం లేకుండా షూటింగ్ లు స్వతహాగా ఆపుకోవడం జరిగింది. కొంత మంది వ్యక్తులు ఫోన్ చేసి షూటింగ్ లు బంద్ అని అడగడం జరిగింది. షూటింగ్ లు బంద్ అని ఎవ్వరు ఎప్పుడు అనలేదు. ఈ విషయం పై ఇది Clarity. కాబట్టి బంద్ అనే ప్రస్థానం లేకుండా కొద్దీ రోజులు షూటింగ్ లు ఆపుకొని ఛాంబర్ ద్వారా, కౌన్సిల్ ద్వారా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని మీకు తెలియజేయడం జరుగుతుంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !