View

ఆగస్ట్ 12న  థియేటర్స్ కి వస్తున్న '1948 - అఖండ భారత్' 

Friday,August05th,2022, 02:43 PM

ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై బహుముఖ ప్రతిభాశాలి ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎం.వై.మహర్షి నిర్మించిన చిత్రం '1948-అఖండ భారత్'. అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో గాంధీగా రఘనందన్, నాథురాం గోడ్సే గా డా. ఆర్యవర్ధన్ రాజ్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ ప్రధాన పాత్రలు పోషించగా సుమారు 92 ముఖ్య పాత్రలతో అత్యంత భారీగా నిర్మాణం పూర్తి చేసుకుంది.


ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత ఎమ్.వై.మహర్షి, దర్శకుడు ఈశ్వర్ డి.బాబు, రచయిత మరియు గాడ్సే పాత్రధారి డా. ఆర్యవర్ధన్ రాజు, సంగీత దర్శకుడు ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ రాజు జాదవ్, నటుడు సుహాస్ పాల్గొన్నారు. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి... బాలకృష్ణ నటించగా అద్భుత విజయం సాధించిన "అఖండ" తరహాలో విజయం సాధించే చిత్రంగా "1948 - అఖండ భారత్" చిత్రాన్ని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే... తలకిందులు తపస్సు చేసినా... ఈ చిత్రం సెన్సార్ అయ్యేది కాదని పేర్కొన్నారు. తెలుగువారంతా గర్వపడేలా ఈ చిత్రాన్ని రూపొందించారని మెచ్చుకున్నారు.


డాక్టర్ ఆర్యవర్థన్ రాజు మాట్లాడుతూ... "గాంధీజీని ఎవరు చంపారన్నది అందరికి తెలుసు. కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. దానిక్కారణం... గాడ్సే తన కోర్టు వాదనలో గాంధీజీని వధించడానికి గల కారణాలను సుమారు 150 పాయింట్స్ గా.. 8 గంటలపాటు సుదీర్ఘంగా వివరించినా... అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కోర్ట్ నుంచి బైటికి రానివ్వకుండా నిషేధించింది. గాడ్సేని ఉరి తీసిన సుమారు 30 సంవత్సరాల తర్వాత... ఆయన కోర్ట్ లో ఇచ్చిన వాగ్మూలం బయటకు వచ్చినా- దాన్ని కూడా ప్రచురణ కాకుండా అడ్డుకున్నారు. అలా 70 సంవత్సరాల పాటు దాచి పెట్టబడిన నిజాలను... ప్రామాణికంగా పరిశోధన చేసి ఈ సినిమాకి స్క్రిప్ట్ ని సిద్ధం చేశాం... మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి... హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని, వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాం' అన్నారు.


చిత్ర దర్శకుడు ఈశ్వర్ డి.బాబు మాట్లాడుతూ...11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి... 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 700కి పైగా ప్రొపర్టీస్, 500కి పైగా కాస్ట్యూమ్స్,  500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో, 9 షెడ్యూల్స్ లో... ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం" అన్నారు.


ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా ఉందని... దర్శకుడు ఈశ్వర్, ఆర్యవర్ధన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశారని, హైదరాబాద్ లో ఉన్న సెన్సార్ బోర్డ్... ఈ సినిమా సెన్సార్ చేయడానికి నిరాకరిస్తే... ముంబైలో చేయించామని నిర్మాత ఎమ్.వై. మహర్షి పేర్కొన్నారు. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని తెలిపారు.


"1948 - అఖండ భారత్" వంటి ప్రతిష్టాత్మక చిత్రానికి పనిచేసే అవకాశం రావడం పట్ల సంగీత దర్శకుడు ప్రజ్వల క్రిష్, ఎడిటర్ రాజు జాదవ్, నటుడు సుహాస్ సంతోషం వ్యక్తం చేశారు.


ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే -మాటలు - రీసెర్చ్: డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్, సంగీతం: ప్రజ్వల్ క్రిష్, ఎడిటింగ్: రాజు జాదవ్, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మేకప్: హరి పోగుల, కెమెరా: చంద్రశేఖర్ (చెన్నై), నిర్మాత: ఎమ్.వై.మహర్షి, దర్శకత్వం: ఈశ్వర్ డి.బాబు!!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !