View

'జెట్టి' విడుదలకు సిద్ధం - ఈ నెల 28న రిలీజ్

Tuesday,October04th,2022, 02:32 PM

నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "జెట్టి". తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.  వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వం వహిస్తున్నారు. చివరి దశ సన్నాహాల్లో ఉన్న ఈ సినిమా ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా...


హీరోయిన్ నందిత శ్వేతా మాట్లాడుతూ... విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరి అమ్మాయిగా నటించాలి అనేది నా కోరిక. అది ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమా గురించి చెబితే అర్థం కాదు. తెరపై చూసి అనుభూతి చెందాల్సిందే. చీరాల ప్రాంతాన్ని మా చిత్రంలో సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత వేణు గారు సినిమా ప్రారంభం నుంచీ చివరి దాకా ఒకటే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. జెట్టితో మంచి విజయం సాధిస్తామనే నమ్మకం మా అందరిలో ఉంది. అని చెప్పింది.


దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక మాట్లాడుతూ... ఈ సినిమా రూపొందించే అవకాశం ఇచ్చిన నిర్మాత వేణు మాధవ్ కె గారికి థాంక్స్. సినిమా మేకింగ్ లో ఎక్కడా ఆయన కాంప్రమైజ్ కాలేదు. అలాగే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా ది బెస్ట్ వర్క్ చేయిస్తున్నారు. ఖర్చు గురించి ఆలోచించకుండా సినిమాను నిర్మించారు. మత్స్యకారుల జీవితాల్లోని సమస్యలను చెప్పే చిత్రమిది. కొందరు తమ స్వార్థంతో  పోర్టుల పేరుతో వారి మత్య్సకారుల జీవితాలను ఎలా ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఇట్రెస్టింగ్ గా తెరకెక్కించాం. హీరో హీరోయిన్లతో పాటు పలువురు మైమ్ గోపీ వంటి స్టేజీ ఆర్టిస్టులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. అన్నారు.


నిర్మాత  వేణు మాధవ్ కె మాట్లాడుతూ... జెట్టి అంటే పోర్టు అని అర్థం. మన సముద్ర తీరాన ఎంతోమంది మత్స్యకారులు జీవితాలను సాగిస్తున్నారు. వీళ్లు నివసించే ప్రాంతాల్లో పోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ల జీవనోపాధిని కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు దెబ్బతీస్తున్నారు. కష్టపడితే గానీ రోజు గడవని పరిస్థితి వారిది. అలాంటి మత్స్యకారుల జీవితాల్లోని సమస్యలను ప్రతిబింబించే చిత్రమిది. సగటు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. కార్తీక్ కొడకండ్ల సంగీతం ఆకర్షణ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉంది సినిమా. ఈ నెల 28న మూవీని విడుదల చేయబోతున్నాం. మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను, ఇప్పటివరకూ వెండితెరమీద కనిపించని జీవితాలను తెరమీద హృద్యంగా దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక తీసుకురాబోతున్నాడు. అన్నారు.


హీరో మన్యం కృష్ణ మాట్లాడుతూ...ప్రేక్షకులకు జెట్టీ సినిమా ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. ఈ సిినిమా ఇంత బాగా వచ్చిందంటే కారణం నిర్మాత వేణు, దర్శకుడు సుబ్రహ్మణ్యం గారు కారణం. ఈ చిత్రంలో ఒక మంచి పాత్రతో మీ ముందుకొస్తున్నాను. మిమ్మల్ని సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ నెల 28న థియేటర్లలో చూడండి. అన్నారు.


సంగీత దర్శకుడు కార్తీక్ కొడకండ్ల మాట్లాడుతూ...ఈ చిత్రంలో మంచి మ్యూజిక్ ఇచ్చే అవకాశం దొరికింది. ఈ పాటకు ఫలానా సింగర్ కావాలి అనుకుంటే కాంప్రమైజ్ కాకుండా నిర్మాత ఇచ్చారు. అలా సిధ్ శ్రీరామ్, సునీత వంటి సింగర్స్ తో పాటలు పాడించాం. హృద్యమైన కథా కథనాలతో పాటు మ్యూజికల్ గా సినిమా ఆకట్టుకునేలా ఉంటుంది. అన్నారు.


సాంకేతిక బృందం
బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్
మ్యూజిక్ :  కార్తిక్ కొడకండ్ల‌
డిఓపి:  వీర‌మ‌ణి
ఆర్ట్ ః ఉపేంద్ర రెడ్డి
ఎడిటర్:  శ్రీనివాస్ తోట‌
స్టంట్స్: దేవరాజ్ నునె
కోరియోగ్రాఫర్ : అనీష్
పబ్లిసిటీ డిజైనర్:  సుధీర్
డైలాగ్స్ ః శ‌శిధ‌ర్
పిఆర్ ఓ : జియస్ కె మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః పండ్రాజు శంక‌ర్రావు
నిర్మాత ః వేణు మాధ‌వ్
క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ ః సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక


నటీ నటులు: నందిత శ్వేత‌, కృష్ణ , క‌న్న‌డ కిషోర్, మైమ్ గోపి,  ఎమ్ య‌స్ చౌద‌రి, శివాజీరాజా, జీవా, సుమ‌న్ షెట్టి తదితరులు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !