View

లాఠీ కి బ్రిలియంట్ స్కోర్ చేసారు - హీరో విశాల్  

Monday,November14th,2022, 02:46 PM

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లాఠీ’. రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కిస్తున్నారు. విశాల్ సరసన సునయన హీరోయిన్‌ గా నటిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ పాన్ ఇండియా మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని టీజర్ ని లాంచ్ చేశారు. హీరో కార్తికేయ, శివబాలాజీ, మధుమిత, అభినయ తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు.  విశాల్ ఈవెంట్ లో పోలీస్ డ్రెస్ వేసుకొని బైక్ పై వేదిక వద్దకు రావడం ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ లో పలువురు పోలీసు అధికారులు కూడా హాజరయ్యారు.


హీరో విశాల్ మాట్లాడుతూ.. విజయేంద్రప్రసాద్ గారిని ఎప్పటి నుండో కలవాలని నా కోరిక. ఆయన ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. డిసెంబర్ 22న లాఠీప్రేక్షకుల ముందుకు వస్తోంది. దర్శకుడు  ఏ వినోద్ కుమార్ గురించి సినిమా విడుదలైన తర్వాత సిల్వర్ స్క్రీన్ నే చెబుతుంది. సినిమా నిర్మాతలు రమణ, నంద నా స్నేహితులు. చాలా ప్యాషన్ తోఈ సినిమా చేశాం. యువన్ శంకర్ రాజా నాకు చాలా బ్లాక్ బస్టర్స్ ఆల్బమ్స్ ఇచ్చారు. లాఠీ కి బ్రిలియంట్ స్కోర్ చేసారు. డాక్టర్ పవన్ సినిమానితెలుగులో పంపిణీ చేస్తున్నారు. బాలసుబ్రమణ్యన్, పీటర్ హెయిన్ అమేజింగ్ వర్క్ ఇచ్చారు. హీరోయిన్ సునయన తో పాటు ఈ సినిమాలోపని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. నా ప్రతి సినిమాలానే.. ఈ సినిమాని కూడా ఎంత మంది చూస్తారో ఒకొక్క టికెట్ కి ఒక్కో రూపాయి చొప్పున రైతులకు ఇస్తాను. ఈ ఈవెంట్ విచ్చేసి మాకు బెస్ట్ విశేష్ అందించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు' తెలిపారు. 

 

రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. విశాల్ గారి గురించి అందరూ గొప్పగా చెప్పారు. నేను ఒక చెడ్డ మాట చెబుతాను(నవ్వుతూ). విశాల్ గారికి ఒక జబ్బు అంటుకుంది. సినిమా కథ ఎంత బడ్జెట్ అయినా ఎన్ని రోజులైనా  షూటింగ్ చేయాలనే జబ్బు. ఈ జబ్బు మా అబ్బాయి రాజమౌళి దగ్గర నుండి అంటుకుంది(నవ్వుతూ) మా అబ్బాయి ఎలా అయితే సక్సెస్ అందుకున్నాడో మంచి మనసున్న విశాల్ కూడా విజయాన్ని అందుకుంటారని కోరుకుంటున్నాను. కార్తికేయ 2 ఈవెంట్ కి వెళ్లాను. అక్కడ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. పెద్ద హిట్ అవుతుందని కోరుకున్నాను. దేవుని దయవల్ల పెద్ద విజయం సాధించింది. ‘లాఠీ’ కూడా అద్భుతమైన విజయం అందుకుంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. 'అందరూ సినిమా చూసి పెద్ద హిట్ చేయండి'' అని కోరుకున్నారు. 

 

హీరో కార్తికేయ మాట్లాడుతూ.. విశాల్ గారి సినిమాలు పదిహేనేళ్ళుగా తెలుగులో వస్తున్నాయి.  పందెంకోడి, పొగరు సినిమాలు ఇరగబడి చూసే వాళ్ళం. చాలా మంది అమ్మాయిలు విశాల్ గారికి ఫ్యాన్స్ గా వుండేవారు. వాళ్ళ అభిమానం చూస్తే జలస్ గా వుండేది. ఒక ప్రేమికుడిగా కనిపిస్తూ భారీ ఫైట్లు కూడా చేసే స్క్రీన్ ప్రజన్స్ చాలా తక్కువ మందికి వుంటుంది. అది ప్రభాస్ గారిలో కనిపిస్తుంది.అలా అరుదుగా వుండే హీరోల్లో విశాల్ గారు ఒకరు. విశాల్ గారి మూవీస్ ని ఫాలో అవుతుంటాను. ఆయనతో స్టేజ్ షేర్ చేసుకోవడం ఆనందంగా వుంది.‘లాఠీ’ టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి.  విశాల్ గారు డిఫరెంట్ మూవీస్ తో స్ఫూర్తిని ఇచ్చే హీరో. ఈ సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వుంది. ‘లాఠీ’ని థియేటర్ లో చూడటానికి ఎదురుచూస్తున్నాను.'' అన్నారు. 

 

దర్శకుడు ఏ వినోద్ కుమార్ మాట్లాడుతూ..‘లాఠీ' యాక్షన్ అడ్వంచర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఒక సాధారణ కానిస్టేబుల్, అతని సాహసాలకు సంబధించిన కథ. విశాల్ గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. యాక్షన్ సన్నివేశాల సమాహారం ఈ చిత్రం. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, డీవపి బాలసుబ్రమణ్యన్ బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన విశాల్ గారికి మరోసారి కృతజ్ఞతలు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది''  అన్నారు. 

 

నిర్మాత రమణ మాట్లాడుతూ.. విశాల్ లాంటి హీరో మా తొలి సినిమా చేయడం ఆనందంగా వుంది. మా ముగ్గురి జర్నీ 17 ఏళ్ళు. ముగ్గురం కలసి చాలా సేవా కార్యక్రమాలు చేశాం. లాక్ డౌన్ లో‘లాఠీ’ కథ విన్నాం. చాలా నచ్చింది. విశాల్ కి బావుటుందని అనుకున్నాం. కాస్త భయపడుతూనే విశాల్ కి పంపించాం. విశాల్ కి నచ్చింది. అయితే మీరే నిర్మించాలని చెప్పడం మాకు సర్ ప్రైజ్ అనిపించింది. అప్పుడు మా దగ్గర రెండు లక్షలు మాత్రమే వున్నాయి. కానీ అంతా ఒక మ్యాజిక్ లా జరిగింది. బాలసుబ్రమణ్యన్, పీటర్ హెయిన్ లాంటి అత్యున్నత సాంకేతిక నిపుణులు ప్రాజెక్ట్ లో చేరారు. సినిమా సైజ్ పెరుగుతూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మారింది. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు వున్నాయి. విశాల్ కి ఈ సినిమాతో నేషనల్ అవార్డ్ వస్తుందనే నమ్మకం వుంది. అంత అద్భుతంగా చేశారు. '' అన్నారు 

 

సునయన మాట్లాడుతూ.. నేను తెలుగు అమ్మాయినే. తమిళ సినిమాల్లో పని చేయడం ప్రారంభించాను. తెలుగులో రాజరాజ చొర చేశాను. పాన్ ఇండియా సినిమాగా ‘లాఠీ’ వస్తోంది. విశాల్ గారితో పని చేయడం అనందంగా వుంది. ఆయన గ్రేట్ హ్యుమన్ బీయింగ్. దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం'' అన్నారు. 

 

యువన్ శంకర్ రాజా మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నాకు చాలా నచ్చింది. విశాల్ నటన చాలా బావుంటుంది. యాక్షన్ సీన్స్ ప్రధాన ఆకర్షణగా వుంటాయి. అందరూ థియేటర్లో చూడాలి'' అని కోరారు. శివ బాలాజీ మాట్లాడుతూ.. విశాల్ తన చుట్టూపక్కల వారి కోసం తపించే మనిషి. సేవాకార్యక్రమాలతో ఎంతో స్ఫూర్తిని ఇస్తుంటుంది.  సినిమా నిర్మాత  రమణ నా స్నేహితుడు. ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. నందా కూడా ఫ్రండే. ఈ ముగ్గురి కోసం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. ‘లాఠీ’ టీజర్ చూస్తుంటే ఒక ఎమోషన్ లా అనిపిస్తుంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది'' అన్నారు. 

 

మాటల రచయిత రాజేష్ ఎ మూర్తి మాట్లాడుతూ.. ఒక కానిస్టేబుల్ ‘లాఠీ’ తో న్యాయాన్ని ఒకవైపు, కాపాడుతూ మరోవైపు తన కుటుంబాన్ని ఎలా కాపాడుతుంటాడనేది కథ. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. చాలా అద్భుతమైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేశారు. నాకు తొలి సినిమా అవకాశం ఇచ్చింది విశాల్ గారు.  ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంతదూరం ట్రావెల్ చేశాను. లైఫ్ లాంగ్ ఆయనకి రుణపడి వుంటాను.‘లాఠీ’ సెకండ్ హాఫ్ అంతా క్లైమాక్స్ లానే వుంటుంది. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ సినిమా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.  

 

చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘లాఠీ’ తెలుగుదనం ఉట్టిపడే పాట రాశాను. అవకాశం ఇచ్చిన విశాల్ గారికి దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని కోరుకున్నారు 

 

నటీనటులు : విశాల్, సునయనసాంకేతిక విభాగం :దర్శకత్వం : ఏ వినోద్ కుమార్నిర్మాతలు : రమణ, నందబ్యానర్ : రానా ప్రొడక్షన్స్సంగీతం: యువన్ శంకర్ రాజాసినిమాటోగ్రఫీ : బాలసుబ్రమణ్యన్స్టంట్ డైరెక్టర్ : పీటర్ హెయిన్ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్ : బాల గోపిపీఆర్వో : వంశీ-శేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !