View

జి2 నెక్స్ట్ లెవల్ లో వుంటుంది - హీరో అడివి శేష్ 

Tuesday,January10th,2023, 03:16 PM

HIT2 తో డబుల్ హ్యాట్రిక్ హిట్ ‌లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ గా గూఢచారి సీక్వెల్ అయిన G2 ని ఇటివలే అనౌన్స్ చేశారు. గూఢచారి ఇండియాలో సెట్ చేయగా,G2 ఇంటర్ నేషనల్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించారు.


“మేజర్” ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్ ‌లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్,  ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రోజు నిర్వహించిన జి 2 ప్రెస్ మీట్ లో “ప్రీ విజన్” లాంచ్ చేశారు మేకర్స్. ప్రీవిజన్ వీడియోలో  శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్ చూపించారు. ఆ తర్వాత G2లో శేష్ ఫస్ట్ లుక్‌ ని ప్రజంట్ చేశారు.  


ప్రెస్ మీట్ లో అడివి శేష్  మాట్లాడుతూ.. జి2 ని ఒక ఫ్రాంచైజ్ గా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనే తపన వుంది. కొత్త దర్శకుడు వినయ్ కి చాలా గ్రేట్ విజన్ వుంది. తనకి గూఢచారి వరల్డ్ పై చాలా మంచి పట్టువుంది. మా నిర్మాతలువిశ్వప్రసాద్, అనిల్, అభిషేక్ గారికి కృతజ్ఞతలు. నేను ఏదడిగినా సమకూరుస్తారు. గూఢచారి సౌత్ఇండియా స్పై సినిమాల ట్రెండ్ మళ్ళీ తీసుకొచ్చింది. జి 2 తో ఆల్ ఇండియా ఫ్రాంచైజ్ గా మారబోతుంది. జి2 నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. సిక్స్ ప్యాక్ చేసి షూటింగ్ మొదలుపెడతాం.జి2 కి శ్రీచరణ్ మ్యూజిక్ అందిస్తారు. ఈ చిత్రాన్ని ఐదు దేశాల్లో షూట్ చేయబోతున్నాం. జి 2 ఏ స్థాయిలో వుంటుందో ప్రేక్షకులకు చిన్న రుచి చూపించడానికి ప్రీవిజన్ ని లాంచ్ చేశాం. 2024లో జి2 రాక్ ది బాక్స్ ఆఫీస్’’ అన్నారు. 


వినయ్ మాట్లాడుతూ.. గూఢచారి అనే వరల్డ్ చాలా యూనిక్. జి 2 ప్రేక్షకుకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. ప్రీ విజన్ కి శ్రీచరణ్ చాలా చక్కని సంగీతం అందించారు. మిగతా సాంకేతిక నిపుణులు కూడా చక్కని వర్క్ ఇచ్చారు. సినిమా అంచనాలకు మించి వుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన అడివి శేష్ కి , దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. తెలిపారు. 


శశికిరణ్ తిక్క మాట్లాడుతూ.. గూఢచారి 2 కథ శేష్ చెప్పినపుడు ఈ కథకు వినయ్ దర్శకుడైతే బావుంటుందని నేను శేష్ ఇద్దరం బలంగా అనుకున్నాం. వినయ్ కి గూఢచారి వరల్డ్ అంతా తెలుసు. తనలో అద్భుతమైన ఫిల్మ్ మేకర్ వున్నాడు. జి 2 చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా అదే మాట చెప్తారు’’ అన్నారు.


నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. గత ఏడాది 200 కోట్ల రూపాయిల సినిమాలని అందుకోవడంలో ప్రేక్షకులు, మీడియా ఎంతగానో సహకరించింది. ఈ యేడాది కూడా మీ సహకారం కావాలి. నిర్మాణంలోకి వచ్చిన కొత్తలో గూఢచారి చేశాం. కొత్త కంటెంట్ ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకాన్ని ఇచ్చిన చిత్రమిది. ఇప్పుడు మానిర్మాణంలో దాదాపు 20 చిత్రాలు వున్నాయి. జి2 మాకు ఎంతో  ప్రత్యేకమైన సినిమా. పాన్ ఇండియా గా లాంచ్ చేసి పాన్ వరల్డ్ సినిమా స్థాయికి తీసుకువెళ్లాని భావిస్తున్నాం. జి సిరిస్ లో మరిన్ని సినిమాలు చేయాలనే ఆలోచన కూడా వుంది.  సందర్భంలో మరో విషయం చెప్పాలని భావిస్తున్నాను. అభిషేక్ అగర్వాల్ ది కాశ్మీర్ ఫైల్స్ ఆస్కార్ కి షార్ట్ లిస్టు అయ్యింది. అలాగే ఈ చిత్రానికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కూడా వరిచింది. ఈ సందర్భంగా వారికి అభినందనలు’’ తెలిపారు. 


అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ... జి2 పై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలు అందుకునే భాద్యతని శేష్,  మేము తీసుకున్నాం. జి2 అద్భుతంగా వుండబోతుంది’’ అన్నారు. 

 

అనిల్ సుంకర మాట్లాడుతూ..  గూఢచారి 1 కథ విన్నప్పుడు మామూలు నిర్మాత అయితే సినిమాకి20 కోట్ల బడ్జెట్ అవుతుందని శేష్ తో చెప్పాను. కానీ శేష్ అద్భుతంగా చేసి చూపించాడు. కేవలం శేష్ కావడం వలెనే ఆ బడ్జెట్ లో చేయగలిగాడు. ఇప్పుడు ఇప్పుడు జి 2 అంతకంటే భారీ బడ్జెట్ లో విజువల్ వండర్ గా వుండబోతుంది’’ అన్నారు 


వివేక్ మాట్లాడుతూ .. దాదాపుగా 54 సినిమాలు చేశాను. సినిమా మేకింగ్ లో అన్నీ తెలుసు అనే గర్వం వచ్చినపుడు ఒకసారి శేష్ సినిమా చేస్తూ వుండాలి. మనకి ఏమీ రాదని తెలుస్తుంది.తనఆలోచనలు కొత్తగా అవుట్ అఫ్ బాక్స్ గా వుంటాయి. ఈ సినిమా కూడా చాలా చాలా బావుంటుంది. గూఢచారి 1 ఒక ఎత్తు అయితే దానికి మించి జి 2 వుంటుంది’’  


అబ్బూరి రవి మాట్లాడుతూ.. అడవి శేష్ తనని తాను ప్రతి క్షణం మార్చుకుంటూ గొప్పగా ఎదుగుతున్నాడు.  శేష్ టీం అంతా సినిమా అంటే కసితో వుంటారు. ఏదైనాసాధించాలనే తపనతో వుంటారు. గూఢచారి కి పని చేసిన వినయ్ జి 2 తో దర్శకుడిగా మారుతున్నాడు. తనలో అద్భుతమైన ప్రతిభ వుంది. మా టీంని ప్రోత్సహిస్తున్న విశ్వప్రసాద్ గారికి, అభిషేక్ గారికి,, అనిల్ సుంకర గారికి థాంక్స్. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా దానికి మించి అవుట్ పుట్ ఇస్తాం’’ అన్నారు.  


శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. జి2 లో పార్ట్ కావడం ఎక్సయిటెడ్ గా వుంది. నేను చేసిన సినిమాలన్నిటిలో కంటే జి2 నేపధ్య సంగీతం డిఫరెంట్ గా వుంటుంది. ఇంటర్ నేషనల్ స్థాయిలో వుంటుంది’’అన్నారు 


తారాగణం: అడివి శేష్ 


సాంకేతిక సిబ్బంది:దర్శకుడు: వినయ్ కుమార్ సిరిగినీడి కథ: అడివి శేష్ ర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంగీతం: శ్రీచరణ్ పాకాల పీఆర్వో: వంశీ-శేఖర్ మార్కెటింగ్: ఫస్ట్ షోAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !