View

పాప్ కార్న్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన హీరో నాగ చైత‌న్య‌  

Wednesday,January18th,2023, 04:24 PM

అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా (నెపోలియ‌న్‌, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత‌) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ అవికా గోర్ ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌టం విశేషం. ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా బుధ‌వారం రోజున ‘మ‌ది విహంగ‌మ‌య్యే...’ అనే లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు హీరో నాగ చైత‌న్య‌. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు.


పాట‌ను గ‌మ‌నిస్తే ఓ షాపింగ్ మాల్‌లోనే పాటంతా సాగుతుంది. హీరో హీరోయిన్లు అందులో షాపింగ్ చేయ‌టానికి వ‌చ్చిన‌ప్పుడు వారి ఆలోచ‌న‌లు.. ఎంత వేగంగా వారి భ‌విష్య‌త్తు వైపు అందంగా దూసుకెళ్తున్నాయ‌నే విష‌యాన్ని చ‌క్క‌టి లిరిక్స్‌తో పాట‌లో పొందు ప‌రిచారు లిరిక్ రైట‌ర్ శ్రీజో. శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాలో మ‌ది విహంగ‌మ‌య్యే.. పాట‌ను బెన్నీ ద‌యాల్‌, ర‌మ్యా బెహ్రా చ‌క్క‌గా ఆల‌పించారు.


ఈ సంద‌ర్భంగా చిత్ర స‌మ‌ర్ప‌కుడు ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు మాట్లాడుతూ ‘‘‘పాప్ కార్న్’ మూవీని ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు రాన‌టువంటి ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. సినిమా అంతా లిఫ్టులోనే ఉంటుంది. ముఖ్యంగా చివ‌రి 45 నిమిషాలు అయితే  సీట్ ఎడ్జ్ మూవీలా ఉంటుంది. పెద్ద‌ల‌కు వారి యంగ్ ఏజ్ గుర్తుకు వ‌స్తుంది. ఇప్ప‌టి యువ‌త‌కు కూడా క‌నెక్ట్ అవుతుంది. అన్ని ర‌కాల ఎమోష‌న్స్  ఉన్న సినిమా. డైరెక్ట‌ర్ ముర‌ళి గంధం టేకింగ్‌ను అంద‌రూ త‌ప్ప‌కుండా అప్రిషియేట్ చేస్తారు’’ అన్నారు.


సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్య‌వ‌హ‌రించిన అవికా గోర్ మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ మూవీ . డైరెక్టర్ మురళిగారు నెరేషన్ వినగానే ఓకే చెప్పేశాను. ఈ సినిమాకు నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించాను. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారనే న‌మ్మ‌కం ఉంది. ఫిబ్ర‌వ‌రి 10న పాప్ కార్న్‌తో సంద‌డి చేయ‌బోతున్నాం’’ అన్నారు.


హీరో సాయి రోనక్ మాట్లాడుతూ ‘‘సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే ప్రేక్ష‌కులు సినిమాలోకి లీన‌మైపోతారు. ఇక చివ‌రి 45 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా మూవీ అల‌రిస్తుంది’’ అన్నారు.


‘పాప్ కార్న్’ మూవీ పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి.


న‌టీన‌టులు:
అవికా గోర్‌, సాయి రోన‌క్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:
స‌మ‌ర్ప‌ణ‌: ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు, బ్యాన‌ర్స్‌:  ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ ,నిర్మాత‌:  భోగేంద్ర గుప్తా, కాన్సెప్ట్ - స్టోరి - డైలాగ్స్ - స్క్రీన్ ప్లే - ద‌ర్శ‌క‌త్వం:  ముర‌ళి గంధం, కో ప్రొడ్యూస‌ర్స్‌:  అవికా గోర్‌, ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు, శేషు బాబు పెద్దింటి, సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.ఎన్‌.బాల్ రెడ్డి, మ్యూజిక్:  శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌, ఎడిట‌ర్‌:  కె.ఎస్‌.ఆర్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  భాస్క‌ర్ ముదావ‌త్‌, కొరియోగ్ర‌ఫీ:  అజ‌య్ సాయి, ఫ్యాష‌న్ డిజైన‌ర్‌:  మ‌నోహ‌ర్ పంజా, పి.ఆర్.ఓ:  నాయుడు సురేంద్ర‌, ఫణి (బియాండ్ మీడియా), పోస్ట‌ర్స్‌, లిరిక‌ల్స్‌:  నియో స్టూడియోస్‌, డిజిటల్ మార్కెటింగ్‌:  మ్యాంగో మీడియా, మ్యూజిక్‌: ఆదిత్య మ్యూజిక్‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !