View

9 రోజులు.. రా రండోయ్ వేడుక చూద్దాం బాక్సాఫీస్ లెక్కలు!

Friday,June09th,2017, 12:40 PM

'మనం' పాటల వేడుకలో నాన్న గారు నటించిన చివరి చిత్రం 'మనం' తప్పకుండా ఘనవిజయం సాధించ డమే కాదు చిరకాలం మన మనసుల్లో నిలిచిపోయే గొప్ప సినిమా అవు తుంది' అని చెప్పారు కింగ్‌ నాగార్జున. ఆ సినిమా విడుదలై 'మనం'దరి ఆదరాభిమానాల్ని అందుకుని గొప్ప సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. గత సంవత్సరం సంక్రాంతికి ముందు 'సోగ్గాడే చిన్ని నాయనా' ఆడియో వేడుకలో 'సోగ్గాడు' బంగార్రాజు గెటప్‌లో స్టేజిపై డ్యాన్స్‌ చేసి అభిమానుల్ని ఆనంద పర్చడమే కాదు.. అభిమానులందరికీ 'సంక్రాంతికి వస్తున్నాం.. సూపర్‌హిట్‌ కొడుతున్నాం' అని ఓపెన్‌గా ఎనౌన్స్‌ చేసారు. అది చూసి నాగార్జున ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారని కామెంట్‌ చేసిన వాళ్లు కూడా వున్నారు. కానీ స్టేజి మీద ప్రకటించినట్లుగానే గత సంవత్సరం సంక్రాంతికి 'సోగ్గాడే'తో బ్లాక్‌ బస్టర్‌ కొట్టి హీరోగా, నిర్మాతగా అఖండ విజయం సాధించారు.


మొన్నటికి మొన్న 'రారండోయ్‌ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో స్టేజి మీద స్టెప్స్‌ వేసి అక్కినేని అభి మానుల్ని ఉత్సాహపరచడంతో పాటు 'మళ్లీ వస్తున్నాం.. సూపర్‌హిట్‌ కొడుతున్నాం' అని హర్షధ్వానాల మధ్య మరోసారి ప్రకటించారు. నాగార్జున చెప్పినట్లుగానే 9 రోజుల్లోనే 35 కోట్లు కలెక్ట్‌ చేసి యువసామ్రాట్‌ నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' 'మనం'కి విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తే.. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రాలకు కళ్యాణ్‌ కృష్ణ దర్శకుడు. నిర్మాతగా ఈ మూడు చిత్రాల ఘన విజయా లతో అన్నపూర్ణ స్టూడి యోస్‌ యూనిట్‌ చాలా ఆనందంగా వుంది. ఈ ఘనవిజయం రావ డానికి కింగ్‌ నాగార్జున తీసుకున్న స్పెషల్‌ కేర్‌ కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


అఖిల్‌కి సూపర్‌హిట్‌!!
'సోగ్గాడే చిన్ని నాయనా' విజయోత్సవంలో నాగ చైతన్యకు, అఖిల్‌కి నిర్మాత గా సూపర్‌హిట్స్‌ ఇస్తానని ప్రకటించిన కింగ్‌ నాగార్జున 'రారండోయ్‌'తో నాగ చైతన్యకు సూపర్‌ డూప ర్‌ హిట్‌ ఇచ్చి ఓ ప్రామి స్‌ని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు అఖిల్‌కి సూపర్‌ హిట్‌ ఇస్తానని చేసిన ప్రామిస్‌ని నిలబెట్టు కునే ప్రయత్నంలో కాంప్ర మైజ్‌ అవకుండా చాలా లావిష్‌గా అఖిల్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్రమ్‌ కె. కుమార్‌ ఎక్స్‌ ట్రార్డినరీ సబ్జెక్ట్‌ చెప్పారు. ఆ కథ మీద నమ్మకంతోనే చాలా భారీగా ఈ సినిమా చేస్తున్నాం. డెఫినెట్‌గా అఖిల్‌కి ఇది సూపర్‌డూపర్‌ హిట్‌ సినిమా అవుతుంది అని చాలా కాన్ఫిడెంట్‌గా చెపుతున్నారు కింగ్‌ నాగా ర్జున. హాలీవుడ్‌ ఫైట్‌ మాస్టర్స్‌ సారధ్యంలో 12 కోట్ల రూపాయలతో ఈ చిత్రం కోసం తీసిన యాక్షన్‌ పార్ట్‌ ప్రేక్షకుల్ని గ్యారెంటీగా థ్రిల్‌ చేస్తుంది. నిర్మాతగా ఇంతకుముందు 'శివ', 'నిన్నే పెళ్లాడతా', 'సిసింద్రి', 'సీతారా ముల కళ్యాణం చూతమురారండీ', 'సీతా రామరాజు', 'మన్మథుడు', 'సత్యం', 'మాస్‌' 'ఉయ్యాలా జంపాలా' వంటి ఎన్నో బంపర్‌హిట్స్‌ని అందిం చినా అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌పై లేటెస్ట్‌గా 'మనం', 'సోగ్గాడే', 'రారం డోయ్‌'తో మళ్లీ హ్యాట్రిక్‌ కొట్టి అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సా హాన్ని తీసుకొచ్చిన కింగ్‌ నాగార్జునను అందరూ అభినందిస్తున్నారు.


హీరోగా 'రాజుగారి గది-2'
'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి' చిత్రాలతో గత సంవత్సరం హీరోగా అద్భుత విజయాలను సాధించిన కింగ్‌ నాగార్జున హీరోగా ఓ డిఫరెంట్‌ రోల్‌లో ఓంకార్‌ దర్శకత్వంలో 'రాజుగారి గది-2'లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫినిషింగ్‌ స్టేజిలో వుంది. కింగ్‌ నాగార్జున నిర్మాతగా అఖిల్‌ చిత్రం మీద కాన్‌సన్‌ట్రేట్‌ చేస్తూనే హీరోగా తాను చెయ్యబోయే రెండు కొత్త చిత్రాల కథా చర్చల్లో రెగ్యులర్‌గా పాల్గొంటున్నారు. త్వరలోనే ఈ చిత్రాల వివరాలు తెలుస్తాయి. ఏది ఏమైనా హీరోగా, నిర్మాతగా సంచలన విజయాల్ని సాధించాలన్న పట్టుదలతో ఆచితూచి అడుగేస్తున్న కింగ్‌ నాగార్జున సినిమా లన్నీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించేలా వుంటాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ముందుగానే చెప్పి మరీ వరసగా మూడు సూపర్‌హిట్స్‌ కొట్టిన కింగ్‌ నాగార్జున ఇకముందు కూడా ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే మంచి చిత్రాలు చేస్తూ మరిన్ని సూపర్‌హిట్‌ చిత్రాలు తన ఖాతాలో వేసుకోవడం ఖాయం.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !