View

అశోక్ కి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను - దర్శకుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్

Sunday,July30th,2017, 08:58 AM

సుకుమార్ సినిమా తీస్తున్నాడు. మిమ్మల్ని ఏ కార్యక్రమానికైనా పిలిచాడా? అని కొందరు మిత్రులు నన్నడిగారు. సుకుమార్ నన్ను పిలవకుండా ఎక్కడికి పోతాడు.. పిలుస్తాడు. అని వారితో సరదాగా అన్నాను. నాకు, సుకుమార్‌కు మధ్య ఆత్మీయ అనుబంధం వుంది. ఆయన నిర్మించిన దర్శకుడు పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. దర్శకులందరిలో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి సుకుమార్. నేను ఐ లవ్ యూ చెప్పే ఇద్దరు ముగ్గురు మగాళ్లలో సుకుమార్ ఒకరు (నవ్వుతూ). సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ నిర్మాతగా రిస్క్ చేయడం మామూలు విషయం కాదు. తన అభిరుచులకు అనుగుణంగా సుకుమార్ సినిమాల్ని తెరకెక్కించడం అభినందనీయం అన్నారు అల్లు అర్జున్.


ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన దర్శకుడు చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తితో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశోక్, ఈషా, పూజిత జంటగా నటించారు. హరిప్రసాద్ జక్కా దర్శకుడు. ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పై విధంగా స్పందించాడు.


ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ - బన్నీ నా వల్లే హీరో అయ్యాడు. ఆర్య షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ పడవ ప్రమాదం జరిగింది. అదుపుతప్పి నేను నీళ్లలో పడిపోయాను. నాకు ఈత రాకపోవడం వల్ల ఏం చేయాలో అర్థంకాలేదు. ఓ నిమిషం ఆగితే చనిపోయేవాడిని. వెంటనే బన్నీ నీళ్లలో దూకి నన్ను రక్షించాడు. నన్ను రక్షించాడు కాబట్టి బన్నీని రియల్‌ హీరోగా భావిస్తాను. నా దృష్టిలో అల్లు అర్జున్ ఎప్పటికే ఆర్యనే. ఇక మా కుటుంబ సభ్యుల్ని నేనెప్పుడు సినిమాల్లో ఎంకరేజ్ చేయలేదు. మా అన్నయ్య కుమారుడు అశోక్ అనుకోకుండా హీరో అయ్యాడు. దర్శకత్వ శాఖలో పనిచేయాలనేది అతడి లక్ష్యంగా వుండేది. వన్ సినిమాకు ఒక వెర్షన్ రాయమని పురమాయిస్తే అందరికంటే అద్భుతంగా రాశాడు. హీరోగా అతనికి మంచి భవిష్యత్తు వుంటుందని ఆశిస్తున్నాను అన్నారు.


సుకుమార్ నాకు సోదరుడితో సమానం. మా ఇద్దరికి పద్నాలుగేళ్ల అనుబంధం. ఆర్య చిత్రం నాతో పాటు అల్లు అర్జున్, సుకుమార్‌కు మంచి లైఫ్‌నిచ్చింది. దర్శకుడు సినిమా ట్రైలర్‌లో సుకుమార్ ముద్ర స్పష్టంగా కనబడుతున్నది. సినిమాను ఎంతగానో ప్రేమించే సుకుమార్ నిర్మాతగా కొత్త అడుగులు వేస్తున్నాడు. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అని దిల్‌రాజు పేర్కొన్నారు.


సుకుమార్ ఆలోచనలకు అందమైన దృశ్యరూపంగా వుండే చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు. వినూత్న కథా చిత్రంలో భాగమవడం అదృష్టంగా భావిస్తున్నామని నాయకానాయికలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !