View

బైరవగీత ఫ్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ విశేషాలు

Saturday,November24th,2018, 08:25 AM

ధనుంజయ్ హీరోగా ఐరా మోర్ హీరోయిన్ గా రామ్‌గోపాల్ వ‌ర్మ స‌మ‌ర్పణలో అభిషేక్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై సిద్ధార్థ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామ‌, భాస్క‌ర్ రాశి నిర్మించిన చిత్రం భైర‌వ‌గీత‌. లవ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 30న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ మాదాపూర్ లో హై లైఫ్ పబ్ లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ని ఘనంగా నిర్వహించారు.


చిత్ర స‌మ‌ర్ప‌కుడు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ మాట్లాడుతూ - భైర‌వగీత నాకు చాలా స్పెష‌ల్ మూవీ. ఇన్నేళ్ల‌లో నేను ఎన్నో సినిమాల‌ను డైరెక్ట్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను. డైరెక్ష‌న్ అంటే ఓవరాల్ ఎఫెక్ట్ అని అంద‌రూ అనుకుంటారు. కానీ ఉన్న మెటీరియ‌ల్‌ను ఉప‌యోగించి సినిమాటిక్‌గా యాంగిల్‌లో మార్చేవాడే డైరెక్ట‌ర్ అని భావ‌న‌. కొన్ని సీన్స్ ను పేప‌ర్ మీద రాసేట‌ప్పుడు ఎలా ఉంటుంది. దాన్ని సినిమాగా డైరెక్ట‌ర్ ఎంత ఎక్కువ‌, త‌క్కు వ ఎఫెక్ట్‌తో డైరెక్ట్ చేశాడ‌నే దానిపై దాని లైఫ్ ఆధార‌ప‌డి ఉంటుంది. సిద్ధార్థ తాతోలు అసిస్టెంట్ ఎడిట‌ర్‌గా నా ద‌గ్గ‌ర ఏదో ఓ సినిమాకు ప‌నిచేశాడు. ఆ స‌మ‌యంలో త‌ను ఎడిటింగ్‌కు సంబంధించి విలువైన స‌ల‌హాలు ఇచ్చేవాడు. త‌ను ఇంటెలిజెంట్‌. ఓసారి క‌డ‌ప వెబ్ సిరీస్ చేయ‌డానికి ఆఫీస్‌లో డిస్క‌స్ చేస్తూ ఉంటే, సిద్ధార్థ ఆ ట్రైల‌ర్‌ను నేను చేస్తాన‌ని చెప్పి చేశాడు. త‌న‌లో స్పార్క్ అప్పుడు నాకు న‌చ్చింది. సినిమాలో సీన్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ఉంటుంది. సిద్ధూ అస‌లు ఎలా చేస్తాడ‌నే డౌట్ ఉండేది. నువ్వు నిజంగా చేయ‌గ‌లుగుతావా! అని కూడా అడిగాను. ఎవ‌రైనా చేయలేని ప‌నిని చేస్తాన‌ని చెబుతున్నారంటే వాడు ఫ్రాడ్ అయ్యుండాలి.. లేదా పిచ్చోడైనా అయ్యుండాలి. సిద్ధూ పిచ్చోడు కాదు.. త‌నే డైరెక్ట‌ర్ కాబ‌ట్టి ఫ్రాడ్ చేయాల్సిన అవ‌స‌రం త‌న‌కు ఉండ‌దు అనే న‌మ్మ‌కంతో సినిమా అవ‌కాశాన్ని ఇచ్చాను. నేను చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. కొన్ని బాగా వ‌స్తాయి. కొన్ని బాగా రావు. ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ ర‌షెష్ చూసి నేను షాక‌య్యాను. నేను స్క్రిప్ట్ చ‌దివిన‌ప్పుడు, డైరెక్ట‌ర్‌గా నాకొక విజ‌న్ ఉంటుంది. దాన్ని బ‌ట్టి నేను ఇమాజినేష‌న్‌తో ఎడిటింగ్ రూమ్‌లోకి వెళితే.. నేను షాకయ్యాను. ఈ సీన్‌ను ఇలా తీయ్యొచ్చా అని కూడా అనిపించింది. అది నాకొక లెర్నింగ్ లెస‌న్‌. డైరెక్ష‌న్ అనుభ‌వం లేకుండా సినిమా చేయ‌డ‌మ‌నేది రేర్‌గా జ‌రిగే విష‌యం. నా టైంలో నేనున్నాను. మ‌ణిర‌త్నంగారు కూడా అసిస్టెంట్‌గా ప‌నిచేయలేదు. శేఖ‌ర్ క‌పూర్ కూడా అసిస్టెంట్‌గా ప‌నిచేయ‌లేదు. ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది అలాగే డైరెక్ట్ చేస్తున్నారు. భైర‌వ‌గీత చాలా కాంప్లెక్స్ మూవీ. 90 శాతం మంది కొత్త‌వాళ్లే.. వాళ్ల నుండి అంత పెర్ఫామెన్స్‌లు రాబ‌ట్ట‌డ‌మ‌నే గొప్ప విష‌యం. చాలా పెద్ద డైరెక్ట‌ర్ చిన్న పిల్ల‌ల కోసం తీసిన సినిమా 2.0 అయితే చాలా చిన్న‌వాడు పెద్ద‌వాళ్ల కోసం తీసిన సినిమా భైర‌వగీత‌ అన్నారు.


ప్రముఖ దర్శకుడు సుధీర్ వ‌ర్మ మాట్లాడుతూ.. కంగ్రాట్స్‌! వ‌ర్మ‌గారు.. మరొక‌రిని డైరెక్ట్ చేయ‌మ‌ని అన్నారంటే సినిమాలో కంటెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చుఅన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌విశంక‌ర్ మాట్లాడుతూ - ఇందులో సాంగ్స్ అన్నీ మెలోడి సాంగ్సే. రాముగారు మాకు ఫ్రీడమ్ ఇచ్చి సాంగ్స్ చేయ‌మ‌ని అన్నారు. సిద్ధార్థ‌తో డే అండ్ నైట్ ట్రావెల్ చేశాం అన్నారు.


పాటల రచయిత సిరాశ్రీ మాట్లాడుతూ - సాంగ్స్ గురించి డిస్క‌స్ చేయాలి. ముంబై రావాలి అని రామ్‌గోపాల్ వ‌ర్మ అన‌గానే వెళ్లాను. ఇన్‌టెన్స్ ఉన్న క‌థ అని స్టోరీ విన‌గానే అర్థ‌మైంది. అయితే రాముగారు డైరెక్ట‌ర్ కాదని తెలిసింది. డైరెక్ట‌ర్ ఎవ‌రండి అని అడిగితే సిద్ధార్థ్ అన్నారు. నాకు సిద్ధార్థ్ ఎవ‌రో కూడా తెలియ‌లేదు. స్కూల్ పిల్లోడిలా ఉంటాడు. మ‌రి ఇంత ఇన్‌టెన్స్ మూవీని హ్యాండిల్ చేయ‌గ‌ల‌డా? అని అన్నాను. అయితే ఫ‌స్ట్ షెడ్యూల్‌లో కొన్ని షాట్స్ చూసిన త‌ర్వాత షాక‌య్యాను. నాకు సిద్ధు వామ‌నావ‌తారంలా క‌న‌ప‌డ్డాడు. రాముగారి నిర్ణ‌యం ఎప్పుడూ క‌రెక్ట్‌గానే ఉంటుంది అన్నారు.


ఆర్ఎక్స్100 ఫేమ్ అజ‌య్ భూప‌తి మాట్లాడుతూ - రాంగోపాల్ వర్మ స‌మ‌ర్ప‌ణ‌లో సినిమాలు చేసే అదృష్టం మాకు ద‌క్క‌లేదు. సిద్ధార్థ‌కి ద‌క్కింది. నేను చూసిన నా టీమ్‌లో సిద్ధార్థ్ చాలా బెస్ట్ అని వ‌ర్మ‌గారు అప్రిషియేట్ చేస్తుంటే కుళ్లుకున్నాను. అయితే ట్రైల‌ర్ విడుద‌లైంది. అందులో షాట్స్‌.. రియ‌లిస్టిక్ లొకేష‌న్స్ చిత్రీక‌రించిన విధానం చూసి నిజంగానే సిద్ధార్థ ఇర‌గ‌దీశాడ‌నిపించింది. డిఫ‌రెంట్ మూవీ. 100 శాతం యూత్ ఫిలిం అన్నారు.


చిత్ర దర్శకుడు సిద్ధార్థ తాతోలు మాట్లాడుతూ.. ఇంజ‌నీరింగ్ చ‌దివిన నేను సినిమాల్లోకి వెళ‌తాను అన‌గానే.. ఇప్ప‌టి వ‌ర‌కు స‌పోర్ట్ చేసిన నా త‌ల్లిదండ్రుల‌కు థాంక్స్‌. నా గురువుగారు రాముగారికి థాంక్స్ చెప్పి.. నాకు ఇచ్చిన అవ‌కాశాన్ని చిన్న‌దిగా చేయ‌డం నాకు ఇష్టం లేదు. నిర్మాత అభిషేక్‌గారు ఎంతో స‌పోర్ట్ అందించారు. సినిమాటోగ్రాఫ‌ర్ జ‌గ‌దీష్ గారు అద్భుత‌మైన విజువ‌ల్స్ వ‌చ్చాయి. వంశీ చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. సిరాశ్రీగారు చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. ధ‌నుంజ‌య‌ను ఈ సినిమాతో భైర‌వ అని పిలుస్తారు. హీరోయిన్‌తో అంద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. న‌న్ను న‌మ్మి, నాతో ప‌నిచేసిన అంద‌రికీ థాంక్స్ అన్నారు.


హీరో ధనుంజయ్ మాట్లాడుతూ.. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.. నేను ఇప్పటివరకు 10 సినిమాలు చేసాను. ఇది నా 11వ చిత్రం. అందరికీ ఈ చిత్రం నచ్చుతుంది అన్నారు.


హీరోయిన్ ఐరా మోర్ మాట్లాడుతూ.. ర కంటెంట్ తో రూపొందిన లవ్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా మంచి ఎక్స్ పీరియెన్స్ నిచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన ఆర్జీవీ గారికి నా థాంక్స్ అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !