View

థాంక్స్ మీట్ ఏర్పాటు చేసిన బ్రోచేవారెవ‌రురా టీమ్

Tuesday,July02nd,2019, 12:47 PM

శ్రీవిష్ణు, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం బ్రోచేవారెవ‌రురా... చలనమే చిత్రము..చిత్ర‌మే చ‌ల‌న‌ము అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌. సత్యదేవ్, నివేతా పేతురాజ్, రాహుల్ రామక్రిష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించారు. విజ‌య్‌కుమార్ మ‌న్యం నిర్మాత‌. ఈ చిత్రం జూన్ 28న విడుదలై హిలేరియస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైదరాబాద్ దస్పల్ల హోటల్ లో చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు శివ నిర్వాణ, తరుణ్ భాస్కర్ పాల్గొన్నారు..


నిర్మాత విజ‌య్‌కుమార్ మ‌న్యం మాట్లాడుతూ - సినిమా చూసి ఎంక‌రేజ్ చేసిన ప్రేక్ష‌కులంద‌రికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. అనీల్‌రావిపూడి, త‌రుణ్‌భాస్క‌ర్‌, రామ్‌, సురేశ్‌బాబుగారు, నానిగారు, వెంక‌టేశ్‌గారు, కె.టి.ఆర్‌గారు స‌హా అంద‌రికీ థాంక్స్. మంచి క‌లెక్ష‌న్లు రావ‌డానికి, మంచి ఓపెనింగ్స్ రావ‌డానికి మంచి రివ్యూలు దోహ‌ద‌ప‌డ్డాయి. ప్ర‌తి రివ్యూలోనూ మా టీమ్‌ని ప్ర‌శంసించినందుకు ధ‌న్య‌వాదాలు అన్నారు.


దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ - ఆడియ‌న్స్‌కి ధ‌న్య‌వాదాలు. ప్రెస్ వాళ్లంద‌రూ ఫోన్ చేసి సినిమా గురించి ప్ర‌శంసించారు. ప్ర‌తి ఒక్క‌రూ బాగా చేశారు. ఇది మా టీం అందరి సమిష్టి కృషిలో సాధించిన విజయం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగ‌ర్ మాట్లాడుతూ - వివేక్ చాలా మంచి స్టోరీ రాసుకున్నారు. నిర్మాత‌కు తొలి సినిమాకే ఇంత పెద్ద హిట్ రావ‌డం ఆనందంగా ఉంది. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బావుంది. మా లిరిసిస్ట్ లు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. సౌండ్ డిజైన్ చాలా బావుంది. సౌండ్ డిజైన్‌తోనే టైటిల్స్ కూడా ప‌డుతాయి అన్నారు.
నటుడు ప్రియ‌ద‌ర్శి మాట్లాడుతూ - సినిమా చాలా బావుంది. గ‌త రెండు, మూడు వారాలుగా థియేట‌ర్ల‌లో చాలా మంచి సినిమాలు వ‌స్తున్నాయి. ఆడియ‌న్స్ ఇలాంటి సినిమాలు చూడ‌బ‌ట్టే కొత్త సినిమాల‌తో మేం కూడా ముందుకొస్తున్నాం. వివేక్ చాలా జీనియ‌స్. నిర్మాత సినిమా మీద ఇంత ప్యాష‌న్‌తో చేసినందుకు థాంక్స్. నా పాత్ర‌ను చూసి అంద‌రూ న‌వ్వుతుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు.


నటుడు స‌త్య‌దేవ్ మాట్లాడుతూ - వివేక్ నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు. వివేక్‌కి చాలా మంచి డైర‌క్ష‌న్ టీమ్ ఉంది. వివేక్ టీమ్‌లో ప్ర‌తి ఒక్క‌రూ డైర‌క్ట‌ర్స్ అవుతార‌నిపించింది. శ్రీ విష్ణు మంచి కథలను మాత్రమే ఎంచుకుంటాడు అని మరో సారి రుజువైంది అన్నారు.


హీరోయిన్ నివేదా థామస్ మాట్లాడుతూ - మా సినిమాను స‌పోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్. బ్రోచేవారు చేయ‌డం వ‌ల్ల నాకు చాలా మంది బ్ర‌ద‌ర్స్, సిస్ట‌ర్స్, ఫాద‌ర్స్... ఇలా చాలా మంది దొరికారు. ఎందుకంటే చాలా మంచి హిట్ వ‌చ్చింది మాకు. మంచి సినిమాలు వ‌స్తే ఆడియ‌న్స్ స‌పోర్ట్ చేస్తార‌ని మ‌రోసారి రుజువైంది. ఈ టీమ్‌లో ఏ ఒక్క‌రు లేక‌పోయినా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో. రివ్యూల్లో చాలా డీటైల్స్ కూడా రాశారు. అందులోని విష‌యాన్ని రివీల్ చేయ‌క‌పోవ‌డం ఆనందంగా ఉంది అని అన్నారు.


దర్శకుడు త‌రుణ్ భాస్క‌ర్ మాట్లాడుతూ - 2019లో నాకు న‌చ్చిన సినిమా అని చాలా మంది చెప్పారు. నాకు టిక్కెట్లు దొర‌క‌లేదు. వివేక్ నాకు ఒక టికెట్ ఇప్పిస్తే బావుంటుంది. నేను రేపు 11కి ఏఎంబీలో చూస్తాను. మ‌న‌స్ఫూర్తిగా చెప్పాలంటే వివేక్ ఆత్రేయ‌కి ఇది వెల్ డిస‌ర్వ్డ్ స‌క్సెస్‌. ఆయ‌న ప్ర‌తి డీటైల్‌ను కేర్ ఫుల్ గా చేశారు. ఆయ‌న ద‌గ్గ‌ర చాలా నేర్చుకోవాలి నేను. త‌న ప‌ర్స‌న‌ల్ జ‌ర్నీ కూడా నాకు తెలుసు. ఆయన ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి" అన్నారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ - నేను కథ రాసేట‌ప్పుడు హ్యూమ‌ర్ రావాలంటే దీన్ని పారామీట‌ర్‌గా తీసుకోవాల‌ని అనుకుంటున్నాను. ఇటీవ‌ల నేను, వివేక్‌, గౌత‌మ్ తిన్న‌నూరి ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చాం. అందులో భాగంగా వివేక్‌ని నెక్స్ట్ ఏ సినిమా తీయ‌బోతున్నారు అని అడిగితే `ఏదైనా నా స్ట్ర‌గుల్‌, నా పెయిన్ నుంచి వ‌స్తుంది` అని చెప్పాడు. త‌ను అలా చెప్ప‌డం నాకు న‌చ్చింది. సెకండ్ ఫిల్మ్ అనేస‌రికి ఆబ్లిగేష‌న్‌లో ప‌డ‌కుండా, అడ్వాన్సుల్లో ప‌డ‌కుండా ఉండ‌టం చాలా ఆనందంగా ఉంది. నివేదాకు క్లాసిక‌ల్ డ్యాన్స్ బాగా వ‌చ్చు. నేను నిన్నుకోరిలో పిచ్చిపిచ్చిగా చేయించాను. ఈ సినిమాలో చాలా బాగా చేసింది. ఈ సినిమాలో క‌థ బావుండాల‌ని అంద‌రూ కృషి చేశారు. అదే ఈ సినిమాకు పెద్ద స‌క్సెస్‌. ఇప్ప‌టిదాకా శ్రీవిష్ణు చేసిన సినిమాల్లోకి ఈ సినిమా పెద్ద స‌క్సెస్ అని అనిపించింది. నేను సినిమా మొత్తం మీద ఎక్కువ ఎంజాయ్ చేసింది శ్రీకాంత్‌గారి క్యారెక్టర్ అన్నారు.


హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ - మా సినిమాను అంద‌రూ చూసి చాలా బావుంద‌న్నారు. సురేష్‌బాబుగారు చూసి బావుంద‌న్నారు. ప్రీ రిలీజ్‌కి రామ్‌గారు, రోహిత్‌గారు వ‌చ్చారు. దాని వ‌ల్ల అంద‌రికీ రీచ్ అయింది. ముందు రోజు నానిగారు చూసి బావుంద‌ని చెప్ప‌డంతో అంద‌రూ థియేట‌ర్ల‌కు వ‌చ్చి మెచ్చుకోవ‌డం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇక్క‌డివ‌ర‌కు వ‌చ్చింది. ఎక్క‌డి వ‌ర‌కు వ‌స్తుందో తెలియ‌దు. సినిమా చూసి నేనే న‌వ్వుకుంటున్నాను. ప్రీ రిలీజ్‌లోనూ చెప్పాను. ఎగిరెగిరి న‌వ్వుతార‌ని. ఈ సినిమా పెద్ద హిట్ కావ‌డం ఆనందంగా ఉంది. పైర‌సీలు చూడొద్దు. మంచి థియేట‌ర్లో చూస్తే ఇంకా బావుంటుంది అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో బ్రోచేవారెవ‌రురా టీమ్ అందరూ పాల్గొని సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !