View

గీతా ఆర్ట్స్ లో 3వ సినిమా చేయబోతున్న పరశురామ్

Monday,December24th,2018, 12:44 PM

ప‌రశురామ్... ఈ త‌రం ద‌ర్శ‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు. చేసింది త‌క్కువ సినిమాలే అయినా... వాటితోనే ప్ర‌త్యేక‌మైన‌ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ప‌రశురామ్. ముఖ్యంగా ర‌చ‌యిత‌గా గురువు పూరీనే మించిపోయే విధంగా పేరు తెచ్చుకుంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ ఏడాది గీత‌గోవిందంతో సంచ‌ల‌నం సృష్టించాడు ప‌రశురామ్. ప‌దేళ్ల కింద యువ‌త లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. హీరో నిఖిల్ కు సోలో హీరోగా ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఇదే. ఆ త‌ర్వాత ఆంజ‌నేయులుతో ర‌వితేజ‌లోని ఎన‌ర్జీని అదిరిపోయేలా చూపించాడు. ఆంజ‌నేయులు చిత్రంలో ఈయ‌న‌ రాసిన కామెడీ చ‌మ‌క్కులు ఇప్ప‌టికీ పెదవుల‌పై చిరున‌వ్వు తెప్పిస్తాయి.


ఇక సోలో సినిమాతో కుటుంబ ప్రేక్ష‌కుల్ని కూడా త‌న‌దైన రీతిలో అల‌రించాడు పరశురామ్. నారా రోహిత్ కు హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసాడు. అందులో మాస్ ప్రేక్ష‌కుల్ని అల‌రించే విధంగా క‌థ‌ను న‌డిపిస్తూనే.. కుటుంబ విలువ‌ల‌కు పెద్ద‌పీట వేసాడు. ఇక ర‌చ‌యిత‌గా ఆయ‌న ఇమేజ్ ను మ‌రింత ఎత్తుకు చేర్చింది సోలో. సారొచ్చారుతో ర‌వితేజ‌లోని మ‌రో కోణాన్ని బ‌య‌టికి తీసాడు. ఈ త‌రం ద‌ర్శ‌కులు ఎవ‌రూ పెద్ద‌గా సాహ‌సించ‌ని పెళ్లి, ప్రేమ కాన్సెప్ట్ ను త‌న‌దైన రీతిలో చెప్పాడు ప‌రశురామ్. అల్లు శిరీష్ హీరోగా శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తుతో సూప‌ర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో అల్లు శిరీష్ ను హీరోగా నిల‌బెట్టాడు. ముఖ్యంగా హీరో చెప్పిన డైలాగులు ప‌రశురామ్ లోని ర‌చ‌యిత ప‌వ‌ర్ ని తెలియ‌జేశాయి.


ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే ఈ ఏడాది వ‌చ్చిన గీత‌గోవిందం మ‌రో ఎత్తు. విజ‌య్ దేవ‌రకొండ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం 100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ప‌రశురామ్ ను స్టార్ డైరెక్ట‌ర్ గా మార్చేసింది. ఇప్పుడు ఈయ‌న కోసం చాలా మంది యంగ్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. గీతా ఆర్ట్స్ లోనే వ‌ర‌స‌గా మూడో సినిమా చేయ‌బోతున్నాడు ప‌రశురామ్. ఈ బ్యాన‌ర్ లో వ‌ర‌స‌గా మూడు సినిమాలు చేస్తున్న తొలి ద‌ర్శ‌కుడు ప‌రశురామే కావడం విశేషం. అంత ఈజీగా ఎవ‌రికీ మూడో అవ‌కాశం ఇవ్వ‌ని అల్లు అర‌వింద్.. ఈ ద‌ర్శ‌కుడి టాలెంట్ తెలిసి మ‌రో ఆఫ‌ర్ ఇచ్చేసాడు. ప్ర‌స్తుతం క‌థ సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు పరశురామ్. లీడింగ్ హీరోతో త్వ‌ర‌లోనే పెద్ద సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం గీత‌గోవిందం కంటే పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటూ.. ప‌రుశురామ్ ఇలాగే వర‌స విజ‌యాల‌తో దూసుకుపోవాల‌ని ఆశిస్తూ.. ఇలాంటి పుట్టిన‌రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని కోరుకుందాం..Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !