View

త్రివిక్రమ్ చేతుల మీదుగా మిస్ మ్యాచ్ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ 'అరెరే అరెరే' విడుదల  

Monday,November25th,2019, 09:31 AM

'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం  'మిస్ మ్యాచ్'. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ à°ˆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న'మిస్ మ్యాచ్' విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు' సర్టిఫికెట్ ను పొందిందీ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 à°¨ 'మిస్ మ్యాచ్' ను  à°µà°¿à°¡à±à°¦à°² చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు  à°‡à°Ÿà±€à°µà°²à±‡ మీడియాకు అధికారికంగా ప్రకటించారు.


'మిస్ మ్యాచ్' చిత్రంలోని మొదటిపాట *అరెరే అరెరే* ను దర్శకుడు త్రివిక్రమ్ ఈరోజు విడుదల చేసారు.


à°ˆ సందర్బంగా డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ...'మిస్ మ్యాచ్' టైటిల్ కొత్తగానూ,ఆసక్తిని కలిగించేదిగానూ ఉంది. డైరెక్టర్ నిర్మల్ తీసిన సలీమ్ సినిమా తమిళ్, తెలుగులో మంచి విజయం సాధించింది. తెలుగులో అతను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్న 'మిస్ మ్యాచ్' సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. చిత్ర యూనిట్ కు గుడ్ లక్. 'మిస్ మ్యాచ్'  à°«à±à°¯à°¾à°®à°¿à°²à±€ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్ కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. ఇప్పుడు రిలీజ్ అయిన 'అరెరే అరెరే' మెలోడీ సాంగ్, వినాలనిపించేదిగా ఉంది" అన్నారు.


హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ...నా అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ 'మిస్ మ్యాచ్' చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్న అన్నారు. నా మొదటి సినిమా 'ఆట కదరా శివ' సినిమాకు త్రివిక్రమ్ గారు సపోర్ట్ చేశారు. మళ్ళీ ఈ సినిమా సాంగ్ ఆయన చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు అన్నారు హీరో ఉదయ్ శంకర్.


నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ...స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు సాంగ్ రిలీజ్ చెయ్యడం హ్యాపీ à°—à°¾ ఉంది. ఆడియన్స్ కోరుకుంటున్న అన్నీ అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు. ఉదయ్ శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారు. డిసెంబర్ ఆరున చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈరోజు విడుదల అయిన à°ˆ గీతం తరువాత మరో రెండు గీతాలను ఒకదాని తరువాత మరొకటి విభిన్నంగా విడుదల చేయబోతున్నాము అని తెలిపారు. 'à°ˆ చిత్రానికి సంబంధించి ప్రముఖ దర్శకుడు 'క్రిష్' చేతుల మీదుగా  à°µà°¿à°¡à±à°¦à°² అయిన 'మిస్ మ్యాచ్' తొలి ప్రచార చిత్రాలు, విక్టరీ వెంకటేష్ గారు విడుదల చేసిన చిత్రం టీజర్, అలాగే ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేసిన చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకులనుంచి విశేషమైన స్పందన లభించిందన్న విషయాన్ని à°ˆ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి మరోసారి కృతఙ్ఞతలు తెలిపారు.


మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ ఇలియాస్ మాట్లాడుతూ...సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి. 'అరెరే అరెరే' సాంగ్ త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషం. శ్రేష్ఠ గారు ఈ పాటను రచించారు, ఎమ్. ఎమ్. మనస్వి పాడడం జరిగింది. ఆడియన్స్ అందరికి ఈ సాంగ్ నచ్చుతుందని భావిస్తున్నాను" అన్నారు.


డైరెక్టర్ ఎన్. వి.నిర్మల్ మాట్లాడుతూ..'అరెరే అరెరే' పాట à°’à°• మెలోడీ, రొమాంటిక్ నెంబర్ à°ˆ సాంగ్. శ్రోతలకు త్వరగా నచ్చే సాంగ్ ఇది. గిఫ్టన్  à°•à°‚పోజిషన్ లో మనస్వి చక్కగా పాడడం జరిగింది. త్రివిక్రమ్ గారు à°ˆ సాంగ్ రిలీజ్ చెయ్యడంతో ఆడియన్స్ కు à°ˆ సాంగ్ మరింత చేరువవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.


ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగందర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ .
నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !