View

ఆర్.జె సినిమాస్ బ్యానర్ లో సినిమా చేస్తాను - వైశాఖం ప్రెస్ మీట్ లో నాగచైతన్య

Friday,June30th,2017, 11:00 AM

హరీష్‌ని హీరోగా పరిచయం చేస్తూ అవంతిక హీరోయిన్‌గా ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత బి.ఎ.రాజు నిర్మించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. డి.జె. వసంత్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. 'భానుమతి.. భానుమతి', 'కమాన్‌ కంట్రీ చిలకా..', 'ప్రార్థిస్తానే..', వైశాఖం టైటిల్‌ సాంగ్‌.. ఇలా అన్ని పాటలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ చిత్రం పోస్టర్స్‌, ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సోషల్‌ మీడియాలో 'వైశాఖం' థీమ్‌ టీజర్‌కి 31 లక్షల 50 వేలు వ్యూస్‌ క్రాస్‌ చేసి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా జూన్‌ 30న హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో 'వైశాఖం' ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యువసామాట్ర్‌ నాగచైతన్య 'వైశాఖం' చిత్రంలోని పాటల్ని, థియేట్రికల్‌ ట్రైలర్‌ని వీక్షించి చిత్ర యూనిట్‌ని అభినందించి 'వైశాఖం' ప్రోమోస్‌ని రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో హరీష్‌, హీరోయిన్‌ అవంతిక, డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి, నిర్మాత బి.ఎ.రాజు, కెమెరామెన్‌ వాలిశెట్టి వెంకట సుబ్బారావు, లైన్‌ ప్రొడ్యూసర్‌ బి.శివ, కమెడియన్స్‌, భద్రమ్‌, విఘ్నేష్‌ పాల్గొన్నారు. 

 

యువసామ్రాట్‌ నాగచైతన్య మాట్లాడుతూ - ''ఫస్ట్‌ రాజుగారికి థాంక్స్‌ చెప్పాలి. సినిమా రిలీజ్‌ విషయంలోగానీ, పబ్లిసిటీ విషయంలోగానీ, నాకు, అక్కినేని ఫ్యామిలీకి ఆయన ఇచ్చిన సపోర్ట్‌, ఎంకరేజ్‌మెంట్‌కి ఎన్ని థాంక్స్‌ చెప్పినా సరిపోదు. సాంగ్స్‌ చూస్తుంటే మంచి కంటెంట్‌ వుందనిపిస్తోంది. మీ బేనర్‌లో ఇంకో మంచి సినిమా అవుతుందని బాగా నమ్ముతున్నాను. 'వైశాఖం' వంటి మంచి సినిమా చేసిన జయగారికి కంగ్రాట్స్‌. సాంగ్స్‌ అన్నీ చూశాను. విజువల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా వున్నాయి. ఫొటోగ్రఫీ, మ్యూజిక్‌ ఫెంటాస్టిక్‌గా చేశారు. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా వున్నాయి. హరీష్‌, అవంతిక లుక్స్‌ సూపర్‌. ఈ సినిమాతో ఇద్దరు న్యూ కమర్స్‌ని ఇంట్రడ్యూస్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. న్యూ టాలెంట్‌ వస్తేనే ఇండస్ట్రీలో మంచి సినిమాలు వస్తాయి. ఇండస్ట్రీ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. హీరో, హీరోయిన్‌ ఇద్దరికీ బ్రైట్‌ ఫ్యూచర్‌ వుంటుంది. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. 'వైశాఖం' సూపర్‌హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. మంచి కంటెంట్‌ వుంటే ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌లో సినిమా చేస్తాను'' అన్నారు.


డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ - ''ఎవరినైనా హీరోని చూస్తే.. మంచి హీరో, పక్కింటి అబ్బాయిలా వున్నాడు అనుకుంటారు. కానీ నాగచైతన్యని చూస్తే మన ఇంట్లో అబ్బాయిలా అన్పిస్తాడు. అటువంటి మంచి హీరో మా ఫంక్షన్‌కి వచ్చినందుకు చాలా థాంక్స్‌'' అన్నారు.


నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''ఇది మన సినిమా. మన మీడియా సినిమా. అందర్నీ కలవడం చాలా హ్యాపీగా వుంది. హీరో కాక ముందు నుంచీ చైతన్యతో పరిచయం వుంది. మంచి హీరో. మంచి మనిషి ఆయన. ఆయన స్టేటస్‌ ఏమిటో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా వుంటారు. మా మీద అభిమానంతో, ప్రేమతో వచ్చారు. మాకు చాలా హ్యాపీగా వుంది. 'జోష్‌' నుండి నిన్నటి 'రారండోయ్‌' వరకు వరుసగా హిట్‌ మీద హిట్‌ ఇస్తున్నారు. ఆగస్ట్‌లో మరో హిట్‌ కొట్టబోతున్నారు. ఆర్టిస్ట్‌గా, స్టార్‌గా ఎంతో పెద్ద ఎత్తుకి ఎదుగుతున్న చైతు విషెస్‌ మాకు అందించడం చాలా ఆనందంగా వుంది. 'వైశాఖం' జూలై సెకండ్‌ వీక్‌లో రిలీజ్‌ అవుతుంది.


హీరో హరీష్‌ మాట్లాడుతూ - ''నాగచైతన్యగారి సినిమాలు ఏదీ మిస్‌ అవలేదు. అన్నీ చూసాను. ఆయన్ని చూసినప్పుడల్లా నా బ్రదర్‌లా ఫీల్‌ అవుతూ వుంటాను. నాకు బాగా ఇష్టమైన యంగ్‌స్టర్స్‌ హీరోల్లో నాగచైతన్యగారు ఫస్ట్‌ వుంటారు. అలాంటి నాగచైతన్య మమ్మల్ని సపోర్ట్‌ చేయడానికి ఈ ఫంక్షన్‌కి వచ్చినందుకు చాలా థాంక్స్‌. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత మంచి సినిమాలో నేను ఒక భాగమైనందుకు చాలా హ్యాపీగా వుంది. థీమ్‌ టీజర్‌ 3 మిలియన్‌ వ్యూస్‌ క్రాస్‌ చేసింది. మా లాంటి న్యూ కామర్స్‌కి ఎంకరేజింగ్‌గా వుంటుంది. ఈ సినిమా రిలీజ్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నా'' అన్నారు.


హీరోయిన్‌ అవంతిక మాట్లాడుతూ - ''ఈ సినిమా పాటలు, ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇంత మంచి సినిమాలో యాక్ట్‌ చేసే ఛాన్స్‌ ఇచ్చిన రాజుగారికి, జయగారికి థాంక్స్‌. ఈ సినిమా వండ్రఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది'' అన్నారు.


ఫొటోగ్రఫీ వాలిశెట్టి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ - ''ఈ సినిమాని రాజుగారు ఎంతో కష్టపడి ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా నిర్మించారు. అలాగే పబ్లిసిటీ, ప్రమోషన్‌ని అద్భుతంగా చేస్తున్నారు. జయగారు కమిట్‌మెంట్‌తో ప్రాపర్‌గా ప్లాన్‌ చేసి ప్యాషన్‌తో ఈ సినిమా రూపొందించారు. టీజర్స్‌కి, సాంగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. డెఫినెట్‌గా సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుందని కాన్ఫిడెన్స్‌తో వున్నాం. ఇంత మంచి సినిమాకి వర్క్‌ చేసే అవకాశాన్ని ఇచ్చిన రాజుగారికి, జయగారికి నా ధన్యవాదాలు'' అన్నారు.


కమెడియన్‌ భద్రమ్‌ మాట్లాడుతూ - ''ప్రేమమ్‌' చిత్రంలో యాక్ట్‌ చేశాను. నాగచైతన్య ఒక స్టార్‌ కొడుకు అయి వుండి కూడా డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌. ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నాను. ఒక పిక్‌నిక్‌లా 'వైశాఖం' షూటింగ్‌ జరిగింది. ఇంత మంచి సినిమాలో నటించే ఛాన్స్‌ ఇచ్చిన జయగారికి, రాజుగారికి నా థాంక్స్‌'' అన్నారు.


హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్‌ టీమ్‌ వెంకీ, శ్రీధర్‌, రాంప్రసాద్‌, ప్రసాద్‌, తేజ, శశాంక్‌, లతీష్‌, కీర్తి నాయుడు, పరమేశ్వరి, గోవిందరావు, వీరన్న చౌదరి, రాజా బొయిడి, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని కళ్యాణి కామ్రే, షాజహాన్‌ సుజానే, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్‌, డాన్స్‌: వి.జె.శేఖర్‌, ఆర్ట్‌: మురళి కొండేటి, ఫైట్స్‌: వెంకట్‌, రామ్‌ సుంకర, స్టిల్స్‌: శ్రీను, కో-డైరెక్టర్‌: అమరనేని నరేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బారావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్‌, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, ఎడిటింగ్‌, దర్శకత్వం: జయ బి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !