View

4న వస్తోన్న 'ఇదేం దెయ్యం'.. భయపెట్టడమే కాదు నవ్విస్తుంది కూడా!

Tuesday,August01st,2017, 03:06 AM

ఏ.వి ర‌మ‌ణ‌మూర్తి స‌మ‌ర్ప‌ణ‌లో చిన్మ‌య‌నంద ఫిల్మ్స్ ప‌తాకంపై ఎస్. స‌రిత నిర్మిస్తోన్న చిత్రం `ఇదేం దెయ్యం`. శ్రీనాధ్ మాగంటి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సాక్షి క‌క్క‌ర్ , ర‌చ‌న స్మిత్, రుచి పాండే నాయిక‌లు. ర‌చ్చ ర‌వి, కిరాక్ ఆర్.పి కీల‌క పాత్ర‌ధారులు. వి. ర‌వివ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిచ‌గా, బాలు స్వామి సంగీతం అందించారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని ఈనెల 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో చిత్ర యూనిట్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది.


ఈ సంద‌ర్భంగా చిత్ర హీరో మాగంటి శ్రీనాద్ మాట్లాడుతూ - హాస్యానికి పెద్ద పీట వేస్తూ తెర‌కెక్కించిన సినిమా ఇది. భ‌య‌ప‌డే స‌న్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. కానీ ఆ క‌ష్టాలు థియేట‌ర్ కు వ‌చ్చిన ఆడియ‌న్స్ ను న‌వ్విస్తాయి. ముఖ్యంగా ర‌చ్చ ర‌వి, ఆర్ పి తో నా కాంబినేష‌న్ సీన్స్ బాగుంటాయి. సినిమా బాగా వ‌చ్చింది. ఈనెల 4న సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్ష‌కులంతా మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం అని అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు ర‌వి వ‌ర్మ మాట్లాడుతూ - ర‌చ్చ‌ర‌వి, ఆర్.పి, శ్రీనాధ్ ను దృష్టిల్లో పెట్టుకుని క‌థ రాసుకున్నా. నేను అనుకున్న దానిక‌న్నా బాగా న‌టించారు. శ్రీనాధ్ కొత్త కుర్రాడైనా చ‌క్క‌గా న‌టించాడు. కామెడీ హైలైట్ గా ఉంటుంది. హార‌ర్ స‌న్నివేశాలు ప్రేక్షకుల‌ను థ్రిల్ కు గురిచేస్తాయి. సినిమా చూసిన వాళ్లంతా బాగా ఎంజాయ్ చేస్తారు. అన్ని ప‌నులు పూర్తిచేసి ఈనెల 4న రిలీజ్ చేస్తున్నాం. మాకు మంచి డిస్ర్టిబ్యూట‌ర్స్ దొరికారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల‌లో మొత్తం 100 థియేట‌ర్ల‌ల‌లో సినిమా రిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్ష‌కులంతా త‌ప్ప‌కుండా మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం అని అన్నారు.


సంగీత ద‌ర్శ‌కుడు బాలుస్వామి మాట్లాడుతూ - మా దెయ్యాలు భ‌యపెడుతూనే న‌వ్విస్తాయి. అవే స‌న్నివేశాలు సినిమాకు హైలైట్ గా ఉంటాయి. ఇక ఆడియో కు శ్రోత‌ల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. సినిమా కూడా పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని టీమ్ అంతా నమ్ముతున్నాం అని అన్నారు.


డిస్ర్టిబ్యూట‌ర్ రామ‌కృష్ణ మాట్లాడుతూ - మా సంస్థ ద్వారా మొత్తం మూడు జిల్లాల‌లో ఈ సినిమా డిస్ర్టిబ్యూట్ చేస్తున్నాం. సినిమా చూశాం. చాలా బాగా వ‌చ్చింది. పెద్ద స‌క్సెస్ అవుతుంది అని అన్నారు.


హీరోయిన్ సాక్షి క‌క్క‌ర్ మాట్లాడుతూ - ఈ సినిమా నాకు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఇప్ప‌టివ‌ర‌కూ నేను న‌టించిన సినిమాల‌న్నింకంటే భిన్న‌మైన పాత్ర పోషించాను. అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాం అని అన్నారు.


ఈ స‌మావేశంలో యూనిట్ స‌భ్య‌లు ఆర్.పి, ర‌చ‌న స్మిత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


ఇత‌ర పాత్ర‌ల్లో జీవా, గౌతం రాజు, అప్పారావు, అర్షిత్ సాయి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కృష్ణ ప్ర‌సాద్, పాట‌లు: సాయి కుమార్, నేప‌థ్య సంగీతం: ఏలేంద‌ర్, స‌హ‌-నిర్మాత‌లు: ఎమ్. ర‌త్న శేఖ‌ర్ రావు, ఎమ్. మ‌ధుసూద‌న్ రెడ్డి, వి. రామ్ కిషోర్ రెడ్డి, ఎమ్. సౌజ‌న్య‌, నిర్మాత‌: స‌రిత‌, ద‌ర్శ‌క‌త్వం: వి. ర‌వివ‌ర్మ‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !