filmybuzz

View

రేపు గ్రాండ్ గా జయదేవ్ వేడుక.. ఈ 30న భారీగా విడుదల

Monday,June19th,2017, 07:00 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ భారీ స్థాయిలో 'జయదేవ్‌' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను జూన్‌ 20 సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరగనుంది.


జూన్‌ 30న ప్రపంచ వ్యాప్తంగా 'జయదేవ్‌'
ఈ సందర్భంగా నిర్మాత కె.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ - ''యాక్టింగ్‌, డ్యాన్స్‌, ఫైట్స్‌లలో అత్యున్నత స్థాయిలో శిక్షణ పొంది.. కృషి, పట్టుదల, దీక్షతో హీరో కావాలనే లక్ష్యంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు యంగ్‌ డైనమిక్‌ హీరో గంటా రవి. తొలిసారి 'జయదేవ్‌'గా యంగ్‌ డైనమిక్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో పవర్‌ఫుల్‌గా నటిస్తున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న హీరోగా రిస్కీ షాట్స్‌ను సైతం చాలా ఈజ్‌తో చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఇటీవల స్లోవేనియాలో చిత్రీకరించిన సాంగ్స్‌లో సూపర్‌ స్టెప్స్‌ వేసి డ్యాన్స్‌ మాస్టర్స్‌తో శభాష్‌ అనిపించుకున్నారు గంటా రవి. సెట్లో సెంటిమెంట్‌, ఎమోషన్‌ సీన్స్‌లలో రవి నటన చూసి టీమ్‌ సభ్యులందరూ క్లాప్స్‌ కొట్టారు. జయదేవ్‌వంటి పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ని అత్యంత సమర్థవంతంగా పోషించి.. ఆ క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడని డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ.. రవిని ప్రశంసలతో ముంచెత్తారు. అండర్‌ ప్రొడక్షన్‌లోనే ఈ సినిమాకి బిజినెస్‌పరంగా మంచి ఆఫర్స్‌ రావడం చాలా హ్యాపీగా వుంది. జూన్‌ 30న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. 'జయదేవ్‌' చిత్రం తప్పకుండా పెద్ద విజయం సాధించి మా అందరికీ మంచి పేరు తెస్తుంది'' అన్నారు.


'జయదేవ్‌'తో గంటా రవి పెద్ద స్టార్‌ అవుతారు!!
దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ మాట్లాడుతూ - ''విధి నిర్వహణ కోసం తమ కుటుంబాన్ని, జీవితాలను త్యాగం చేసే ఎంతో మంది పోలీస్‌ ఆఫీసర్ల ఇన్‌స్పిరేషన్‌తో 'జయదేవ్‌' క్యారెక్టర్‌ని ప్రత్యేకంగా, డిఫరెంట్‌గా డిజైన్‌ చేసి గంటా రవికి యాప్ట్‌ అయ్యేవిధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నార. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషించడానికి హీరోకి బాగా మెచ్యూరిటీ ఉండాలి. ఆ మెచ్యూరిటీ సాధారణంగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత వస్తుంది. కానీ గంటా రవి ఫస్ట్‌ సినిమాలోనే ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ వున్న హీరోలా చేశారు. డెఫినెట్‌గా 'జయదేవ్‌' పెద్ద హిట్‌ అయ్యి గంటా రవికి పెద్ద స్టార్‌డమ్‌ తెస్తుంది. ఈ చిత్రంలో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే పది భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ వున్నాయి. కథతో లింక్‌ అయి వున్న ఈ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ సినిమాకి హైలైట్‌గా కానున్నాయి. అశోక్‌కుమార్‌ బేనర్‌లో 'ఈశ్వర్‌'తో ప్రభాస్‌ని హీరోగా పరిచయం చేశాము. మళ్ళీ ఇదే బేనేర్‌లో 'జయదేవ్‌' చిత్రంతో గంటా రవిని హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నార. అతని పెర్‌ఫార్మెన్స్‌ గురించి ప్రతి ఒక్కరూ అప్రిషియేట్‌ చేస్తారు. ఈ సినిమాతో గంటా రవి తెలుగు ఇండస్ట్రీలో సెటిల్‌ అవడం ఖాయం. ప్రొడ్యూసర్‌ అశోక్‌కుమార్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా 'జయదేవ్‌' చిత్రాన్ని చాలా లావిష్‌గా నిర్మించారు. మణిశర్మ మ్యూజిక్‌ అదరగొట్టారు. పాటలన్నీ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. పిక్చరైజేషన్‌ కూడా బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించారు. రీసెంట్‌గా రిలీజైన మూడు సాంగ్స్‌కి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది'' అన్నారు.


గంటా రవి, మాళవిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్‌, హరితేజ, శ్రావణ్‌, సుప్రీత్‌, కోమటి జయరామ్‌, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్‌, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్‌, అరవింద్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి, మూల కథ: అరుణ్‌కుమార్‌, రచన: పరుచూరి బ్రదర్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: కృష్ణమాయ, స్టిల్స్‌ నారాయణ, కో-డైరెక్టర్‌: ప్రభాకర్‌ నాగ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.రామమోహన్‌రావు, నిర్మాత: కె.అశోక్‌కుమార్‌, దర్శకత్వం: జయంత్‌ సి. పరాన్జీ.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !