View

పోలీస్ ఆఫీసర్ల జీవితాల్లో మరో కోణం 'కురుక్షేత్రం' లో చూస్తారు - అర్జున్

Sunday,June25th,2017, 06:01 AM

వెండితెరపై మార్షల్ ఆర్ట్స్ కు మంచి గుర్తింపు తెచ్చిన అర్జున్.. ఇమేజ్ నే ఇంటిపేరుగా మార్చుకుని యాక్షన్ కింగ్ గా మారాడు. యాక్షన్ హీరోగా దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచుతుడైన అర్జున్.. ఇప్పుడు తన కెరీర్ లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. 36 ఏళ్ళ సినీ కెరీర్‌లో అరుదుగా త‌క్కువ మంది మాత్ర‌మే చేరుకోగ‌ల శిఖరాన్ని చేరుకున్నారు. ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన యాక్ష‌న్ కింగ్ అరు్జ‌న్ న‌టించిన 150వ చిత్రం `కురుక్షేత్రం`. అర్జున్ ఇమేజ్ కు అనుగుణంగా.. అత్యంత స్టైలిస్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్‌ను హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. ప్యాష‌న్ స్టూడియోస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌. తెలుగుతో పాటు తమిళ్, కన్నడలోనూ విడుదలవుతోన్న ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అరుణ్ వైద్యనాథన్. ఉమేష్‌, సుధాన్‌ సుందరం, జయరాం, అరుణ్‌ వైద్యనాథన్‌ నిర్మాతలు.


పోలీస్ ఆఫీస‌ర్ల జీవితాల్లో మ‌రో కోణం..స్క్రీన్‌ప్లే హైలెట్‌
యాక్ష‌న్ కింగ్ అర్జున్‌ మాట్లాడుతూ - సినిమా ఫీల్డ్‌లోకి వ‌చ్చి 36 సంవ‌త్స‌రాల‌వుతుంది. `కురుక్షేత్రం` నా 150వ సినిమా. 'జైహింద్‌ 2' తర్వాత హీరోగా చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ప్రారంభంలో ఇది నాకు 150వ చిత్రమని తెలియదు. తర్వాత షూటింగ్‌ టైంలో తెలిసింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు సపోర్ట్‌ చేసిన దర్శకులకు, నిర్మాతలకు, నటీనటులకు, టెక్నిషియన్స్‌ అందరికీ థాంక్స్‌. బిజీ క‌మిట్‌మెంట్స్ ఉన్న కార‌ణంగా ముందు ఈ సినిమా చేయకూడదనే అనుకున్నాను. కానీ కథ విన్న తర్వాత నచ్చడంతో చేశాను. నేను ఇప్పటి వరకు 20-30 సినిమాల్లో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించాను. కానీ ఆ సినిమాలో లేని ఎలిమెంట్స్ కురుక్షేత్రం సినిమాలో చూస్తారు. ప్రతి పోలీస్‌ ఆఫీసర్‌ జీవితంలో మరో కోణం ఉంటుందని తెలియజేసే సినిమా ఇది. తెలుగు, తమిళం, కన్నడంలో సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే హైలెట్‌గా ఉంటుంది. అరవింద్‌ కృష్ణ సినిమాటోగ్రఫీ, నవీన్‌ సంగీతం సినిమాకు ప్లస్‌ అవుతాయి. మంచి నటీనటులు, టెక్నిషియన్స్‌తో పనిచేశాను. ఈ సినిమాలో ప్రసన్న చాలా కీలక పాత్ర చేశాడు. మంచి డేడికేషన్‌ ఉన్న నటుడు. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్‌ కూడా కీ రోల్‌ చేసింది. నిర్మాతలు వ్యాపార దృష్టితో కాకుండా సినిమాను మంచి క్వాలిటీతో నిర్మించారు. డిఫరెంట్‌గా ఉండటమే కాదు. నాకు, తెలుగు ఆడియెన్స్‌కు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు.


అర్జున్‌గారి 150వ సినిమాలో న‌టించ‌డం ఓ గౌర‌వం
న‌టుడు ప్రసన్న మాట్లాడుతూ - అర్జున్‌గారు గొప్ప‌నటుడే కాదు. అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలిచే వ్యక్తి. ఆయ‌న కెరీర్‌లో ల్యాండ్‌ మార్క్‌ ఫిలింగా నటించిన 150 చిత్రంలో నేను నటించడం ఓ గౌరవంగా భావిస్తున్నాను. ఇక దర్శకుడు అరుణ్‌తో మంచి అనుబంధం ఉంది. తను డైరెక్టర్‌గా చేసిన సినిమాలోనే స్నేహతో పరిచయమైంది. ఆ ప్రేమ పెళ్ళి వరకు కొనసాగింది. నేను కూడా బివిఎస్‌ రవి దర్శకత్వంలో జవాన్‌ సినిమాలో విలన్‌గా చేస్తున్నాను. అలాగే నిర్మాతలు మంచి ప్యాషన్‌తో సినిమాన నిర్మించారు. వారు భవిష్యత్‌తో తెలుగులో స్ట్రయిట్‌ సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. `కురుక్షేత్రం సినిమా త‌ప్ప‌కుండా అంద‌రినీ మెప్పించే చిత్ర‌మ‌వుతుంది అన్నారు.


న‌మ్మ‌కంగా ఉన్నాం
దర్శకుడు అరుణ్‌ వైద్యనాథన్‌ మాట్లాడుతూ - ప్యాషనేట్‌ స్టూడియోస్‌పై నిర్మాతలు చేసిన సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులను అలరించే సినిమా అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అన్నారు.


మెప్పించే సినిమా
నిర్మాతల్లో ఒకరైన ఉమేష్‌ మాట్లాడుతూ - దర్శకుడు అరుణ్‌గారు యు.ఎస్‌ నుండి మంచి స్క్రిప్ట్‌తో వచ్చి చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా అందరికీ రీచ్‌ కావాలంటే మంచి హీరో కావాలనుకోగానే మాకు అర్జున్‌గారైతే తప్పకుండా న్యాయం చేస్తారనిపించింది. ఇన్వెస్టిగేషన్‌తో పాటు సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌, ఎమోషన్స్‌ అన్ని ఉన్న సినిమాగా మెప్పిస్తుంది అన్నారు.


అరుల్‌ మాట్లాడుతూ - అర్జున్‌గారి 150వ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. దర్శకుడు అరుణ్‌ వైద్యనాథన్‌గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. జూలై నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.


యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శ్రుతి హరిహరన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.. సాంకేతిక నిపుణులు : సంగీతం : నవీన్, సినిమాటోగ్రఫీ : అరవింద్ కృష్ణ, ఎడిటింగ్ : సతీష్ సూర్య, నిర్మాణం : ప్యాషన్‌ స్టూడియోస్‌, దర్శకత్వం : అరుణ్ వైద్యనాథన్.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !