filmybuzz
filmybuzz

View

కొత్తగా చేసిన ప్రయత్నమే మేడ మీద అబ్బాయి - అల్లరి నరేష్

Saturday,August26th,2017, 12:44 PM

ఈ మధ్య మీ సినిమాలు మూస థోరణిలో వుంటున్నాయి. కొంచెం కొత్తగా ప్రయత్నించండి అని చాలా మంది చాలా రోజులుగా అడుగుతున్నారు. కొత్తగా ఏం చేయాలి? ఎలా చేయాలి? అని నేనూ ఆలోచిస్తూనే వున్నాను. అలా ఆలోచించి కొత్తగా నేను చేసిన ప్రయత్నమే మేడమీద అబ్బాయి అన్నారు అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి. ప్రజిత్ దర్శకత్వం వహించారు. నిఖిలా విమల్ కథానాయిక. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై బొప్పన చెంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం హైదరాబాద్‌లో హీరో అల్లరి నరేష్ విడుదల చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - మీలో మరో నటుడున్నారు. ఆ నటుడిని బయటికి తీసుకురావాలి. మీలో వున్న ఆ నటన అంటే నాకు చాలా ఇష్టం. నేను, గమ్యం చిత్రాల తరహాలో సీరియస్ సినిమా చేద్దాం అని కెవ్వుకేక సమయంలో నిర్మాత బొప్పన చంద్రశేఖర్ అన్నారు. అయితే నిర్మాతగా ఆయనకు తొలి సినిమా కావడంతో ఆ సమయంలో అలాంటి సినిమా కరెక్ట్‌కాదని నేనే ఆయనను నిరుత్సాహపరిచాను. ఆ తరువాత నుంచి ఎప్పుడు కలిసినా మీ పంథాను మార్చండి. మిమ్మల్ని ప్రేక్షకులు కామెడీ పాత్రల్లోనే కాదు సీరియస్ పాత్రల్లోనూ చూడటానికి ఇష్టపడుతున్నారు అని చెబుతుండేవారు. గమ్యంలో గాలిశీను నవ్విస్తూనే ఏడిపిస్తాడు. అలాంటి కథ కోసం చాలా కాలంగా వెతికాను. దాదాపు మూడేళ్ల క్రితం అలాంటి కథ దొరికింది. అదే ఒరు వడక్కన్ సెల్ఫీ. నిర్మాత ఈ సినిమా గురించి తెలిసి నన్ను చూడమన్నారు. కామెడీకి థ్రిల్లర్ అంశాల్ని మేళవించి చేశారు. అది నాకు బాగా నచ్చిడంతో రీమేక్ రీమేక్ చేశాం. మలయాళంలో ఈ చిత్రాన్ని నివీన్‌పాల్ చేశాడు. అతని బాడీలాంగ్యేజ్‌ని అనుసరించకుండా నా పంథాలో చేసిన చిత్రమిది. ఫీల్ మిస్సవకూడదనే ఉద్దేశ్యంతో మాతృకను తెరకెక్కించిన దర్శకుడినే ఈ చిత్రానికి తీసుకున్నాం. మంచి సినిమా చేశానని మనస్ఫూర్తిగా చెబుతున్నాను. సెప్టెంబర్ 8న విడుదల కానుంది. సినిమాపై చాలా నమ్మకంతో వున్నాను. ఈ సినిమాతో నా కంటే హైపర్ ఆదికే ఎక్కువ పేరొస్తుంది అన్నారు.


నిర్మాత బొప్పన చంద్రశేఖర్ మాట్లాడుతూ - అల్లరి నరేష్ నటించిన అల్లరి, ప్రాణం, గమ్యం, శంభో శివ శంభో..ఈ నాలుగు చిత్రాలు కలిస్తే ఎలా వుంటుందో మా మేడమీద అబ్బాయి చిత్రం ఆ స్థాయిలో వుంటుంది అన్నారు. హైపర్ ఆది మాట్లాడుతూ ఎక్కడ కామెడీ కావాలో అక్కడ కామెడీ వుంటుంది. ఎక్కడ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కావాలో అక్కడ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వున్న సినిమా ఇది. అల్లరి నరేష్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తుంది అన్నారు.


ఈ కార్యక్రమంలో గేయరచయిత విజయ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎం.ఎస్.కుమార్, సీతారామరాజు పాల్గొన్నారు. అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్. కుమార్, సంగీతం: షాన్ రెహమాన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !