View

ప్రతిరోజు పండగే ట్రైలర్ ని విడుదల చేసిన చిరంజీవిగారి తల్లి అంజనాదేవి

Thursday,December05th,2019, 04:19 AM

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్ర ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా రావు రమేష్ మాట్లాడుతూ...అల్లు అరవింద్ గారు ఈ కథ సింగిల్ సిట్టింగ్ లో ఓకె చేసిన కథ కావడంతో నాకు ఈ సినిమాపై నమ్మకం పెరిగింది. యు.వి క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్లు కలిసి చేసిన సినిమా కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సెకండ్ హాఫ్ లో ఈ సినిమాలోని రెండు సీన్స్ ను మారుతి గారు ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. థియేటర్స్ లో మాత్రమే చూడదగ్గ సినిమా ఇది. మూవీ చూస్తున్న ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ...ఈ సినిమా సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు అందరూ ఎమోషనల్ ఫీల్ అయ్యారు. మారుతి సినిమాలో కొన్ని సీన్స్ లో విపరీతంగా నవ్వించాడు. తేజ్ నాకు బ్రదర్ లాంటివాడు, మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్త్సైన్మెంట్ గా రాబోతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు.


డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ...ట్రైలర్ చూసిన అందరూ బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. నాకు సపోర్ట్ చేసిన నా టీమ్ కు గీతా, యూవీ బ్యానర్స్ కు థాంక్స్. ఈ కథ ముందుగా దిల్ రాజుకు చెప్పినప్పుడు ఆయన సబ్జెక్ట్ బాగుందని ఎంకరేజ్ చేశారు. తేజ్ ఈ కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నాడు. సినిమాలో నటించిన అందరూ బాగా చేశారు. సత్యరాజ్ గారు కథ విని ఎన్నిరోజులు కావాలంటే అన్నిరోజుకు ఈ సినిమాకు వర్క్ చేస్తాను అన్నారు. రావ్ రమేష్ గారి పాత్ర గుర్తుండి పోతుంది. తండ్రిగా, కొడుగ్గా వెరీయేషన్స్ ఉన్న పాత్రలో నటించారు. అంజనాదేవి గారు మా చిత్ర ట్రైలర్ లాంచ్ చెయ్యడం అదృష్టాంగా భావిస్తున్నాను. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్న బన్నీ గారికి స్పెషల్ థాంక్స్ తెలిపారు.


బన్నీవాసు మాట్లాడుతూ...ఈ కథను విని నమ్మి ఒప్పుకున్నందుకు ధన్వవాదాలు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడతాను. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నానని ఇప్పుడు చెప్పగలనని అన్నారు.


రాశిఖన్నా మాట్లాడుతూ...హ్యాపిగా ఉంది. ట్రైలర్ అందరికి నచ్చింది. నాకోసం మంచి పాత్ర రాసిన మారుతి గారికి థాంక్స్. నాకు సపోర్ట్ చేస్తున్న తేజ్ గారికి స్పెషల్ థాంక్స్. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అందరికి నచ్చే సినిమా ఇది అవుతుందని నమ్ముతున్నాను అన్నారు. 


అల్లు అరవింద్ మాట్లాడుతూ...ఈ సినిమాను థియేటర్ లో ఫామిలీ అందరితో పాటు చూస్తే వచ్చే ఆనందం వేరు. మారుతి ఈ సినిమాను చాలా ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు, ఆడియన్స్ దానికి కనెక్ట్ అవుతారు. అంజనాదేవి గారు మా ట్రైలర్ విడుదల చెయ్యడం సంతోషం. తేజ్ సినిమా చేస్తున్నప్పుడు ఇతర పాత్రలకు ప్రాధాన్యం ఇస్తారు. చిరంజీవి గారి దగ్గర ఉన్న ఈ లక్షణం తేజ్ లో ఉండడం విశేషం అన్నారు. 


సాయి తేజ్ మాట్లాడుతూ...చిత్రాలహరి సినిమాతో నా సెకండ్ కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటినుండి మీకు అన్ని మంచి సినిమాలే ఇస్తాను. మా సినిమా ఇంత బాగా వచ్చిందంటే కారణం మా టీమ్, సో మా యూనిట్ సభ్యులకు థాంక్స్ తెలుపుతున్నాను. మారుతి గారు మాతో మంచి ఫీల్ గుడ్ సినిమా చేయించరు. గీతా ఆర్ట్స్, యూవీ బ్యానర్స్ లో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !