View

నయనం లోగో లాంఛ్ విశేషాలు

Tuesday,October03rd,2017, 11:39 AM

లావోస్ మోషన్ పిక్చర్స్ ప‌తాకంపై రూపొందుతున్న మొదటి చిత్రం న‌య‌నం. ఎస్తేర్ నొరోన్హా, నోయెల్ సీన్, శ్రీ మంగం, అర్జున్ ఆనంద్ ప్రధాన పాత్రలలో న‌టిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి వ‌ద్ద ఈగ, మర్యాద రామన్న, మగధీర చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసిన క్రాంతి కుమార్ వడ్లమూడి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవ‌ల పూర్తి చేసుకుంది. ఈ చిత్రం యొక్క టైటిల్ లోగో లాంచ్ హైద‌రాబాద్ లోని ఇనార్బిట్ మాల్ లో పెళ్లి చూపులు చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జ‌రిగింది.


ఈ సంద‌ర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ - న‌య‌నం టైటిల్ తో పాటు లోగో కూడా చాలా బావుంది. స్ర్కిప్టు కూడా కొంచెం విన్నాను ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గారి శిష్యుడి డైర‌క్ష‌న్ లో సినిమా వ‌స్తుందంటే ఎలా ఉండ‌బోతుందో మ‌నం ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. నిర్మాత కూడా చాలా ప్యాష‌నేటెడ్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్టిస్టులంద‌రూ కూడా టాలెంటెడ్ ప‌ర్స‌న్స్. అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు అని తెలిపారు.


ద‌ర్శ‌కుడు క్రాంతి కుమార్ వ‌డ్ల‌మూడి మాట్లాడుతూ - న‌య‌నం టైటిల్ లోగో ఆవిష్క‌ర‌ణ‌కు విచ్చేసిన రాజ్ కందుకూరి గారికి ధ‌న్య‌వాదాలు. టైటిల్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వ‌స్తోన్న సినిమా కూడా క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందని అన్నారు.


నిర్మాతల్లో ఒకరైన శ్రీ రామ్ కందుకూరి మాట్లాడుతూ - మా తొలి చిత్రం న‌య‌నం లోగో లాంచ్ అభిరుచి గ‌ల నిర్మాత రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇటీవ‌ల ఎనౌన్స్ చేసిన న‌య‌నం టైటిల్ కు, థీమ్ ఏంటో గెస్ చేయండంటూ మేము నిర్వ‌హించిన వినూత్నమైన కాంటెస్ట్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. దీపావ‌ళి రోజున మా చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. పోస్ట్ పొడ‌క్ష‌న్ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. న‌వంబ‌ర్ లో సినిమాను విడుద‌ల చేయాల‌న్న ప్లాన్ లో ఉన్నాం అన్నారు.


ఇంకా ఈ టైటిల్ లోగో లాంచ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న న‌టులు నోయ‌ల్‌, శ్రీ, అర్జున్ ఆనంద్ ఒక మంచి సినిమాలో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంద‌న్నారు.


ఈ చిత్రానికి కెమెరా చేతన్ మధురాంతకం , సంగీతంః గీత పూనిక , ఆర్ట్ఃర‌మేష్ , ప్రొడక్షన్ కంట్రోలర్ః చౌదరి , ప్రొడక్షన్ మేనేజర్ః మోహ‌న్ రావు , పిఆర్ఓః కుమార‌ స్వామి , కాస్ట్యూమ్ డిజైనర్ః అజ‌బ్ , రచన సహకారంః టైం నాని , రవి కిరణ్ , కథః లావోస్ మోషన్ పిక్చర్స్ , నిర్మాతలుఃరామ్ కేతు, కృష్ణ మోహన్ , శ్రీ రామ్ కందుకూరి , నరేన్ లేబాకు, స్క్రీన్ ప్లే - దర్శకత్వంః క్రాంతి కుమార్ వడ్లమూడి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Read More !