View

ప్రేమతో మీ కార్తీక్ సాంగ్ రిలీజ్.. సినిమాని విడుదల చేస్తున్న దిల్ రాజు!

Monday,October02nd,2017, 07:18 AM

ర‌మ‌ణ శ్రీ గుమ్మ‌కొండ‌, గీతా మ‌న్నం స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మ‌ణ శ్రీ ఆర్ట్స్ బేన‌ర్‌పై కార్తీకేయ‌, సిమ్ర‌త్ హీరో హీరోయిన్లుగా రూపొందిన‌ చిత్రం `ప్రేమ‌తో మీ కార్తీక్`. రిషి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సాంగ్ రిలీజ్ కార్య‌క్ర‌మాన్ని ఆదివారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్యక్ర‌మానికి మోస్ట్ స‌క్స‌స్‌పుల్ నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.


స‌క్స్‌స్ ఫుల్ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ఈ చిత్ర క‌థ నాకు తెలుసు ఈ సాంగ్ చూస్తుంటే, సాంగ్ చిత్రీక‌రించిన విధానం, సాహిత్యం అంతా బావుంది. మంచి ఫీల్ వున్న‌ ప్రేమ‌క‌థాచిత్ర‌మిద‌ని తెలుస్తుంది. ఈ చిత్రం త్వ‌రలో మా ద్వారా విడుదల‌వుతుంది. ఇలాగే అంద‌రినీ మెప్పించేలా ఉండాల‌ని కోరుకుంటూ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


మైత్రిమూవీస్ న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ - నిర్మాత ర‌వీంద‌ర్‌గారు నాకు యు.ఎస్‌లో బాగా ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తి. ఆయ‌న అన్న త‌న‌యుడితో చేసిన సినిమా ఇది. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ద‌ర్శ‌కుడు రిషి మాట్లాడుతూ - మోస్ట్ స‌క్స‌స్ ఫుల్ నిర్మాత దిల్ రాజు గారు వారి అమూల్య‌మైన కాలాన్ని మా కోసం వెచ్చించి ఈ ఫంక్ష‌న్ ని రావ‌ట‌మే మా మెద‌టి స‌క్స‌స్ గా భావిస్తున్నాము. మా లాంటి చిన్న చిత్రానికి ఆయ‌న అండ దొర‌కడం మా అదృష్టం. వారికి మా మ‌న‌స్పూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటుంన్నాను. అలాగే ఈ సినిమాను జ‌న‌తాగ్యారేజ్ సెట్‌లో చిత్రీక‌రించాం. అడ‌గ్గానే ఆ సెట్‌ను న‌వీన్‌గారు మాకు ఇచ్చారు. ఆయ‌న‌కు థాంక్స్‌. సినిమా బాగా తీశాన‌నే అనుకుంటున్నాను. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది. సినిమా క్లీన్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ అన్నారు.


హీరో కార్తికేయ మాట్లాడుతూ - మా సినిమా సాంగ్‌ను విడుద‌ల చేసిన దిల్‌రాజుగారికి థాంక్స్‌. ఫెయిల్యూర్ నుండి స‌క్స్ ఎలా సాధించాలో దిల్ రాజు గారి కెరీర్ ని ఇన్స్పైర్ గా తీసుకోవాలి. నాకు తెలిసి ఓ కామ‌న్ ఆడియ‌న్ హీరో ని చూసి ద‌ర్శ‌కుడిని చూసి సినిమాకి వెల‌తారు. కాని ప్రోడ్యూస‌ర్ దిల్ రాజు గారి పేరు చూసి సినిమా కి వెల్ల‌టం అనేది ఇప్ప‌డు ట్రెండ్‌. అలాంటి దిల్ రాజు గారి ద్వారా సినిమా చేశామ‌ని అనుకుంటున్నాను. నిర్మాత‌గారు మా బాబాయ్‌. నా కోసం సినిమా చేశారు. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.


నిర్మాతల్లో ఒక‌రైన ర‌వీంద‌ర్ ఆర్ గుమ్మ‌డికొండ‌ మాట్లాడుతూ - మా అన్న‌య్య త‌న‌యుడు కార్తీక్ , పూణే ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ట్ర‌యినింగ్ తీసుకుని ఒక‌ట్రెండు షార్ట్ మూవీస్‌లో న‌టించాడు. మా కార్తీక్‌కు సెకండ్ హీరో, చిన్న క్యారెక్ట‌ర్స్ ఇస్తామ‌ని అవ‌కాశాలు వ‌చ్చాయి. అయితే అందుకు నేను ఒప్పుకోకుండా నేనే నిర్మాత‌గా మారి ఈ సినిమా చేశాను. ద‌ర్శ‌కుడు రిషితో మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌మని అన్నాను. రిషి మంచి క‌థ‌తో నా వ‌ద్ద‌కు వ‌చ్చాడు. క‌థ న‌చ్చ‌డంతో ఈ సినిమా చేశాం అన్నారు.


నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌డికొండ మాట్లాడుతూ - ఆ చిత్రం సాంగ్ రిలీజ్ కి విచ్చేసిన దిల్ రాజు గారికి, మైత్రిమూవీస్ న‌వీన్ గారికి మా యూనిట్ త‌రుపున హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. మా ద‌ర్శ‌కుడు రిషి ని ఈ సాంగ్ రిలీజ్ చేద్దామ‌ని అడిగాము. ఆయ‌న కొంచెం టైం తీసుకున్నారు. టైం తీసుకున్నా ఇలాంటి అద్బుత‌మైన సాంగ్ ని ఇచ్చినందుకు వారికి మా ధ‌న్య‌వాదాలు. చిత్రం మెత్తం ఇంత‌కు మించే వుంటుంది. మా అన్న‌య్య గారి అబ్బాయ్ కార్తిక్ హీరో గా చేస్తున్నాడు. మాకు అన్నివిధాల స‌హ‌క‌రిస్తున్న మీడియా వారికి మా ధ‌న్య‌వాదాలు. ఈ చిత్రం దిల్ రాజు గారి ద్వారా విడుద‌ల కావ‌టం మాలాంటి మంచి చిత్రాల‌కు కొండంత ధైర్యం అనే చెప్పాలి. ప్ర‌త్య‌ఖంగా దిల్ రాజు గారికి మా ధ‌న్య‌వాదాలు. అలాగే అతి త్వ‌ర‌లో చిత్రం యెక్క టీజ‌ర్ ని లాంచ్ చేస్తాము. ఈ నెల‌లోనే చిత్రం విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము అని అన్నారు


కార్తికేయ‌,సిమ్ర‌త్‌, గొల్ల‌పూడి మారుతీరావు, సుమిత్ర‌, ముర‌ళీశ‌ర్మ‌, పృథ్వీ, ప్ర‌గ‌తి, ఝాన్సీ, దువ్వాసి, కారుమంచి ర‌ఘు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సాహిత్యంః శ్రీమ‌ణి, ఎడిట‌ర్ః మ‌ధు, ఆర్ట్ః హ‌రివ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః సాయిప్ర‌కాష్ ఉమ్మ‌డిసింగు, సంగీతంః షాన్ రెహ‌మాన్, లైన్ ప్రొడ్యూస‌ర్ః అశోక్‌రెడ్డి గుమ్మ‌డికొండ‌, నిర్మాతః ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌డికొండ‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః రిషిAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !