filmybuzz
filmybuzz

View

రంగుల రాట్నం స్వీట్, క్యూట్ లవ్ స్టోరీ - చిత్ర శుక్లా, శ్రీ రంజని

Tuesday,January09th,2018, 02:25 PM

అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ నిర్మాణంలో రూపొందిన చిత్రం 'రంగులరాట్నం'. రాజ్‌తరుణ్‌, చిత్రా శుక్లా హీరో హీరోయిన్స్‌. శ్రీరంజని దర్శకురాలు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...దర్శకురాలు శ్రీరంజని మాట్లాడుతూ - ''రంగులరాట్నం ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నా తొలి సినిమా ఇది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌వంటి పెద్ద బ్యానర్‌ ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. మాటలు కూడా రావడం లేదు. నేను సెల్వరాఘవన్‌గారి దగ్గర అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆయన వద్ద 9 ఏళ్లు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఇక సినిమా గురించి చెప్పాలంటే స్వీట్‌, క్యూట్‌ లవ్‌స్టోరీ. సాధారణంగా ప్రేమకథల్లో చిన్నపాటి సంఘర్ణణలుంటాయి. అలాంటి సంఘర్ణణే ఈ సినిమాలో కూడా ఉంటుంది. అది తెరపై చూడటానికి చాలా కొత్తగా ఉంటుంది. నేను తమిళ హీరోలకు కూడా ఈ కథను వినిపించాను. అందరికీ నచ్చింది కానీ..వెయిట్‌ చేయమని చెప్పారు. కొన్ని నెలలు వెయిట్‌ చేశాను. ఆ సమయంలో తెలుగులో ట్రై చేద్దామని అనుకున్నాను. అప్పుడు సినిమాటోగ్రాఫర్‌ మదిగారు స్క్రిప్ట్‌ను ఆర్ట్‌ డైరెక్టర్‌ రాజీవన్‌గారికి వినిపించమని అన్నారు. స్క్రిప్ట్‌ విన్న రాజీవన్‌గారు..కథ బావుంది. అన్నపూర్ణ స్టూడియో యూనిట్‌కు చెప్పమని చెప్పారు. నేను సుప్రియగారిని కలిశాను. నేను నెరేట్‌ చేసిన విధానం నచ్చడంతో..ఆవిడ నాగార్జునగారికి కథను వినిపించమని చెప్పారు. కథ విన్న నాగార్జునగారు..బావుందని చెప్పడంతో సినిమా మొదలైంది. కథ విన్న నచ్చడంతో సుప్రియగారు ఎవరితో ఈ సినిమా చేద్దామని అనుకున్నావ్‌ అని అడిగింది. నాకు అలాంటి ఆలోచనలేం లేవని అన్నాను. అప్పుడు సుప్రియగారు రాజ్‌తరుణ్‌ అయితే బావుంటుందని అన్నారు. నేను స్టార్టింగ్‌ నుండి రాజ్‌తరుణ్‌ సినిమాలు చూస్తుండటం వల్ల తనైతే నా సినిమాకు సరిపోతాడనిపించి ఓకే చెప్పాను. అలా రాజ్‌తరుణ్‌ హీరోగా మా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్‌గా కొత్త అమ్మాయి అయితే బావుంటుందనిపించడంతో ఆడిషన్‌ చేశాం. ఆ ఆడిషన్‌లో చిత్ర శుక్లా సెలక్ట్‌ అయ్యారు. అమ్మాయిలందరికీ అబ్బాయిలేం చేస్తారో బాగానే తెలుసు. అందువల్ల అబ్బాయిల పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కథను రాసుకున్నాను'' అన్నారు.


చిత్ర శుక్లా మాట్లాడుతూ - ''తెలుగులో నా రెండో చిత్రం. అది కూడా అన్నపూర్ణ స్టూడియోలో చేయడం ఆనందంగా ఉంది. కుటుంబ బాధ్యతలను కూడా నిర్వహించే నెక్ట్స్‌ డోర్‌ గర్ల్‌ పాత్రలో కనపడతాను. రాజ్‌తరుణ్‌ చాలా మంచి కోస్టార్‌. తనతో వర్క్‌ చేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. సెట్స్‌లో ఇద్దరం బాగా మాట్లాడుకునేవాళ్లం. తను షూటింగ్‌ సమయంలో బాగా సపోర్ట్‌ అందించారు. రంజనిగారు దర్శకత్వంలో చేయడానికి కష్టమనిపించలేదు. ఎందుకంటే ఆవిడ సీన్స్‌ చేయడానికి ముందు చేసి చూపించేవారు'' అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !