View

సమ్మోహనం రొమాంటిక్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్!

Wednesday,May23rd,2018, 09:49 AM

సుధీర్ బాబు, అదితీ రావ్ హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ''సమ్మోహనం'' చిత్రం జూన్ 15న విడుదలకు ముస్తాబవుతోంది. ''పెళ్లిచూపులు'' ఫేమ్ వివేక్ సాగర్ స్వరాలందించిన ఈ చిత్రంలో మొత్తం 4 పాటలు ఉన్నాయి. ''ఊహలు ఊరేగే గాలంతా'' పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి, ''ఓ చెలి తార'',''కనులలో తడిగా'' పాటలను రామజోగయ్యశాస్త్రి రచించారు. ''మనసైనదేదో వరించిందిలా... తలపై తరంగమై తరిమిందిలా... వలపో, పిలుపో, మురుపో.. ఏమో !... అంత వింతే ! అందే దెంతో ! '' అనే పాటను ప్రముఖ కవి 'ఇంద్రగంటి శ్రీకాంత శర్మ' విరచించారు. ఇటీవల ఆన్ లైన్లో విడుదలైన ఈ పాటకు విశేషాదరణ లభిస్తోంది.


ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ - ''ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ జగమెరిగిన కవి. ఆయన ఎంత గొప్ప రచయితో ,పేరొందిన సంపాదకులో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాపు గారు తీసిన ''కృష్ణావతారం'' సినిమాతో ఆయన పాటల రచయితగా కూడా మారారు. అందులో ఆయన 'చిన్నారి నవ్వు- చిట్టి తామర పువ్వు' పాట రాశారు. ఆ తర్వాత జంధ్యాలగారి 'నెలవంక'లో ఆరు పాటలు రచించారు. ఆ తరువాత కూడా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ''రెండు జెళ్ళ సీత' లో ''పురుషుల్లో పుణ్యపురుషులు వేరు'' పాట ''పుత్తడి బొమ్మ'' లో రెండు పాటలు, 'రావు గోపాలరావు' లో 'కులుకులమ్మ చూసిందిరో' పాట, కృష్ణ మూర్తి - కుక్క పిల్లలు 'టెలీఫిల్మ్లో ఒక పాట రాశారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'గోల్కొండ హై స్కూల్' కోసం 'ఏనాటివో రాగాలు', ''అంతకుముందు ఆ తరువాత'' చిత్రం కోసం 'నా అనురాగం' అనే పాటను రచించారు. మా ''సమ్మోహనం'' లో కూడా ఏదైనా పాటను రాయించమని దర్శకుడ్ని నేనే కోరాను. ఆరోగ్యం అంతగా సహకరించని పరిస్థితుల్లో కూడా అద్భుతంగా పాట రాసారు శ్రీకాంత శర్మ గారు. 74 ఏళ్ళ వయసులో ఇంత ఫుల్ రొమాంటిగ్గా రాస్తారని నేను ఊహించలేదు. కవిత్వానికి వయసుతో సంబంధం లేదని ఈ పాట వింటే ఒప్పుకుంటారు. శ్రీకాంత్ శర్మ గారి పాటతో ఈ ఆల్బంకే ఒక నిండుతనం వచ్చింది. ఈ పాటలు ఎంత హాయిగా ఉంటాయో, సినిమా కూడా అంతే హాయిగా ఉంటుంది. ఒక తీపి గుర్తులా నిలిచిపోయే సినిమా ఇది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం జూన్ 15న విడుదల కానుంది" అని తెలిపారు.


దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ - ''మా నాన్న గారు అనుభూతి కవిత్వానికి పెట్టింది పేరు. ఒక నార్మల్ పర్సన్ ని ఓ గ్లామర్ స్టార్ ప్రేమించడం, అతని బైక్ మీద విహరించడం లాంటివి భావోద్వేగానికి గురి చేసే అంశాలు. మనసులో పొంగి పొరలే ఆ ఉద్వేగాన్ని ఒడిసి పట్టే పాట ఇది. నాన్న గారికి సందర్భం చెప్పగానే రాత్రికి రాత్రి పాట పూర్తి చేసేసారు. 'లోనజడి పిలిచేనా ! పూలనది పలికేనా ! లాంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్స్ రాసారాయన. ఈ పాట చిత్రీకరణ కూడా చాలా బాగా కుదిరింది" అని చెప్పారు.


à°¨‌టీన‌టులు:
సుధీర్‌బాబు, అదితిరావు హైద‌à°°à°¿, à°¨‌రేశ్‌, à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణి, పవిత్రా లోకేష్ , నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌à°°à°¿ à°•à°¿à°°‌ణ్‌, à°¹‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శిశిర్‌à°¶‌ర్మ,అభయ్ ,హర్షిణి à°¤‌దిత‌రులు.


సాంకేతిక నిపుణులు:
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. à°°‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్ కుమార్‌, ఫైట్స్ :రామకృష్ణ , ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: à°¯‌స్ . à°°‌వీంద‌ర్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌; డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌à°«à±€: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, ,నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, à°°‌à°š‌à°¨‌- à°¦‌ర్శ‌à°•‌త్వం: మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿.


సాంగ్
పల్లవి:
మనసైనదేదో వరించిందిలా
తలపే తరంగమై తరిమిందిలా
వలపో, పిలుపో, మురుపో..ఏమో!
అంతా వింతే! అందే దెంతో!
చరణం – 1
తనివార నాలో వెలుగాయె
చిరుయెండ చాటు వానాయె
లోనజడి – పిలిచేనా!
పూలనది – పలికేనా...
పైనా లోనా వేడుకలే
అందే దెంతో, దేనికదే!
అరుదైన రాగ రవమే వెంటాడెనా!
మరుమల్లె తావి వరమై జంటాయెనా
చిగురంత చాలులే! సరేనా!
జగమంత నేనై జయించేనులే
వలపే వసంతమై విరిసిందిలే
కలలూ చెలిమీ కలిసే వేళ
నాలో నువ్వే నీలో నేనే...


Lyric - INDRAGANTI SRIKANTHA SARMA
Music - VIVEK SAGAR
Singer - VIVEK SAGAR
Director - MOHANAKRISHNA INDRAGANTI
Producer - SIVALENKA KRISHNA PRASAD



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !