View

గుర్తుండిపోయే మంచి సినిమా పడి పడి లేచె మనసు -శ‌ర్వానంద్‌

Tuesday,December25th,2018, 03:19 PM

శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు'. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 21న విడుద‌లైన ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి బ్ర‌హ్మాండ‌మైన స్పంద‌న ల‌భిస్తున్న‌ది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో చిత్ర బృందం పాత్రికేయుల స‌మావేశాన్ని నిర్వ‌హించింది.


న‌టుడు శ‌త్రు మాట్లాడుతూ - మంచి సినిమాలో అవ‌కాశం ఇచ్చిన నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి, ద‌ర్శ‌కుడు హాను రాఘ‌వ‌పూడికి కృత‌జ్ఞ‌త‌లు. సినిమా చూసిన‌ప్పుడు శ‌ర్వానంద్ పోషించిన సూర్య పాత్రే క‌నిపించింది. ఆయ‌న న‌టించిన కొన్ని ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు చూస్తుంటే నాకు క‌న్నీళ్లొచ్చాయి. ఇప్ప‌టివ‌ర‌కు నేను చేసిన పాత్ర‌ల‌తో పోలిస్తే ఈ సినిమాలో క్యారెక్ట‌ర్‌లో చాలా వేరియేష‌న్స్ ఉన్నాయి. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథతో పాటు చాలా సినిమాల్లో సీరియ‌స్ పాత్ర‌లు చేశాను. ఇలాంటి క్యారెక్ట‌ర్స్ త‌ర్వాత డిఫ‌రెంట్‌గా ఓ కామెడీ పాత్ర చేయ‌డం ఆనందంగా ఉంది. న‌టుల‌ను వైవిధ్య‌ంగా చూపించే ద‌ర్శ‌కులు అరుదుగా ఉంటారు. హ‌ను రాఘ‌వ‌పూడి న‌న్ను కొత్తగా ఈ సినిమాలో చూపించారు అని తెలిపారు.


క‌ల్పిక మాట్లాడుతూ - బ్యూటిఫుల్ విజువ‌ల్స్‌, సెన్సిబుల్ సీన్స్‌తో కూడిన సినిమాలు త‌క్కువ‌గా వ‌స్తాయి. అలాంటి సినిమాల జాబితాలో ప‌డి ప‌డి లేచె మ‌న‌సు టాప్‌గా నిలుస్తుంది. మ్యూజిక‌ల్‌గా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సూర్య‌, వైశాలి కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. ఇందులో శాలిని అనే డాక్ట‌ర్ పాత్ర చేశాను. తొలి ప్ర‌య‌త్నంలోనే నిర్మాత సుధాక‌ర్ పెద్ద విజ‌యాన్ని అందుకున్నారు. భ‌విష్య‌త్తులో ఆయ‌న మ‌రిన్ని స‌క్సెస్‌లు అందుకోవాలి. కొత్త‌వాళ్ల‌ను ప్రోత్స‌హిస్తూ మంచి సినిమాలు తీయాలి అని చెప్పారు.


నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి మాట్లాడుతూ - సినిమాను అంద‌రూ చ‌క్క‌గా ఆద‌రిస్తున్నారు అని తెలిపారు.


శ‌ర్వానంద్ మాట్లాడుతూ - సినిమా ఆంగీక‌రించే ముందు ఓ గుర్తుండిపోయే మంచి సినిమా అవుతుంద‌ని న‌మ్మాను. ఇప్పుడు అదే న‌మ్మ‌కంతో ఉన్నాం. ఆల్బ‌మ్‌లో ప‌డి ప‌డి లేచే మ‌న‌సు నా సినిమా అని గ‌ర్వంగా చెప్పుకునేలా ఉంటుంది. చాలా మంది ఫోన్ చేసి మంచి సినిమా బాగుంద‌ని అంటున్నారు. ప్ర‌థ‌మార్థం అద్భుతంగా చెబుతున్నారు. ద్వితీయార్థంలో కొన్ని లోపాలున్నాయి అంటున్నారు. వాటిని స‌రిదిద్దుకుంటూ ముందుకు సాగ‌డ‌మే నా ప‌ని. మంచి సినిమాతో మ‌ళ్లీ మీ ముందుకు వ‌స్తాను. ఈ సినిమాను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ అని అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !