View

నెక్ట్స్ ఏంటీ ట్రైలర్ లాంచ్ విశేషాలు

Saturday,November17th,2018, 03:32 PM

తమన్నా,సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం 'నెక్స్ట్ ఏంటి'.. బాలీవుడ్ టాప్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవదీప్, పూనమ్ కౌర్ లు ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా, ఇటీవలే ఫస్ట్ లుక్ ని, టీజర్ ని రిలీజ్ చేసారు.. టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగ తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసారు..ఈ కార్యక్రమం హైదరాబాద్ లో జరగగా దర్శకుడు కునాల్ కోహ్లీ, సందీప్ కిషన్, నవదీప్, తమన్నా , సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ తదితరులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా దర్శకుడు కునాల్ కోహ్లీ మాట్లాడుతూ.. ఈ సినిమా స్క్రిప్ట్ ను ఫస్ట్ నేను శరత్ బాబు గారికి పంపాను అయన ఎంతో థ్రిల్ గా ఫీల్ అయ్యి నన్ను హైదరాబాద్ కి రమ్మన్నారు. ఫాదర్ అండ్ డాటర్ మధ్య సీన్స్ చాల బాగున్నాయన్నారు. ఇండియాన్ కల్చర్ ని తెలిపే సినిమా ఇది.. ఒక సినిమా కి భాష ఇబ్బంది కాదు.. ఏ భాషలోనైనా సినిమా బాగుంటే ఆడుతుంది అన్నారు.


హీరో నవదీప్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినందుకు కునాల్ గారికి చాల థాంక్స్. ఈ సినిమాలో తమన్నా డబ్బింగ్ బాగుంది. తన హార్డ్ వర్క్ చాల బాగుంది.. సందీప్ చాల బాగా యాక్ట్ చేసాడు. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. సినిమా ట్రైలర్ లో ఉన్న కంటెంట్ వేరు సినిమాలో ఉన్న ఫీల్ వేరు. యూత్ ని ఆకట్టుకోవాలని అలా ట్రైలర్ కట్ చేసారు. ఈ సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను.


హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ముందుగా కునాల్ గారు దర్శకుడు అనగానే బాలీవుడ్ సినిమా అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది తెలుగు సినిమా అని.. కథ వినగానే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సినిమా లోని నా లుక్ చాల బాగుంది. కునాల్ గారు నన్ను హీరో గా తీసుకున్నందుకు చాల థాంక్స్. నా పాత్ర బాగుందంటే అది కునాల్ క్రెడిట్. మ్యూజిక్ చాల బాగుంది. నేను వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్ లో నాకు చాల బాగా నచ్చిన ప్రొడ్యూసర్ కిరణ్ గారు. ఆ తర్వాత నేను బాగా కంఫర్ట్ ఫీల్ అయిన ప్రొడ్యూసర్స్ అక్షయ్ గారు. తమన్నా తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్నారు.


హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ.. తెలుగు సినిమా రోజు రోజు కి చేంజ్ అయిపోతుంది.. ఈ సినిమాలు ఇండియా మొత్తం తెలిసిపోతున్నాయి. నేను ముంబై లో పుట్టినా తెలుగు సినిమా నాకు చాల ముఖ్యం. కునాల్ గారికి బిగ్ వెల్ కం. మీరు మీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని కోరుకుంటున్నాను. సూపర్ హిట్స్ చేయాలనీ కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి సినిమా కథ విన్నప్పుడు చాల ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇందులో నా క్యారెక్టర్ నేనే ప్లే చేస్తున్నానా అనిపించింది. సందీప్ తో యాక్ట్ చేయడం చాల బాగా అనిపించింది. నవదీప్ కళ్ళతో నటించే యాక్టర్. వారితో పనిచేయడం కొత్తగా అనిపించింది. సినిమా మొత్తం చాల ఎంజాయ్ చేస్తూ చేసాం. డిసెంబర్ లో ఈ సినిమా వస్తుంది.. మీ అందరు తప్పక ఆదరించాలి అన్నారు.


నటీనటులు: తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవదీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్, లారిస్సా
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: కునాల్ కోహ్లీ
నిర్మాతలు: రైనా జోషి, అక్షయ్ పూరి
సినిమాటోగ్రఫీ: మనీష్ చంద్ర భట్
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం రామజోగయ్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైన్: కిర్ స్టెన్ బ్రూక్ (UK)
డైలాగ్స్: గోపు కిషోర్ రెడ్డి
సౌండ్ డిజైన్: దారా సింగ్
అసోసియేట్ ప్రొడ్యూసర్ : సతీష్ సాల్వి, సంజన చోప్రా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : షాజహాన్, శివప్రసాద్ గుడిమిట్ల
PRO: వంశీ-శేఖర్
రిలీజ్ : శ్రీ కృష్ణ క్రియేషన్స్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !