View

యుద్ధం శ‌ర‌ణం గురించి గొప్పగా చెప్పింది - రాజమౌళి

Monday,August28th,2017, 08:10 AM

యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `యుద్ధం శ‌ర‌ణం`. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైదరాబాద్‌లో జ‌రిగింది. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించిన పాటల్ని ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. కీరవాణి సీడీలను ఆవిష్కరించి రాజమౌళికి అందించారు. ఈ సంద‌ర్భంగా...


ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ - మా ఆవిడకి ఓ పట్టాన ఏదీ నచ్చదు. నా సినిమాలో అయినా పాయింట్‌ నచ్చకపోతే నిర్మొహమాటంగా చెబుతుంది. నా సినిమాలకు తప్ప బయటి సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ చెయ్యదు. కృష్ణ వచ్చి కథ, క్యారెక్టర్లు వివరించాక.. ‘బాహుబలికి మనం ఎంత ప్రీ వర్క్‌ చేశామో.. కృష్ణ కూడా అంతే చేశాడు. ఈ సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది’ అని మొదటిసారి వేరే సినిమా గురించి గొప్పగా మాట్లాడింది. అప్పుడే ఈ సినిమా మీద నమ్మకం ఏర్పడింది. షూటింగ్‌ చూడ్డానికి సెట్‌కెళితే.. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంటే దానిని కెమెరాతో షూట్‌ చేస్తునట్లుగా అక్కడి వాతావరణం ఉంది. దాంతో నా నమ్మకం మరింత బలపడింది. ఆదివారం మధ్యాహ్నాం ట్రైలర్‌ చూశాక ఈ సినిమా సూపర్‌హిట్‌ అవుతుందనిపించింది. చైతన్య కథలు ఎంచుకునే తీరు నచ్చింది. విలన్‌గా శ్రీకాంతగారి గెటప్‌ బావుంది. వివేక్‌సాగర్‌ సంగీతం చక్కగా కుదిరింది అని అన్నారు.


హీరో నాగచైతన్య మాట్లాడుతూ - టీజ‌ర్ విడుద‌లైన‌ప్పుడు వ‌చ్చిన పాజిటివ్ రెస్పాన్స్ చూసి మా యూనిట్‌కు ఎంతో బ‌లం వ‌చ్చింది. ఈ సినిమా ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చిందంటే కార‌ణం సాయికొర్ర‌పాటిగారే. ఎందుకంటే సినిమాలో 70 శాతం మంది కొత్త‌వారే. కొత్త‌వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేసే సాయిగారు మమ్మ‌ల్ని ముందుండి న‌డించారు. నాది, ఈ సినిమా డైరెక్ట‌ర్ కృష్ణ‌ది డేట్ ఆఫ్ బ‌ర్త్ ఒక‌టే. చిన్న‌ప్ప‌ట్నుంచి క‌లిసి చ‌దువుకున్నాం. సెప్టెంబ‌ర్ 8న విడుద‌ల‌య్యే ఈ సినిమా యుద్దంలో త‌ను డైరెక్ట‌ర్‌గా గెలిచి నిలుస్తాడు. నికేత్ విజువ‌ల్స్ కార‌ణంగా సినిమాలో అంద‌రూ బాగా క‌న‌ప‌డుతున్నారు. ఓ సామాన్యుడు పవర్‌ఫుల్ విల‌న్‌పై ఎలా గెలిచాడు అన్నది కథ. ఇందులో హీరో ఎక్కడా వెపన్‌ ఉపయోగించడు. వయలెన్స్‌ ఉండదు. సోషల్‌ మీడియా, టెక్నాలజీ, ఇంటెలిజెన్స్‌ను మాత్రమే తన ఆయుధాలుగా వాడతాడు. వివేక్‌సాగర్‌ సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుంది.సాధార‌ణంగా నా సినిమాల‌కు అభిమానులు వ‌చ్చి మ‌మ్మ‌ల్ని కలుస్తుంటారు. కానీ నేనే ఈసారి అభిమానుల‌ను వ‌చ్చి క‌లుస్తాను. ఎప్పుడు వ‌స్తాన‌నేది త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను అన్నారు.


ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ - సాయి కొర్ర‌పాటి, నాగ‌చైత‌న్య‌ల‌కు ఆల్ ది బెస్ట్‌. వీరితో పాటు కార్తికేయ‌కు ఆల్ ది బెస్ట్‌. ఎందుకంటే లైన్ ప్రొడ్యూస‌ర్‌గా ఇది త‌న‌కు తొలి సినిమా.పెళ్లిచూపులుకు సంగీతం అందించిన‌ వివేక్‌సాగర్‌ పాటలు కొత్తగా ఉన్నాయి. టీమ్‌కి అభినందనలు అని చెప్పారు.


సంగీత దర్శకుడు వివేక్‌సాగర్‌ మాట్లాడుతూ - పాటలు బాగా రావడానికి నా క్కడి కృషే కాదు. నా టీమ్‌ అందరి కృషి ఉంది’’ అని చెప్పారు. డి.సురేశబాబు, రానా, ఎస్‌.ఎస్‌.కార్తికేయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


డైరెక్ట‌ర్ కృష్ణ ఆర్‌.వి.మారిమ‌త్తు మాట్లాడుతూ - నా అమ్మ త‌ల్లిదండ్రులు, సిస్ట‌ర్‌కు థాంక్స్‌. చైత‌న్య నా బెస్ట్ ఫ్రెండ్. నన్నెంతో ఎంక‌రేజ్ చేశాడు. నేను ఈరోజు ఇక్క‌డ నిల‌బ‌డి ఉన్నానంటే కార‌ణం చైత‌న్య‌నే. సురేష్‌బాబుగారు ఎంతో గైడ్ చేశారు. సాయికొర్ర‌పాటిగారే అమేజింగ్ ప్రొడ్యూస‌ర్‌. ఆయ‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. ఆయ‌న‌కు థాంక్స్‌. నా టీంకు థాంక్స్‌ అన్నారు.


రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ - నేను చిన్న‌ప్ప‌ట్నుంచి ఇంట్లోవాళ్ల‌తో యుద్ధం చేస్తూనే ఉన్నాను. స్కూళ్లో పాస్ కావ‌డానికి ఓ యుద్ధం. ఇంట్లోవాళ్ల‌ని మేనేజ్ చేయ‌డానికి ఓ యుద్ధం. ఇలాంటి స‌మ‌యంలో చైత‌న్య చ‌క్క‌గా చ‌దివి పాస‌య్యేవాడు. వాడిని చూసి నేర్చుకోమ‌ని ఇంట్లోవాళ్లు అనేవాళ్లు. అందుకే చైత‌న్య అంటే చిన్న‌ప్ప‌ట్నుంచి నాకు టార్చ‌రే. ఇక సినిమా గురించి చెప్పాలంటే చైత‌న్య ఎప్ప‌టి నుండో తెలుసో ద‌ర్శ‌కుడు కృష్ణ కూడా అప్ప‌టి నుండే తెలుసు. చైత‌న్య‌కు మంచి ఫ్రెండ్‌. వీరి మ‌ధ్య ఫ్రెండ్‌ఫిప్ కార‌ణంగానే సినిమా బాగా వ‌చ్చింద‌ని అనుకున్నాం. నాకు నా సినిమాలంటే ఎంత ఇష్ట‌మో. చైత‌న్య సినిమాల‌న్నా, అంతక‌న్నా ఎక్కువ ఇష్టం. ఈ సినిమా ఏడాది విడుద‌లైన సినిమాలన్నింటికంటే పెద్ద హిట్ చిత్రంగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను. టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్ర యూనిట్ ను అభినందించారు.


ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !