నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఆంధ్ర, తెలంగాణా రాష్టాల సి.యం లను, వారి కుటుంబ సభ్యులను కలుసుకునేలా చేస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ నెల 12న థియేటర్స్ కి వస్తోంది.
కాగా ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ షో ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ స్పెషల్ షోకి ఆంధ్ర, తెలంగాణా రాష్టాల సి.యం లు వారి కుటుంబ సభ్యులు హాజరవ్వబోతున్నారని సమాచారమ్. కెసిఆర్ ఆయన భార్య, కూతురు కవిత, కొడుకు కెటిఆర్ ఈ స్పెషల్ షో కి హాజరవ్వబోతున్నారట. మరోవైపు నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణితో పాటు కొంతమంది బాలయ్య కుటుంబ సభ్యులు ఈ స్పెషల్ షో కి హాజరవ్వబోతున్నారని సమాచారమ్. ఇంకా కొంతమంది మంత్రులు, సినీ ప్రముఖులు కూడా ఈ షోకి హాజరవ్వబోతున్నారట. క్రిష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఈ చిత్ర నిర్మాతలు, వారి కుటుంబ సభ్యులు కూడా ఈ స్పెషల్ షో చూడబోతున్నారని సమాచారమ్. ఈ స్పెషల్ షో స్ర్కీనింగ్ హైదరాబాద్ లో జరగనుందని తెలుస్తోంది. సో... ఈ షో కోసం రెండు తెలుగు రాష్ట్రాల సి,యం లు కలవబోతున్నారు. మరి ఈ ఇద్దరూ ఈ సినిమా చూసిన తర్వాత ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం.