'శ్రీమంతుడు' చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు తల్లిగా సుకన్య నటించింది. తండ్రిగా జగపతిబాబు నటించాడు. ముందుగా మహేష్ బాబు తల్లి పాత్ర చేసే అవకాశం నటి సుధను వరించిందట. డైరెక్టర్ కొరటాల శివ ఈ పాత్ర కోసం సుధను తీసుకుందామని భావించి ఆమెను అప్రోచ్ అయ్యాడట. పాత్ర గురించి తెలుసుకున్న సుధ నో చెప్పిందట. ఎందుకు సుథ ఆ పాత్రకు నో చెప్పిందనే వివరాల్లోకి వెళితే...
ఈ మధ్య తల్లి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉండటంలేదు. అందుకే 'శ్రీమంతుడు' లోని తల్లిని పాత్రను వదులుకున్నాను. వంశీ, మురారి, అతడు, దూకుడు సినిమాలు మహేష్ తో కలిసి నటించాను. కానీ 'శ్రీమంతుడు' చిత్రంలోని తల్లి పాత్రకు ఇంపార్టెన్స్ లేకపోవడంతో వదులుకున్నాను'' అని చెప్పింది నటి సుధ
ఫైనల్ గా 'పెద్దరికం' చిత్రం సెంటిమెంట్ ని పరిగణనలోకి తీసుకుని సుకన్యను మహేష్ బాబు తల్లిగా నటింపజేసాడు కొరటాల శివ. 'పెద్దరికం' చిత్రంలో జగపతిబాబు, సుకన్య జంటగా నటించిన విషయం తెలిసిందే. మొత్తం మీద సుధ వదిలేసిన పాత్రలను సుకన్య చేసిందన్నమాట.